Site icon NTV Telugu

పోరస్‌ కంపెనీ ప్రమాదంపై స్పందించాల్సిన కీలక వ్యక్తి ఎక్కడ?

Porus Y

Porus Y

మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్‌ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట.

పోరస్‌ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్‌ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా మందిలో క్విక్‌ రియాక్షన్‌ కన్పించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన స్పందించాల్సిన కీలక వ్యక్తిలో మాత్రం క్విక్‌ రియాక్షన్‌ సంగతి దేవుడెరుగు, కనీసం రియాక్షనే లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గుమ్మనూరు జయరాం. ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన పెద్ద మనిషి ఎవరన్నా ఉన్నారంటే గుమ్మనూరు జయరామే. జయరాం కార్మిక శాఖ మంత్రి. ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు చనిపోతే కార్మిక శాఖ మంత్రి అయిన జయరాం.. గమ్మున ఉండిపోయారు. తనకి సంబంధించిన వ్యవహరం కాదులే అన్నట్టు ఉండిపోయారు.

ఇప్పుడు గుమ్మనూరు తీరు మీదే ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆరుగురు కార్మికులు చనిపోతే అసలు తనకేం పట్టనట్టు గుమ్మనూరు జయరాం ఎలా ఉన్నారో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. పైగా క్షతగాత్రుల్లో చాలా మంది తీవ్రగాయాలతో డెత్‌ బెడ్‌ మీద ఉన్నారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగితే జయరాం అలా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తయి, తిరిగి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న జయరామ్‌కు తన పదవి మీద ఉన్నంత కాన్‌సన్‌ ట్రేషన్‌ తనకు శాఖకు సంబంధించిన వ్యవహరాలు మీద ఉండనక్కర్లేదా..? అనే చర్చ జరుగుతోందట. ఓ ఘటనపై స్పందించడానికి ఇంత కంటే పెద్ద ఇష్యూ ఏదైనా జరగాలా..? అంటూ చర్చించుకుంటున్నారట.

జగన్‌ మొదటి కెబినెట్‌లో మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం.. కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈఎస్‌ ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలను మూట గట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద.. ఓ మంత్రి మీద తొలి అవినీతి ఆరోపణ వచ్చింది గుమ్మనూరు జయరామ్‌ మీదే. అప్పట్లోనే జగన్‌ టూ పాయింట్‌ వోలో జయరాం ఉంటారా లేదా అనే చర్చ జరిగింది. అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి జయరామ్‌ని వదల్లేదు. విజయవంతంగా జగన్‌ రెండో కెబినెట్‌లో కూడా కొనసాగుతున్నారు. అయితే గతానుభవాల నుంచి గుమ్మనూరు జయరామ్‌ ఏమీ పాఠాలు నేర్చుకోలేదని పోరస్‌ ఘటన ద్వారా అర్థమవుతోందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఇంతటి పెద్ద ఘటన జరిగితే హోం మంత్రిగా ఉన్న తానేటి వనిత ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అలాగే మరో మంత్రి జోగి రమేష్‌ కూడా బాధితులను ఓదార్చారు. కానీ.. అసలు స్పందించాల్సిన మంత్రి గుమ్మనూరు మాత్రం గమ్మున ఉండిపోయారు. ఇదేం తీరు అని అందరూ చర్చించుకుంటున్నారట.

Watch Here : https://youtu.be/txkK7iaJ9E4

Exit mobile version