Githam Developers: స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్ కు భరోసా.. తక్కువ ధరలోనే నాణ్యమైన విల్లాలు

  • గీతం డెవలపర్స్ సంస్థ గచ్చిబౌలిలో నూతన కార్యాలయం
  • కొల్లూరు సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న గోల్డెన్ కౌంటీ ప్రాజెక్ట్
  • ఎకరా విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తోపాటు అన్ని ఆధునిక సదుపాయాలు
Githam Developers

Githam Developers

గీతం డెవలపర్స్ సంస్థ గచ్చిబౌలిలోని సందిల్ టవర్స్ లో తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గోల్డెన్ కౌంటీ బ్రోచర్ ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీనటుడు డాక్టర్ బ్రహ్మానందం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి, గీతం డెవలపర్స్ ఎండీ కావలి పవన్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రాజెక్ట్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్ కు భరోసా కలుగుతుందన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన విల్లాలను అందించేందుకు ముందుకొచ్చిన గీతం డెవలపర్స్ యాజమాన్యాన్ని అభినందించారు.

Also Read:BOB Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. 45 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు

“పవన్ కుమార్ యాదవ్ మంచి స్వభావం వల్లనే ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈ కొత్త ప్రాజెక్ట్ మూడింతలు విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రజలు ముందుగా ప్రాజెక్ట్ ను సందర్శించి, పరిశీలించి, నచ్చితేనే కొనుగోలు చేయాలి. బ్రోచర్ ని చూసిన తర్వాత ఇది నివసించడానికి అద్భుతమైన ప్రాజెక్ట్ అని నాకు అనిపించింది” అని తెలిపారు. గీతం డెవలపర్స్ ఎండీ కావలి పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొల్లూరు సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న గోల్డెన్ కౌంటీ ప్రాజెక్ట్ ను వచ్చే రెండేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎకరా విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తోపాటు అన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

Also Read:AP Crime: ప్రియురాలిని ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో పెట్టిన కేసులో ట్విస్ట్‌ .. వెలుగులోకి కీలక విషయాలు..!

గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సహజ వాతావరణంలో ఆధునిక సదుపాయాలతో సమగ్ర నివాస ప్రాజెక్టులను అభివద్ధి చేస్తూ గీతం డెవలపర్స్ ప్రత్యేక గుర్తింపు పొందింది. 15 ఏండ్ల అనుభవంతో 500 ఎకరాలకు పైగా అభివద్ధి చేసి, 20కి పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, అనేక కుటుంబాల విశ్వాసాన్ని సంపాదించింది. సరైన ప్రణాళిక, ఆధునిక మౌలిక సదుపాయాలు, నగరానికి సమీప కనెక్టివిటీతో గోల్డెన్ కౌంటీ ప్రాజెక్ట్ భవిష్యత్ లో ప్రతిష్టాత్మక నివాస ప్రాజెక్ట్ గా నిలవనుంది.