Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Will The Speaker Take Action Against Mla Rajasingh L

Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? l

Published Date :August 27, 2022 , 11:04 am
By Premchand Chowdary
Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? l
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLA రాజాసింగ్‌పై స్పీకర్‌ చర్యలు తీసుకుంటారా? వేటు వేస్తారా? MIM ఇచ్చిన ఫిర్యాదుపై సభాపతి ఏం చేస్తారు? గతంలో శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు ఉన్నాయా? స్పీకర్‌ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ MLA రాజాసింగ్‌ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆయనపై PD యాక్ట్‌ కింద చర్యలు తీసుకున్నారు పోలీసులు. అయితే రాజాసింగ్‌పై మరిన్ని చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. రాజాసింగ్‌పై MIM స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అందుకే అందరి దృష్టీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిపై ఉంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలనేది MIM డిమాండ్‌. స్పీకర్‌కు అందజేసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇద్దరు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ మధుసుదనా చారి బహిష్కరణ వేటు వేశారు. అసెంబ్లీ జాయింట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు అనుచితంగా ప్రవర్తించారని వారిపై చర్యలు తీసుకున్నారు సభాపతి. ఆ తర్వాత ఆ ఇద్దరూ స్పీకర్‌ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు. అయితే ఇంతలోనే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఉపఎన్నిక రాలేదు.

తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ పై బహిష్కరణ వేటుకు ఎంఐఎం డిమాండ్ చేస్తోంది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్‌ పోచారం ఏం చేస్తారన్నది చర్చగా మారుతోంది. సభాపతి ఏం చేస్తారు? వేటు వేయడానికే సిద్ధపడితే తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ పై వేటు వేస్తే గోషామహల్‌కు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక వేడి ఉండటంతో.. గోషామహల్‌లోనూ బైఎలక్షన్‌కు అధికారపార్టీ సిద్ధ పడుతుందా అనేది ఒక వాదన.

మొత్తంగా ఎంఐఎం లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయల్లో చర్చగా మారింది. ఆ లేఖపై సభాపతి న్యాయనిపుణల సలహా తీసుకుని.. ఒక నిర్ణయానికి వస్తారని అనుకుంటున్నారు. అయితే పీడీ యాక్ట్‌పై అరెస్ట్‌ చేయడాన్ని న్యాయపరంగా సవాల్‌ చేసే పనిలో రాజాసింగ్‌ ఉన్నారు. దానిపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతారా? లేక ముందుగానే ప్రక్రియ ప్రారంభించి నిర్ణయం ప్రకటిస్తారా అనేది కూడా చర్చే. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asaduddin Owaisi
  • Bharatiya Janata Party
  • mla rajasingh
  • Pocharam Srinivas Reddy
  • Speaker Of Telangana Assembly

తాజావార్తలు

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

  • Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

  • Pakistan: పెట్రోల్,డీజిల్ రూ. 500ను చేరినా మద్దతు ఇవ్వాలా.. షాహీద్ ఆఫ్రిదిపై పాకిస్తాన్ ప్రజల ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions