Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telakapalli Ravi Analysis On Section 124 A

తెలకపల్లి రవి : 124(ఎ)రాజద్రోహంపై సిజెఐ రమణ వ్యాఖ్యలు త్వరగా నిజమౌతాయా?

Published Date :July 15, 2021 , 10:14 pm
By Lakshmi Narayana
తెలకపల్లి రవి :  124(ఎ)రాజద్రోహంపై సిజెఐ రమణ వ్యాఖ్యలు త్వరగా నిజమౌతాయా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్‌ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. ఇటీవలి కాలంలో చాలాసార్లు ఈ తరహాలోనే సుప్రీం దర్మాసనాలు వ్యాఖ్యానాలు చేసినా నిర్ణయాత్మకంగా కొనసాగింపు లేదు.వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో ఇటీవలే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చింది. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడంసరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు వుంటుందని కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు ,బాల్‌కోట వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం ఇప్పుడు కరోనా కట్టడిలో వైఫల్యం వంటివాటిని సూటిగా విమర్శించినందుకే వినోద్‌దువాపై ఈ సెక్షన్‌ బనాయించారు.పద్మశ్రీపురస్కార గ్రహీత అయిన వినోద్‌ యు ట్యూబ్‌ చానల్‌లో చేసిన వ్యాఖ్యలపై శ్యాం అనే బిజెపి నాయకుడు సిమ్లాజిల్లాలో కేసు పెట్టారు.అసత్య సమాచారం,ప్రజలలో అశాంతిని వ్యాపింపచేయడం,పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల ప్రచురణ తదితర ఫిర్యాదులను దానికి జతచేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్‌ యుయు లలిత్‌ ధర్మాసనం జర్నలిస్టుల వ్యాఖ్యలు కథనాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వున్నంత మాత్రాన కేసులు రాజద్రోహం కిందకు రాదని స్పష్టం చేసింది,హింసను ప్రేరేపించడం ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానిన పడగొట్టాలని ప్రయత్నించడం మాత్రమే రాజద్రోహమని1962లో కేదార్‌నాథ్‌సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం పాత్రికేయులందరికీ రక్షణ వుండాల్సిందేనని ప్రకటించింది,

2020 మార్చినాటి పరిస్థితుల్లో వలస కార్మికుల దుస్థితి వాస్తవమనీ వాటిపట్ల వ్యాకులతతో ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ పరిష్కార చర్యలు తీసుకోవాలిన వినోద్‌ దువా కోరడం ఏ విధంగానూ తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. అంతకు కొద్ది రోజుల ముందే రెండు తెలుగు ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్‌లోనూ సుప్రీం కోర్టు 124(ఎ)ను మరోసారి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం వుందని తెల్పింది.దీంతోపాటే భారత శిక్షాసృతి(ఐపిసి) సెక్షన153(ఎ) వివిధ తరగతుల ప్రజల మధ్య వైషమ్య వ్యాప్తి, 505 ప్రజాజీవితంలో కల్లోలసృష్టి అనే నిబంధనలను కూడా మీడియా కోణంలో మళ్లీ పరిశీలించాల్సి వుందని చెప్పింది. ఐపిసి124(ఎ)లో ఏం వుంది?:ఎవరైనా సరే తమ మాటల ద్వారా గాని మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా సంజ్ఞలు లేదా ప్రత్యక్ష వ్యక్తీకరణల ద్వారా గాని మరో విధంగా గాని విద్వేషంలేదా ధిక్కారం వ్యాప్తి చేసేట్టయితే భారత దేశంలో చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అయిష్టతను విముఖతను రెచ్చగొట్టేట్టయితే ప్రేరేపించేట్టయితే వారికి కారాగారశిక్షకు పాత్రులగుదురు’ ఈ కారాగారశిక్ష మూడేళ్ల నుంచియావజ్జీవం వరకూ వుండొచ్చు.రెండూ కలిసి కూడా వుండొచ్చు.

read also : సజ్జలకు ఓఎస్డీగా తెలంగాణ అధికారి !

