Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record The Opposition Group Throwing Knives At Minister Roja

YCP : మంత్రి రోజాపై కత్తులు దూస్తున్న వ్యతిరేక వర్గం

Published Date :July 8, 2022 , 11:36 am
By Premchand Chowdary
YCP  : మంత్రి రోజాపై కత్తులు దూస్తున్న వ్యతిరేక వర్గం
  • Follow Us :
  • google news
  • dailyhunt

నగరి వైసీపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మంత్రి రోజాపై… వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గం మళ్లీ కత్తులు దూస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్‌ అయ్యి కొత్త చర్చకు దారితీసిన వాళ్లంతా పాత పద్ధతిలోకి వచ్చేశారు. సై అంటే సై అంటున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని సవాళ్లు విసురుతున్నారు. రోజా మంత్రి అయినా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా మాటల తూటాలు పేల్చుతున్నారు అసమ్మతి నేతలు.

2014లో నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ప్రతిపక్ష పాత్రకే పరిమితం. 2019లో రెండోసారి గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆమెకు అసమ్మతి రూపంలో నేతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి. గత ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు.. తర్వాత పంచాయితీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కనిపించాయి. రోజాకు వ్యతిరేకంగా కేజే కుమార్‌, అమ్ములు, రెడ్డివారి చక్రపాణిరెడ్డి వంటి వైసీపీ నేతలు చాలా యాక్టివ్‌గా నగరిలో పనిచేస్తున్నారు. వీళ్లకు మంత్రి పెద్దిరెడ్డి తదితరుల అండ ఉందనేది రోజా వర్గం అనుమానం.

నగరిలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని రోజా చెప్పినా.. ఫలితం లేకుండా పోయింది. చక్రపాణిరెడ్డి శ్రీశైలం ఆలయం ఛైర్మన్‌ అయితే.. కుమార్‌ భార్యకు నామినేటెడ్‌ పోస్టు ఇచ్చారు. అసమ్మతి వర్గాలకు సహకరిస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని రోజా పలుమార్లు హెచ్చరించినా.. నగరి వైసీపీలో పరిస్థితులు మారలేదు. ఇంతలో రోజా మంత్రి అయ్యారు. దాంతో అసమ్మతి వర్గం దారిలోకి వస్తుందని.. ఎక్కడి వాళ్లు అక్కడికి సర్దుకుంటారని చర్చ జరిగింది. దానికి తగ్గట్టుగానే రోజా మంత్రి అయిన నాటి నుంచి అసమ్మతి వాదుల ఉసే లేదు. వాళ్లంతా సైలెంట్‌ అయ్యారని భావించారంతా. కానీ.. సీన్‌ రివర్స్‌.

తాజాగా నగరిలో జరిగిన వైసీపీ ప్లీనరలో తన జోలికి వస్తే బాక్సులు బద్దలు అవుతాయని పంచ్‌ డైలాగులు వేశారు రోజా. ఆ మాటలు మంట పుట్టించాయో ఏమో.. అసమ్మతి వర్గం ఒక్కసారిగా జూలు విదిల్చింది. తాము తగ్గేదే లేదన్నట్టుగా కేజే కుమార్‌ వర్గం ఢీ అంటే ఢీ అంటూ రోడ్డెక్కేసింది. మంత్రి రోజా అనుచరుడు బీడీ భాస్కర్‌, అసమ్మతి నేత కుమార్‌ వర్గాల మధ్య గొడవ జరిగింది. రోజా బ్యానర్లు కట్టిన చోటే అడ్డంగా కుమార్‌ వర్గం మరో బ్యానర్‌ కట్టడానికి చూడటంతో రచ్చ రచ్చ అయింది.

నగరిలో వైసీపీ ప్లీనరీకి రాని అసమ్మతి నేతలు.. పలమనేరులో మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించిన చిత్తూరు జిల్లా వైసీపీ ప్లీనరీకి వెళ్లి.. మంత్రి రోజాకు షాక్‌ ఇచ్చారు. మొత్తానికి రోజాకు నగరి వైసీపీలో ఇంటిపోరు తగ్గేట్టు లేదు. మంత్రిగా ఉన్నా.. వాళ్లతో తలపోటులు తప్పడం లేదని అనుకుంటున్నారట. మరి.. ఈ సమస్యను అధిగమించడానికి.. అసమ్మతి వర్గానికి చెక్‌ పెట్టడానికి రోజా ఏం చేస్తారో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chakrapani Reddy
  • Kumar
  • Minister RK Roja
  • Nagari MLA Roja
  • ysrcp plenary

తాజావార్తలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

  • Rice Flour Roti Recipe: పిండిని కలిపేటప్పుడు ఇలా చేస్తే సరి.. బియ్యపు పిండితో చేసే రోటీలు మెత్తగా, ఉబ్బిపోతాయి..!

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions