NTV Telugu Site icon

TDP : అప్పట్లో పొగిడి పనులు చేయించుకున్నా నాయకులే ఇప్పుడు రివర్సవుతున్నారా..?

New Project (33)

New Project (33)

శ్రీకాకుళం టీడీపీలో మెదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసారు అప్పల సూర్యనారాయణ. 2014లో అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మిదేవి ఇరవైవేల ఓట్ల తేడాతో ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి చాపకింద నీరులా పార్టీలో అంతర్గత పోరు కోనసాగుతోందట. నియెజకవర్గం మినీ మహానాడు వేదికగా శ్రీకాకుళం టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గుండ కుంటుంబాన్ని ధిక్కరిస్తున్న రూరల్‌ నేతలు.. యువతకు పట్టం కట్టాలని కొత్త స్వరం అందుకున్నారు. ఈ డిమాండ్స్‌ గుండ శిబిరాన్ని కలవర పెడుతున్నట్టు సమాచారం.

గుండ ఫ్యామిలీకి టిక్కెట్ రాకుండా చేయటానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారంట కింజరాపు కుటుంబం. నిన్నమెన్నటి వరకూ ఎంపీ రామ్మోహన్‌నాయుడు వర్గం యువతకి టికెట్‌ అని సోషల్‌ మీడియాలో ప్రచారం చేసింది. అచ్చెన్నాయుడి మనుషులగా మద్రపడిన కొందరు లక్ష్మీదేవికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టేశారట. దీంతో కింజరాపు ఫ్యామిలీ పేరు చెబితేనే మండిపడుతున్నారట మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవి. శ్రీకాకుళం అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏంటో నివేదిక ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం పరిశీలకులను నియమించినట్టు తెలుస్తోంది. లక్ష్మీదేవికి వ్యతిరేకంగా కొందరు లోకల్‌ లీడర్లను అచ్చెన్న అండ్‌ కో వెనకేసుకొస్తున్నట్టు టాక్‌.

ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్న గుండ కుటుంబం.. అచ్చెన్న బ్యాచ్‌పై టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు సమాచారం. అక్కడే తాడోపేడో తేల్చుకుంటామని అనుచరుల దగ్గర చెబుతోందట. ఇప్పటికీ శ్రీకాకుళంలో తమకు పట్టు సడలలేదని.. తమను కాదని వేరెవరు వచ్చినా పార్టీకి ప్రతికూలతే ఎదురవుతుందని సన్నిహితుల దగ్గర అంటున్నారట. దీంతో రానున్న రోజుల్లో సిక్కోలులో టీడీపీ లోకల్‌ పాలిటిక్స్‌ ఆసక్తిగా మారతాయని కేడర్‌ భావిస్తోంది. ఒకవైపు అధిష్ఠానం తిరిగి పుంజుకోవాలని చూస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆధిపత్యపోరాటం కేడర్‌ను కలవరపెడుతోందట. మరి.. ఈ విషయాన్ని టీడీపీ పెద్దలు గ్రహించారో లేదో అని ఒకరినొకరు ఆరా తీస్తున్నారట తెలుగు తమ్ముళ్లు.