NTV Telugu Site icon

Retirement Celebration: ఘనంగా పూల నర్మద ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం..

Mhbd

Mhbd

ఈరోజు (శనివారం) మహబూబాబాద్ ఉప ముఖ్య కార్య నిర్వాహణాధికారి పూల నర్మద పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహబూబాబాద్ కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, సీఈవో.. జడ్పీ విద్యాలత, మహబూబాబాద్ డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీఆర్డీవో & ఏ.సీ. ఎల్బీ విద్యా చందన, భద్రాద్రి కొత్తగూడెం సీఈవో చంద్ర శేఖర్, డిప్యూటీ సీఈవో శిరీష, భద్రాద్రి అడిషనల్ డీఆర్డీవో, బంధువులు, స్నేహితులు హాజరై ఈ కార్యక్రమంను పాల్గొని విజయవంతం చేశారు.

Read Also: Priyanka Gandhi: వయనాడ్ ప్రజల కోసం నా ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయి

ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం ముఖ్య కార్య నిర్వాహణాధికారి జిల్లా ప్రజా పరిషత్ (మహబూబాబాద్) డి. పురుషోత్తం అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూల నర్మద మాట్లడుతూ.. తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు గుర్తు చేసుకుంటూ.. తమ సర్వీస్ అనుభవాలను పంచుకున్నారు. పదవీ విరమణ కార్యక్రమంనకు హాజరైన అతిధులు.. పూల నర్మద సర్వీస్ గురించి, ఆమె వ్యక్తిత్వం, సేవలను కొనియాడారు. అనంతరం.. పూల నర్మదను ఘనంగా సన్మానించి పదవీ విరమణ వీడ్కోలు పలికారు.

Read Also: Students Protest: కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు

Show comments