Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telangana Bjp Leaders Are Insulting

BJP : ఆ తెలంగాణ బీజేపీ నేత పదవిచ్చి అవమానించారని ఫీల్ అవుతున్నారా.?

Published Date :June 22, 2022 , 12:40 pm
By Premchand Chowdary
BJP : ఆ తెలంగాణ బీజేపీ నేత పదవిచ్చి అవమానించారని ఫీల్ అవుతున్నారా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నల్లు ఇంద్రసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. అప్పట్లో వేళ్లమీద లెక్కపెట్టే బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో బీజేపీకి రాష్ట్ర చీఫ్‌గానూ పనిచేశారు ఇంద్రసేనారెడ్డి. ప్రస్తుతం బీజేపీలో ఇతర పార్టీల నాయకుల చేరికలకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డితోపాటు ఆ కమిటీలో ఏడుగురు పార్టీ నేతలు సభ్యులు. తెలంగాణలో బీజేపీలో ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేవారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభం.. వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌.. తదితర అంశాలను వాకబు చేయాల్సిన బాధ్యత ఈ కమిటీదే. ఈ విషయాలలో ఇంద్రసేనారెడ్డి నిక్కచ్చిగా ఉంటారు.. బీజేపీ లైన్‌లో ఆలోచిస్తారు.. ఆయన ఒకే అంటే పార్టీలో ఇంకేవరూ ఊహూ అనబోరని లెక్కలేసుకున్నారు కమలనాథులు. కానీ.. సీన్‌ రివర్స్‌. ఆ క్రమంలోనే కాషాయ శిబిరంలో చర్చల్లోకి వస్తున్నారు ఇంద్రసేనారెడ్డి.

చేరికల కమిటీ వేసి నెలలు గడుస్తున్నా.. ఇంద్రాసేనారెడ్డి అండ్‌ బ్యాచ్‌ చేసింది ఏంటి అంటే..? ఏమీ లేదని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీ నేతలు. అయితే ఇంద్రాసేనారెడ్డికి పని అప్పగిస్తే ఖాళీగా ఉండబోరని పార్టీ నేతల అభిప్రాయం. ఆ మేరకు కొంత వర్కవుట్ చేశారని టాక్‌. బీజేపీలో చేరేవారు ఎవరు? అనే దానిపై ఒక జాబితా సిద్ధం చేశారట. ఆ లిస్ట్‌ను పార్టీ పెద్దల ముందు పెట్టినట్టు తెలుస్తోంది. కానీ.. ఆ పేర్లపై పార్టీలోని కీలక నేతలు పెదవి విరిచినట్టు సమాచారం. కొందరికి ఆ జాబితాలోని పేర్లు నచ్చలేదట. ఒకసారి బీజేపీలోకి వచ్చి వెళ్లిన వారి పేర్లు ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. ఆ విషయంలో తన స్టాండ్‌ను గట్టిగా వినిపించారట ఇంద్రసేనారెడ్డి.

బీజేపీలో చేరికలపై జరిగిన వాదోపవాదాలు నేతల మధ్య హీట్ రాజేసినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల అభ్యంతరాలను చూసిన తర్వాత.. ఇలా అయితే బీజేపీలో చేరేవారు ఎవరుంటారు అనే ఫీలింగ్‌లో ఇంద్రాసేనారెడ్డి ఉన్నారట. ఈ విషయంలో ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వకపోతే తమ కమిటీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారట. కత్తి డాలు లేని ఈ బాధ్యతలు తనకెందుకు.. వద్దు అని ముఖం మీదే చెప్పేశారట ఇంద్రసేనారెడ్డి. బీజేపీలో చేరేందుకు తన దగ్గరికి వచ్చే నేతలకు ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా నాయకులు వచ్చి ఫలానావాళ్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబితే.. తెగ ఇబ్బంది పడుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో చేరికల కమిటీకి ఛైర్మన్‌గా కొనసాగితే.. ఉన్న గౌరవం పోతుందనే ఆందోళనలో ఉన్నారట ఇంద్రసేనారెడ్డి. రాజకీయంగా బదనాం అయిపోతామని టెన్షన్‌ పడుతున్నారట. మరి.. సీనియర్‌ బీజేపీ నేత లేవనెత్తిన అంశాలపై పార్టీ పెద్దలు పునారాలోచన చేస్తారో లేక ఇంద్రసేనారెడ్డే తప్పుకొంటారో చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP BJP
  • bjp
  • Indrasena reddy
  • Politics
  • Telangana BJP

తాజావార్తలు

  • Sanjay Dutt : సీఎం చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ

  • Harish Rana Dies: తుదిశ్వాస విడిచిన హరీష్ రాణా.. 13 ఏళ్ల నరకం నుంచి విముక్తి..

  • Iran: అలీ లారిజానీ స్థానం భర్తీ.. కొత్త భద్రతా చీఫ్‌గా బఘేర్ నియామకం

  • IPL vs PSL: ఇది కదా ఐపీఎల్ సత్తా.. వణికిపోతున్న పీఎస్ఎల్..

  • CM Chandrababu: ‘ఉత్తరాంధ్ర’ ఇక నుంచి ‘ఉక్కు ఆంధ్ర’: సీఎం చంద్రబాబు

ట్రెండింగ్‌

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions