NTV Telugu Site icon

Arora Colleges: ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలు.. ఇది నిరంతర ప్రక్రియ..

Arora Colleges

Arora Colleges

అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క స్నాతకోత్సవ వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు.. అరోరాస్ కాలేజీ స్నాతక్ 2022 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్ కరుణ గోపాల్, సీ.ఆర్. రావుస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వెంకటరామన్, అరోరాస్ కళాశాల చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ రాజబాబు, ప్రిన్సిపాల్ విశ్వనాథ్లు పాల్గొన్నారు.. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల అరోరా డిగ్రీ కాలేజీ లో 2019, 2020, 2021, 2022 విద్యా సంవత్సరంలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందజేశారు..

ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ.. ఉన్నత విద్య లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ఇది నిరంతర ప్రక్రియన్నారు.. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడం కోసం కర్క్యులంలో ఎలాంటి రిఫామ్స్ తీసుకరావాలో, టీచింగ్, లెర్నింగ్ లలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలో నిరంతరం కొనసాగుతోందన్నారు.. పారిశ్రామికవేత్తలు, పరిశోధన సంస్థలతో సమన్వయం చేసుకుని కోర్సులను డిజైన్ చేశామన్నారు.. సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని స్టూడెంట్ ఎకడమిక్ వెరఫికేషన్ సర్వీస్ ను నూతనంగా లాంచ్ చేశామన్నారు.. దేశంలో మొదటి సారి తెలంగాణ లో ఈ సర్వీసు ను అందుబాటులోకి తెచ్చామన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ఈ సర్వీసు ను తీసుకొచ్చామన్నారు.. కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీ ల సహకారం తో డిగ్రీ విద్యార్థులకు ఐటీ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు.. అరోరా డిగ్రీ కాలేజీ తెలంగాణ లో బెస్ట్ కాలేదన్నారు.. సమాజంలో గొప్ప పౌరులుగా, ఉద్యోగాలు పొందే విధంగా నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు.. తెలంగాణ నలుమూలల నుంచి అరోరా లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు..