Lulu Hypermarket: హైదరాబాద్ నగరంలోని లులు హైపర్ మార్కెట్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఇతర హైపర్ మార్కెట్లలో దొరకని వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ దొరికే అనేక రకాల ఉత్పత్తులే లులును ఇతర హైపర్ మార్ట్స్‌తో పోల్చితే ప్రత్యేకంగా నిలబెడతాయి. అలాంటి, లులు హైపర్‌మార్కెట్‌లో ఇప్పుడు రిపబ్లిక్ డే సేల్ జరుగుతోంది. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో దాదాపు 10 వేలకుపైగా వస్తువులు, ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
Read Also: గ్రిల్, టెయిల్ లైట్ల డిజైన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్.. 2026 చివర్లో Skoda Slavia Facelift లాంచ్
ఇక, లులు హైపర్ మార్కెట్‌లో ఎంపిక చేసిన వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. గ్రాసరీస్, ఫ్రెష్ ఫుడ్, బేకరీ ఐటెమ్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు, పాల పదార్థాలు, ఐస్‌క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వంట సామగ్రి, సౌందర్య ఉత్పత్తులు తదితర వస్తువులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఇక, లులు ఫ్యాషన్ స్టోర్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నడుస్తోంది. ఇది ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది. దీంతో పాటు బ్రాండెడ్ వస్త్రాలపై ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్ కూడా ఇస్తున్నారు. 15కి పైగా బ్రాండ్లు ఇందులో పాల్గొంటున్నాయి. అలాగే, బెడ్‌షీట్లు, కాలేజీ బ్యాగులు, లగేజ్ బ్యాగులు 70 శాతం తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి.
Read Also: Cyber Scam: అమెరికా కల చూపి.. భారతీయ మహిళతో రూ.16 లక్షలు కొట్టేసిన రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్?
అయితే, లులు ఎలక్ట్రానిక్స్ విభాగమైన లులు కనెక్ట్‌లో కూడా ఈ సేల్‌లో భారీ ఆఫర్లు అందిస్తున్నారు. ఎంపిక చేసిన టీవీలు, ఏసీలపై 60 శాతం వరకు డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. మొబైల్ ఫోన్స్, ఐఫోన్లు, మాక్‌బుక్‌లను కూడా తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వీటితో పాటు స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ ఇయర్‌బడ్స్, బ్లూటూత్ స్పీకర్లు, ప్రింటర్లు కూడా ఆఫర్లలోనే లభిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, గ్యాస్ స్టౌవ్‌లు వంటి గృహోపకరణాలపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. అలాగే, బ్యాంక్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. ఈ సేల్ సమయంలో హైపర్‌మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.