Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Will The Trs Chief Join The Party In The Ap

టీఆర్ఎస్ అధినేత ఏపీలో పార్టీ పెడతారా.?

Published Date :October 30, 2021 , 3:07 pm
By Lakshmi Narayana
టీఆర్ఎస్ అధినేత ఏపీలో పార్టీ పెడతారా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీఆర్ఎస్‌ చీఫ్.. ఏపీలో పార్టీ పెడతారో లేదో కానీ.. ప్లీనరీలో ఆయన చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార వైసీపీ కౌంటర్లపై కౌంటర్లు వేస్తోంది. రాజకీయ లబ్ధికోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు.. ఈ రగడను అనేక మలుపులు తిప్పుతోంది. మాటల దాడి ఇక్కడితో ఆగుతుందా? మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో పార్టీలు ఉన్నాయా?

రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యే ఉండబోదన్న పేర్ని నాని..!

టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో గులాబీ బాస్‌.. సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణలో మాటల మంటలు రాజేస్తున్నాయి. ఏపీలోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని కేసీఆర్‌ చేసిన ప్రకటన.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. కేసీఆర్‌ వస్తానంటే ఎవరైనా వద్దన్నారా అని బదులిచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రి పేర్ని నాని మాత్రం మరో అడుగు ముందుకేసి.. సమైక్యాంధ్ర పల్లవి అందుకున్నారు. రెండు రాష్ట్రాలను కలిపేస్తే.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో కేసీఆర్‌ పార్టీ పెట్టడం కంటే.. రెండు రాష్ట్రాలను కలిపేస్తే అసలు సమస్యే ఉండదని వాదించారు పేర్నినాని. ఇప్పుడీ కామెంట్సే రెండు రాష్ట్రాల్లో చర్చగా మారాయి.

తెలంగాణాను బలిచ్చే కుట్ర జరుగుతోందన్న రేవంత్‌..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజ్య విస్తరణకాంక్షకు తెలంగాణాను బలిచ్చే కుట్ర జరుగుతోందని తన ట్వీట్‌లో బలమైన పదాలను ప్రయోగించారు రేవంత్‌రెడ్డి. టీఆర్ఎస్‌ ప్లీనరీలో తెలుగుతల్లి విగ్రహం ప్రత్యక్షం.. ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ల ఉమ్మడి కుట్రగా ఆయన ఆరోపించారు. మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన ఆ కుట్రలో భాగంగా విమర్శించారు రేవంత్‌రెడ్డి.

టీఆర్ఎస్‌ రియాక్షన్‌పై ఆసక్తి..!

ఏపీలో పోటీ.. పార్టీ పెట్టడం అనే మాటలు టీఆర్ఎస్‌ నుంచి కొత్తగా వచ్చినవేమీ కావు. గతంలోనూ పలు సందర్భాలలో అన్నవే. అప్పట్లో ఏపీ నుంచి పెద్దగా రియాక్షన్‌ లేదు. ఇప్పుడు ఏపీలోని అధికారపార్టీ వేసిన కౌంటర్లే పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్‌, బద్వేల్‌లోఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వాటిపై ఫోకస్‌ పెట్టినవాళ్లకు.. కొత్త ఎపిసోడ్‌ ఆకట్టుకుంది. కీలక బాణం వదిలిన టీఆర్ఎస్‌ నుంచి రియాక్షన్స్‌ లేవు. కానీ.. ప్లీనరీలో విడిచిపెట్టిన అస్త్రం మాత్రం ఇతర పార్టీలను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఈ రగడ ఉభయ రాష్ట్రాల్లోని పార్టీలకు రాజకీయంగా ఏ మేరకు కలిసి వస్తుందో.. వారి ఆలోచనలేంటో కాలమే చెప్పాలి. అందుకే ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందో.. మరింత ముందుకెళ్తుందో అన్న ఆసక్తి అయితే రెండు రాష్ట్రాల్లోనూ నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm kcr
  • telangana
  • TRS

తాజావార్తలు

  • Sara Tendulkar: లక్నో, గుజరాత్ మ్యాచ్‌లో వదిన-మరదళ్ల సందడి.. సారా టెండూల్కర్ మద్దతు ఎవరికి?

  • Kiran Abbavaram : మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.

  • Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్‌ హత్య..

  • Amaravati Quantum Valley: అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం

  • Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం రోహిత్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions