ఏపీకి మరో వాయుగుండం ముప్పు..!
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వద్దు బాబోయ్ ఈ వర్షాలు అనే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఉదయం ఎండలు.. రాత్రికి వానలు.. కొన్ని రోజులైతే ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి.. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికలు చూస్తే.. ఏపీకి మరో వాయుగుండం ముప్పు పొంచింది ఉంది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని అనుకోని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం.. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మరి కొద్ది గంటలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉది.. ఇది పశ్చిమ దిశగా పయనించి రేపటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని.. అనంతరం అక్టోబర్ 2వ తేదీనాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం.. దానిని అనుకోని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక అక్టోబర్ 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. దీని ప్రభావంతో రాగాల వారం రోజులు పటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. కోస్తా జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. మరోవైపు, ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. కోస్తా తీరం వెంబడి గాలులు వేగం అధికంగా ఉన్న నేపథ్యంలో రాగాల నాలుగు రోజులు పాటు మత్య్సకారులు చేపల వేటకు వెళ్ళరాదు అని హెచ్చరించారు.. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ….
శబరి – గోదావరి నదుల ఉధృతి.. 100 గ్రామాలకు రాకపోకలు బంద్..!
మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. శబరి – గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి – గోదావరి నదులు.. దీంతో, కూనవరం వద్ద 47.75 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం.. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తోంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్ లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.. దీంతో, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు బాధితులు.. కూనవరం మండలం పోలిపాక, దూగుట్ట వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది.. దీని ప్రభావంతో చింతూరు – కూనవరం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.. ఎటపాక మండలం పోలిపాక, నందిగామ, నెల్లిపాక గ్రామాల వద్ద రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో విలీన మండలాల నుంచి భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యాయి.. జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి గ్రామాలు.. వరద మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అప్రమత్తమైన అధికారులు.. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు.. మొత్తంగా శబరి – గోదావరి నదుల్లో వరద పెరగడంతో 100కి పైగా గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు…
అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం..
అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. సూర్యనారాయణ స్వామి ఆలయంలోని స్వామి వారి మూల విరాట్‌ను తాకాయి లేలేత భానుడి కిరణాలు.. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శించుకున్న భక్తులు.. ఆనందం వ్యక్తం చేశారు.. ఇక, ఆ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు.. సుమారు 6 నిమిషాలు పాటు స్వామి వారి పాదాలు నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ కనిపించింది.. 1, 2 తేదీల్లో విజయదశమి శవన్నవరాత్రులు కావడంతో సూర్యకిరణాలు స్వామి వారి మూల విరాట్‌ను తాకిన నేపథ్యంలో భారీగా తరలి వచ్చారు భక్తులు.. కాగా, ప్రతీ ఏటా ఉత్తరాయణం, దక్షిణాయనం అక్టోబర్ 1, 2 తేదీల్లో.. మార్చి 9, 10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామి వారి పాదాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది.. మొత్తంగా స్వామివారి మూల విరాట్‌ను స్పృశించని కిరణ దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం పర్యంతమయ్యారు. ఉదయం 6 గంటల తర్వాత 6 నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాన్నం భక్తులకు కనువిందు చెసింది. ఆ సమయంలో స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), భారత జాతీయ కాంగ్రెస్ (INC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ చికిత్స ప్రారంభించారు. వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి ఖర్గేకు నిరంతర జ్వరం రావడంతో బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఖర్గే ఆసుపత్రిలో చేరిన వార్త దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. 83 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే సీనియర్ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ పార్టీలోని అత్యంత ప్రముఖ నాయకులలో ఒకరు.
ఇది కదా కావాల్సింది.. తెలియని నంబర్ల నుచి వచ్చే కాల్స్ కు ఆటోమేటిక్ గా ఏఐతో సమాధానం..
హైదరాబాద్‌కు చెందిన ఈక్వల్ AI కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కాలర్ అసిస్టెంట్‌ను ప్రారంభించబోతోంది. ఈ యాప్ అక్టోబర్ 2 నుండి అందుబాటులోకి వస్తుంది. ఢిల్లీ NCRలో మొదటి 10,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్చి 2026 నాటికి ప్రతిరోజూ 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవడమే లక్ష్యం అని కంపెనీ వ్యవస్థాపకుడు CEO కేశవ్ రెడ్డి అన్నారు. ఈ యాప్ తెలియని కాల్స్ కు సమాధానం ఇస్తుంది. స్పామ్ కాల్‌లను నివారిస్తుంది. ఈక్వల్ AI కాలర్ అసిస్టెంట్ తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్‌లకు ఆటోమేటిక్ గా సమాధానం ఇస్తుంది. ఇది కాలర్‌ను గుర్తిస్తుంది. కాల్ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటుంది. తర్వాత అది కాల్‌ను కనెక్ట్ చేస్తుంది. సందేశాన్ని తీసుకుంటుంది లేదా ఫిల్టర్ చేస్తుంది. AI కాల్ అసిస్టెంట్ హిందీ, ఇంగ్లీష్, హింగ్లిష్ భాషలలో మాట్లాడుతుంది. ఈ యాప్ వినియోగదారుకు పూర్తి కాల్ వివరాలను అందిస్తుంది. ఇది ఇతర స్పామ్ డిటెక్టర్ యాప్‌ల నుండి భిన్నంగా ఉంటుంది. ఇది కాలర్‌తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది.
పండగ వేళ షాకిచ్చిన చమురు కంపెనీలు.. LPG సిలిండర్ల ధరలు పెరిగనయ్
పండగ వేళ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు కంపెనీలు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు LPG సిలిండర్ ధరలను సమీక్షించి, సవరించి, కొత్త రేట్లను జారీ చేస్తాయి. ఇవాళ అక్టోబర్ 01న దేశంలో LPG సిలిండర్ ధరలు రూ. 16 వరకు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఢిల్లీ నుండి ముంబై వరకు, కోల్‌కతా నుండి చెన్నై వరకు LPG ధరలను పెంచాయి. అయితే, 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. 14 కిలోల దేశీయ LPG సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. IOCL వెబ్‌సైట్‌లో నవీకరించబడిన LPG సిలిండర్ ధరల ప్రకారం, రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 15 పెరిగింది. ఈ మార్పు తర్వాత, 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ. 1,595 కు అందుబాటులో ఉంటుంది, గతంలో రూ. 1,580 గా ఉంది. కోల్‌కతాలో, వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 1,684 నుండి రూ. 1,700 కు పెరిగింది. ఇతర మెట్రోలలో, ముంబైలో గతంలో రూ. 1,531 ధర కలిగిన 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ. 1,547 ధరకు లభిస్తుండగా, చెన్నైలో దాని ధర రూ. 1,738 నుండి రూ. 1,754కి పెరిగింది.
అలర్ట్.. నేటి నుంచి మారుతున్న ఈ కీలక విషయాలు మీకు తెలుసా!
అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో అనేక ఆర్థిక, ఆర్థికేతర రంగాల్లో పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. వీటిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నుంచి మొదలుకొని రైల్వే టికెట్ బుకింగ్ వరకు మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో మీకు తెలుసా?.. NPCI లో పుల్ లావాదేవీలు నిలిపివేత: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, PhonePe, Google Pay, Paytm వంటి UPI ప్లాట్‌ఫామ్‌లలో పర్సన్-టు-పర్సన్ (P2P) “కలెక్ట్ రిక్వెస్ట్” లేదా “పుల్ ట్రాన్సాక్షన్” ఫీచర్‌ను నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. దీని అర్థం మీరు ఇకపై ఎవరి నుంచి డబ్బును అభ్యర్థించలేరు. ఈ నిర్ణయం వినియోగదారుల భద్రతను మెరుగుపరచడం, అలాగే ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం లక్ష్యంగా తీసుకుందని ఎన్‌పీసీఐ తెలిపింది. ఈక్విటీ-లింక్డ్ స్కీమ్‌లలో 100% పెట్టుబడి: ప్రభుత్వేతర చందాదారులు ఇప్పుడు వారి పెన్షన్ సంపదలో 100% వరకు మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద ఈక్విటీ-లింక్డ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టగలరు. గతంలో ఈ పరిమితి కేలవం 75% వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదనంగా PRAN (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య) తెరవడానికి, ఖాతాను నిర్వహించడానికి రుసుములు కూడా సవరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు, e-PRAN కిట్ ధర రూ.18, భౌతిక PRAN కార్డు ధర రూ.40 గా నిర్ణయించారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ NPS చందాదారులకు రుసుములు మారుతూ ఉంటాయి.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ బోణీ.. ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్!
సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ బోణీ కొట్టింది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లకు 269 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని 271 పరుగులకు సవరించగా.. శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్.. తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం (అక్టోబర్ 5) దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ 2025 ట్రోఫీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (8) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (37; 59 బంతుల్లో 3×4, 1×6), హర్లీన్ డియోల్ (48; 64 బంతుల్లో 6×4) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 19 ఓవర్లకు 81/1తో భారత్ మంచి స్థితిలో నిలిచింది. వెంటనే ప్రతీక అవుట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (21)తో క్రీజులో కుదురుకోవడంతో భారత్ 25 ఓవర్లకు 120/2 స్కోర్ చేసింది. లంక బౌలర్ ఇనోక ఒకే ఓవర్లో మూడు వికెట్స్ పడగొట్టి షాక్ ఇచ్చింది. తర్వాతి ఓవర్లో రిచా ఘోష్ (2) కూడా ఔటైపోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అమన్‌జ్యోత్ కౌర్ (57; 56 బంతుల్లో 5×4, 1×6), దీప్తి శర్మ (53; 53 బంతుల్లో 3×4), స్నేహ్ రాణా (28 నాటౌట్; 15 బంతుల్లో 2×4, 2×6)లు ఆదుకోవడంలో భారత్ భారీ స్కోర్ చేసింది.
ఫిలింనగర్ లో హీరోయిన్ హయతి పై కేసు నమోదు.. అరెస్ట్ తప్పదా?
ఖిలాడీ, రామబాణం సినిమాలలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయతి సినిమాల కంటే కూడా బయట వివాదాలలో ఏక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య కర్నాటక IPSతో వివాదం విషయంలో రచ్చ రచ్చ చేసింది డింపుల్. ఇక నిన్న మరో వివాదంలో హీరోయిన్ హయతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళని ఉన్నపలంగా బయటికి గెంటేసింది డింపుల్ హయతి. డింపుల్ హయతి ఇంట్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి వచ్చిన ఇద్దరు కొంతకాలంగా పని చేస్తున్నారు. వారితో వెట్టి చాకిరీ చేపించుకుని జీతం ఇవ్వకుండా చిత్ర హింసలను గురిచేస్తుందట డింపుల్. తమ డబ్బులు ఇవ్వమంటే తిరిగి వారిపైనే దాడి చేసి తన భర్త లాయర్ అంటూ బెదిరింపులకు దిగింది డింపుల్ హయతి. దీంతో వారు హయతి ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ఆందోళనకు దిగారు. తమకు డబ్బులు ఇవ్వకుండా బయటికి గెంటేసారని కార్మికుల ఆరోపణ చేసారు. ఈ నేపధ్యంలో ఫిలింనగర్ లో హీరోయిన్ హయతి పై కేసు నమోదు అయింది. ఒడిస్సా కు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసారు పోలీసులు. హీరోయిన్ హయతి తో పాటు భర్త పైన కేసు నమోదు చేసిన పోలీసులుఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదని కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారని, తన నగ్న వీడియోలు తీసేందుకు ప్రయత్నించారని పనిమనిషి ఆరోపణతన చేత ఇంట్లో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా బయటికి పంపేశారని, చిత్రహింసలు చేసిన హాయితీతోపాటు భర్తపై ఫిర్యాదు చేసింది పనిమనిషి.
‘ఓజీ’ స్పెషల్ సాంగ్ రిలీజ్..నేహా శెట్టి ఎంట్రీతో థియేటర్లలో జోష్ రెట్టింపు
గత వారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డులు సృష్టించిన చిత్రం ‘OG’. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి సినిమాకు అదిరే రెస్పాన్స్ అందిస్తున్నారు. ఈ మూవీ విడుదలైన మొదటి వీకెండ్‌లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.255 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. .ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా సరికొత్త అవతారంలో కనిపించగా, ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఈవెనింగ్ షో నుండి, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటించిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ స్పెషల్ సాంగ్ థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ కొత్త సాంగ్, కథలో ఓజీ గాయపడిన సందర్భంలో ఓమీ గ్యాంగ్ సెలబ్రేట్ చేసే సన్నివేశంలో ప్లేస్ చేయబడింది. ఫ్యాన్స్ ఈ పాటను చూసి పాత రోజుల గబ్బర్ సిగ్ డేస్ ని గుర్తుచేసుకుంటూ, థియేటర్లలో ఉత్సాహంగా స్పందిస్తున్నారు. నేహా శెట్టి ఎంట్రీతో పాటకు అదనపు ఆకర్షణ ఏర్పడినది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లను సాధారణ స్థాయికి తీసుకురావడంతో, థియేటర్ ఆవరణలో ప్రేక్షకుల ఉత్సాహం మరింత పెరిగింది. కొత్త స్పెషల్ సాంగ్‌తో OG సినిమాకు థియేటర్లలో జోష్ రెట్టింపు అవుతూ, సినిమాపై ఫ్యాన్స్ ఆకర్షణను కొనసాగిస్తుంది.
