Site icon NTV Telugu

OTR: కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ డ్రైవ్.. తెలంగాణ శాఖల్లో భారీ లీకులు బట్టబయలు..

Telangana

Telangana

OTR: తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లీకులకు సీలేసే స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో అనధికారికంగా పక్కదారి పడుతున్న ప్రభుత్వ సొమ్ముకు అడ్డుకట్ట వేసే పని మొదలైంది.ఇప్పటికే మైనింగ్ డిపార్ట్‌మెంట్‌ లీక్స్‌కు ఎమ్‌సీల్‌ వేసేశారట. దాంతో ఈ ఏడాది ఏకంగా 22 శాతం ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఇక ఆ ఇన్స్పిరేషన్‌తో ఎక్కడెక్కడ ప్రభుత్వ ధనం వృధా అవుతోందో లెక్కలు తీసి పూర్తిగా కట్టడి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. అందులో భాగంగానే… అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను తేల్చాలని డిసైడ్ అయ్యింది సర్కార్‌.

READ ALSO: Vidadala Rajini: ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుంటూ దొరకటం సిగ్గుచేటు!

డిసెంబర్ 31 వరకు పూర్తి లెక్కలు తీస్తే… ఆ వివరాలు చూసి అంతా షాక్‌ తిన్నట్టు తెలుస్తోంది. దాదాపు 15వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మిస్‌ అయినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఎవ్వరూ అస్సలు ఆధార్ కార్డులు ఇవ్వలేదని సమాచారం. ఇన్నాళ్ళు వీళ్ళ పేరుతో జీతాలైతే డ్రా చేస్తున్నారుగానీ… గవర్నమెంట్‌ దగ్గర పూర్తి వివరాలు లేవు. ఈ డిటైల్స్‌ చూసి స్వయంగా ఆర్థిక శాఖ అధికారులే కంగుతిన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో…. ఇంతకీ ఆ 15 వేల మంది ఉద్యోగులు ఎవరు..? నిజంగానే ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తుంటే… ఎందుకు సమాచారం ఇవ్వలేదు..? వాళ్ళ పేరుతో వేరే ఎవరైనా డబ్బులు డ్రా చేసి నొక్కేస్తున్నారా..? అనే చర్చ మొదలైంది సచివాలయవర్గాల్లో. గత పదేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వివరాలు సేకరించిన క్రమంలో ఈ అక్రమ చిట్టా బయటపడిందట. దాంతో.. కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో… డబ్బులు నొక్కింది ఎవరు..? అందులో అధికారుల పాత్ర ఉందా..? లేక రాజకీయ నాయకుల పాత్ర ఉందా అన్నది తేల్చే విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందించేందుకు అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగుల పేరుతో దోపిడీ జరిగిందని, అన్నిటినీ బయటకు తీస్తామని గతంలో ప్రకటన కూడా చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. దానిపై ఆడిట్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన 15 వేల మంది ఉద్యోగుల సంగతి ఏంటి..? వెనకాల ఉన్నది ఎవరు..!? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ విభాగాల్లో… 15 వేల ఉద్యోగాలంటే అదేం చిన్న విషయం కాదు. అందుకే దీనిపై సర్కార్ ఏం చేయబోతుంది..!? లెక్కలు సరిచేస్తారా..? వెనక ఉన్న వాళ్ళని బయటికి లాగుతారా అంటూ ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణ రాజకీయవర్గాలు.

READ ALSO: YouTube: యూట్యూబ్‌లో కొందరికి కోట్లు.. మరికొందరికి జీరో! అసలు కారణం ఇదే..

Exit mobile version