తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారిందట తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ముఖ్యంగా చిన్నన్నను చికాకు పెడుతున్నాయట సమస్యలు. అసలే కష్టాల్లో ఉన్నామని భావిస్తోన్న నేతలకు లేటెస్ట్ ఎపిసోడ్ మింగుడుపడటం లేదని సమాచారం. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వడంపై హర్షవర్దన్ గుర్రు!
Also Read
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించినా హైకమాండ్ చిన్నారెడ్డికి అవకాశం ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్లు ప్రచారం కార్యక్రమాల్లో మునిగిపోయారు. ప్రచారానికి దూరంగా ఉన్నవారితోనూ మాట్లాడుతున్నారు. కానీ.. అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి వైఖరి మాత్రం మింగుడుపడటం లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు హర్షవర్దన్‌రెడ్డి PRTU అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరే ముందు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట ఇచ్చారట. కండువా కప్పుకొన్నవెంటనే పీసీసీ అధికార ప్రతినిధిని చేశారు. తీరా ఎన్నికల నాటికి ఆ మాట గుర్తురాలేదో ఏమో.. చిన్నారెడ్డిని ఎంపిక చేయడంతో హర్షవర్దన్‌రెడ్డికి చిర్రెత్తికొచ్చిందట.
గతంలో పీఆర్టీయు అధ్యక్షుడిగా ఉన్న హర్షవర్దన్‌రెడ్డి!
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి రెండేళ్లుగా హర్షవర్దన్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. కొత్త ఓటర్ల నమోదు వంటి పనుల్లో బిజీగా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీ హ్యాండివ్వడంతో.. ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. నామినేషన్ వేశారు. అదీ అలా ఇలా కాదు.. మంది మార్బలంతో వెళ్లి.. నామినేషన్ అందజేశారు. హర్షవర్దన్‌రెడ్డి PRTU అధ్యక్షుడిగా చేయడంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు టీచర్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శరవేగంగా హర్షవర్దన్ కదుపుతున్న పావులు కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదట. అసలే కష్టకాలం నడుస్తోంది. ఇలాంటి సమయంలో రెబల్‌గా పోటీ చేస్తే.. మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా ఇబ్బందేనని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
రేవంత్‌రెడ్డి బుజ్జగింపులు ఫలించలేదా?
మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షనవర్దన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారట. సీఎల్పీకి ఆయన్ని పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది. రేవంత్ చెప్పిందంతా విన్న హర్ష.. మీరు ఎన్నెన్నా చెప్పండి భాయ్.. నేను మాత్రం పోటీ నుంచి తప్పుకొనేదే లేదు అని ముఖం మీదే చెప్పేశారట. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వైరి పక్షాలు ఒక్కో విధంగా దాడి చేస్తున్నాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణిని బరిలో దించిన టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నాల్లో ఉంది. అటు చూస్తే హర్షవర్దన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే నామినేషన్ వేశారు. దీంతో ఆయనపై పార్టీ పరంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే బుజ్జగించే పనిలో ఉన్నారు నాయకులు. ఇలాంటి సమస్యలన్నీ చిన్నన్న చిన్నారెడ్డిని చికాకు పెడుతున్నాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి.. ఈ సమస్య నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
- Tags
తాజావార్తలు
-
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!