NTV Telugu Site icon

CARE Hospitals: కేర్‌ హాస్పిటల్‌లో అందుబాటులోకి అధునాతన చికిత్స

Care Hospitals

Care Hospitals

CARE Hospitals: ప్రొస్టేట్ సమస్యతో బాడప్పడుతున్న వారికీ ఆపరేషన్ అవసరం లేకుండా ఒక్క అధునాతన చికిత్సను ఇప్పుడు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది.. విస్తారిత ప్రొస్టేట్ సమస్య తో బాధపడుతున్న పురుషులకు ఇప్పుడు నూతన, మరియు అధునాతన, అతితక్కువ హానికర చికిత్సను బంజారాహిల్స్, కేర్ హాస్పిటల్స్ లో అందిస్తున్నట్లు ఆసుపత్రి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. వంశీ కృష్ణ ఈ రోజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి సారిగా కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ యందు సాధారణంగా ప్రొస్టాటిక్ ఎన్లార్జ్మెంట్ అనిపిలవబడే బెనిగి ప్రొస్థటిక్ హైపర్ప్లాసియా (బి. పి. హెచ్.) కు నాన్ సర్జికల్ అయిన యూరోలిప్ట్ను ప్రక్రియ ద్వారా అధునాతన చికిత్సను అందిస్తునట్లు డాక్టర్ పి.వంశీ కృష్ణ తెలిపారు. ఈ ప్రక్రియ సాంప్రదాయ శస్త్రచికిత్సలా కాకుండా, యూరోలిఫ్ట్ లోకల్ ఎనస్థీషియా కింద నిర్వహించబడే ఒక డే-కేర్ ప్రక్రియ. దీని కోసం ఆసుపత్రిలో ఉండనక్కర్లేదు. పైపెచ్చు తక్కువ ఆపరేటివ్ నొప్పిని కలిగి ఉంటుంది. యూరోలిఫ్ట్ విధానం చాలా సరళమైన, ముక్కుసూటి ప్రక్రియ. ఇది మూత్రనాళ అడ్డంకికి కారణమయ్యే విస్తారిత ప్రొస్టేట్ కణజాలాన్ని ఎత్తడానికి మరియు పట్టుకోవడానికి చిన్న ఇంప్లాంట్లను ఉపయోగిస్తుంది. దీనిలో కటింగ్ లేకుండా , చేయడం లేదా కణజాలం తొలగింపు, లేదా కణజాలం ధ్వంసం చేయడం వంటివి ఉండవు. అందువలన ఇది అనువైన సర్జరీ.

ఈ నాన్-సర్జికల్ ఎండోస్కోపిక్ విధానంలో, మూత్ర విసర్జన మార్గంలోకి ఒక సున్నితమైన స్కోప్ పంపబడుతుంది. అడ్డుపడుతున్న ప్రొస్టేటిక్ టిష్యూ దాని గోడలకు అంటించబడుతుంది. తద్వారా మూత్ర విసర్జన మార్గం స్వేచ్ఛగా మారుతుంది. ఒక ఓపెన్ పాసేజ్ ఏర్పడుతుంది. ప్రక్రియ మొత్తం 10-15 నిమిషాలు సమయం పడుతుంది. రోగి అదే రోజు మూత్ర పైపు (కాథెటర్) లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రక్రియ చికిత్స తర్వాత మొదటి వారంలోనే రోగ లక్షణాలనుండి త్వరిత ఉపశమనం అందిస్తుంది. రోగి త్వరగా కోలుకోవడానికి, తిరిగి సాధారణ స్థితికి రావడానికి సహాయం చేస్తుంది. లైంగిక పనితీరును నిలుపుకోవాలనుకునే మరియు జీవిత కాలం మందులు తీసుకోని పురుషులలో ఇది ప్రత్యేకంగా, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బెనిగె ప్రొస్టాటిక్ హైపర్ సియా (బిపిహెచ్) 60 ఏళ్ళు దాటిన పురుషులలో సగం మందికి పైగా వారిలో, సహజంగా – వెంట వెంటనే మూత్రానికి వెళ్ళాలనిపించడం, మరీ ముఖ్యంగా రాత్రిపూట, మూత్రం కారడం, లేదా డ్రిబ్లింగ్, బలహీనమైన మూత్ర ప్రవాహం, మూత్ర విసర్జన మొదలెట్టడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది. చికిత్స చేయకుండా అశ్రద్ధ వహించి, వదిలేస్తే, బిపిహెచ్ కిడ్నీ, మూత్రాశయం మరియు మూత్రమార్గం, అంటువ్యాధులు వంటి ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, యూరాలజిస్ట్లు ఈ నాన్- సర్జికల్ ఎండోస్కోపిక్ ప్రక్రియ కోసం కొందరు రోగులను పొటెన్షియల్ కాండిడేట్స్ పరీక్షించారు. వీరిలో – అభ్యర్థులు సాధారణంగా 50 నుండి 85 సం॥ల వయస్సు గలవారు మూత్రనాళ సమస్యల లక్షణాలతో, బాధపడుతూ గత 6 నెలలుగా మందులు వాడుతున్నారు. ఇంకా వీరికి ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉందని అంచనా వేయబడ్డారు. “ఇప్పుడు ఈ సమస్యతో బాధపడేవారికి సర్జరీ బదులుగా – ఒక నాన్ సర్జికల్ ఎండోస్కోపిక్ విధానం మేము అందుబాటులోకి తీసుకురావడం ఆనంద దాయకం, మేము ఇంత వరకు చికిత్స చేసిన పేషెంట్స్ ఎక్స్ లెంట్ రిజల్ట్స్ రావడం శుభ పరిణామం అని డాక్టర్ వంశీ క్రిష్ణ తెలిపారు.

విస్తారిత ప్రోస్టేట్ తో బాధపడే పురుషులకు అందుబాటులో ఉన్న అన్ని యూరోలిఫ్ట్ వైద్య విధానాలు గురించి తెలుసుకొని, అర్థం చేసుకోవాలి. వారికి అనువైన చికిత్సను వెంటనే చేయించుకోవాలి. ఇది వారి ఆరోగ్యానికి శుభప్రదం” అన్నారు. ఆసుపత్రి ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ నీలేష్ గుప్త గారు ఈ సందర్బంగా తెలిపారు. కేర్ హాస్పిటల్స్, బంజరాహిల్స్ యూరోలిఫ్ట్ వైద్య విధానానికి ఇటీవల లభించిన ఎఫ్ ఏ వారి అనుమతితో దీనికి గోల్డ్ స్టాండర్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ లభించినట్లు ఆయన తెలిపారు. కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ వారు మూత్ర నాళ సమస్యలతో బాధపడే పురుషులకు ఆపరేషన్ అవసరంలేని అధునాతన యూరోలిఫ్ట్ వైద్య చికిత్సను అందుబాటులో ఉంచినందుకు చికిత్స పొందిన పేషెంట్స్ ఎంతగానో అభినందించారు.