అమిత్ షాతో భేటీలో టీ బీజేపీ నేతల అత్యుత్సాహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దవాళ్ల దగ్గర ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఏంటా కుప్పిగంతులు అంటారు. అదే ఓ స్థాయిలో ఉన్నవాళ్లు చేస్తే.. అంతా నవ్వి పోతారు. హస్తినలో ఆ పార్టీ నేతలు చేసిన పని అలాగే ఉందట. పెద్దాయన దృష్టిలో పడేందుకు.. మార్కులు కొట్టేసేందుకు తెగ తాపత్రయ పడ్డారట.
అమిత్ షా చిరు నవ్వులు చూడగానే నేతలు అడ్వాన్స్ అయ్యారా?
Also Read
ముఖ్య నేతలంతా ఢిల్లీ రండి.. అమిత్ షా మాట్లాడతారని కబురు వెళ్లడంతో.. హస్తినలో వాలిపోయారు తెలంగాణ బీజేపీ నేతలు. పిలిచింది.. పార్టీ. తమతో మాట్లాడేది అమిత్ షా అని తెలియగానే ఢిల్లీకి క్యూ కట్టిన నాయకులంతా ఎవరి స్థాయిలో వాళ్లు హోంవర్క్ చేశారట. ఈ విషయంలో బీజేపీలోని కొత్త పాత నేతల తీరు ఒకేలా ఉందట. మీటింగ్‌లో అమిత్ షా చిరునవ్వులు చిందిస్తూ.. క్యా హాల్ హై అనగానే .. వాతావరణం బాగుందని.. కమలనాథులు అడ్వాన్స్ అయిపోయారట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చ.
అప్పుడే బీజేపీలోకి వచ్చిన వారిలా అమిత్ షా ముందు నేతల ప్రవర్తన..!
వాస్తవానికి తెలంగాణ బీజేపీలోని కొందరు ముఖ్యనేతలతోనే అమిత్ షా భేటీ కావాలని అనుకున్నారట. చివరకు కొద్దిమంది జాబితా కాస్తా… చాంతాడంత అయిపోయింది. ఎంపీ, ఎమ్మెల్యేలతో అనుకున్న మీటింగ్‌లోకి జాతీయ కమిటీలో బాధ్యతలు ఉన్నవాళ్లందరినీ యాడ్ చేసేశారు. బీజేపీ సమావేశాల్లో రొటీన్‌కు భిన్నంగా ఫొటో సెషన్ నడిచింది. ఒకటో రెండో ఫొటోలు కాదు.. అంతా కెమెరాలకు ఫోజులిచ్చినవాళ్లే. పోటీపడి ఫొటోలు దిగేశారు. అమిత్ షాను కలిసిన వాళ్లు చిన్న నేతలేమీ కాదు.. అందరూ పెద్దలే. కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్లే. కానీ.. అప్పుడే బీజేపీలోకి వచ్చిన వాళ్ల మాదిరి పార్టీ అగ్రనేత ముందు ప్రవర్తించారట.
అమిత్ షాను కలిసే ఛాన్స్ మళ్లీ వస్తుందో రాదో అన్నట్టుగా నేతల తీరు ఉందా?
షా దృష్టిలో పడాలని పోటీపడి.. ఆయన ముందు ఏదో ఒకటి మాట్లాడేందుకు పోటీ పడ్డారట తెలంగాణ బీజేపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చెప్పేందుకు తెగ ఉత్సాహం చూపించారట. ఆ అత్యుత్సాహం చూసిన తర్వాత కొందరు నాయకులు ఇదేంది.. అమిత్ షా మీటింగ్‌లో ఇలాగేనే ప్రవర్తించేది అని నొచ్చుకున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ పూర్తికాగానే అమిత్ షాతో దిగిన ఫొటోలను ఆయా బీజేపీ నేతల సోషల్ మీడియా విభాగాలు పోటీపడి ఫేస్బుక్, వాట్సాప్‌లలో పోస్టింగ్‌లు పెట్టాయి. అమిత్ షాతో ఏం మాట్లాడారో కొటేషన్ల కింద ఇచ్చారు. ఈ హడావిడి చూసిన పార్టీ శ్రేణులు నోరెళ్లబెట్టాయట. అమిత్ షాను మళ్లీ కలిసే ఛాన్స్ వస్తుందో రాదో అన్నట్టుగా పార్టీ నేతల తీరు ఉందని కాషాయ శిబిరంలోనే సెటైర్లు పేలుతున్నాయి.
క్రెడిట్ కోసం పాకులాడితే రియాక్షన్ మరోలా ఉంటుందా?
కేంద్ర హోంమంత్రిగా ఉన్న బీజేపీ అగ్రనేత అమిత్ షాకు.. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియంది కాదు. కేవలం పార్టీ నేతల నుంచే అన్నీ తెలుసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే అన్నది బీజేపీ వర్గాల మాట. అలాంటి పెద్ద నాయకుడి ముందు ఏది పడితే అది మాట్లాడేసి.. క్రెడిట్ కోసం పోటీపడితే.. ఆ ప్రభావం మరోలా ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడే ఏమీ తెలియకపోయినా.. రానున్న రోజుల్లో అది ఏ రూపంలో రియాక్షన్ ఇస్తుందో గుర్తించేలోపే కాలాతీతం అవుతుందని.. పార్టీలో అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. తాజా ఢిల్లీ భేటీ ఎవరికి మోదం కలిగిస్తుందో.. ఎవరికి ఖేదంగా మారుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..