ఇందులో అయిష్టత వైముఖ్యం అన్నదాంట్లో విశ్వాసరాహిత్యం, శత్రుభావన కూడా కలిసి వున్నాయనీ, ప్రభుత్వ విధానాలను చట్టంద్వారా మార్చడానికి ప్రయత్నిస్తే అది రాజద్రోహం కాదు.ద్వేషం ధిక్కారవ్యాఖ్యలు కూడా రాజద్రోహం కాదని వివరణలు,చెబుతున్నాయి. ప్రభుత్వ వైఖరితో విబేదించినంతమాత్రాన రాజద్రోహం అనడం సరికాదని 2018లో లాకమిషన్‌ స్వయంగా వ్యాఖ్యానించింది. ఆచరణలో మాత్రం దీన్నివిచక్షణా రహితంగా ప్రయోగిస్తూనే వున్నారు.,కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ యుపిలోని హత్రాస్‌లోదళిత బాలిక అత్యాచారానికి గురైన దారుణఘటనకు సంబంధించి వివరాల సేకరణ కోసం వెళ్లి ఈ సెక్షన్‌ కింద అరెస్టయ్యారు.కర్ణాటకలోని ఒక విద్యాలయంలో సిఎఎకు వ్యతిరేకంగా నాటకం వేసిన తలిదండ్రులపైన కూడా ఈ రాజద్రోహం కేసులే బనాయించారు. జెన్‌యు విద్యార్థులపైన కూడా ఇలాటి విద్రోహం కుట్ర ఆరోపణలే మోపారు.

రైతుల ఆందోళనను బలపర్చినందుకు గాను బెంగుళూరులోదిశారవి అనే పర్యావరణ కార్యకర్తపైన ఇదే ఆందోళనకు సంబంధించి రిపబ్లిక్‌ దినోత్సవంనాడు జరిగిన ఘటనల వాస్తవాలు వెల్లడిర చినందుకు రాజ్‌దీప్‌ సర్దేశాయి,వినోద్‌జోష్‌,జఫర్‌ఆఘా,పరేశ్‌నాథ్‌,అనంతనాథ్‌ తదితరులపై రాజద్రోహం కేసులే పెట్టారు, సుప్రీం కోర్టు వారిని అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది, నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా కేసులు బాగా పెరిగిపోయాయి. 2014లో 47,2015లో 30,2016లో 35,2015లో 51,2018 లో 70,2019లో 93 రాజద్రోహం కేసులు నమోదవడం గమనిస్తే ఈ సంఖ్య పెరుగుతూనే వుందని అర్థమవుతుంది. సంబంధిత వ్యక్తులు విచారణ లేకుండా ఖైదులో మగ్గిపోతూ వేధింపులకు గురవడం జరుగుతున్నది. అడ్డగోలుగా బనాయిస్తున్నారు గనక ఈ కేసుల్లో అంతిమంగా శిక్షలు పడే శాతం నామమాత్రం, 2016,17లలో లో ఒక్కొక్కరికి, 2018లోఇద్దరిక, 2019లోముగ్గురికి మాత్రమే నేర నిర్దారణ జరిగింది, అదైనాఏ పద్దతిలో జరిగిందనేది పరిశీలించవలసిందే, ప్రపంచవ్యాపితంగా అత్యధిక దేశాలు ఈ రాజద్రోహం వంటి నిబంధనలకు స్వస్తిచెప్పేశాయి.

టెర్రరిజం నిరోధం వంటి చట్టాలు చేసుకున్నాయి,మన దేశంలో ఆ విధంగా చేసిన నాసా,ఉపా వంటి చట్ట్లాలనూ దుర్వినియోగ పరుస్తున్నారు. భీమ్‌ కోర్‌గావ్‌ కుట్ర కేసులో అరెస్టయిన వయోవృద్ధుడు స్టాన్‌స్వామి ప్రాణాలే కోల్పోయారు. వరవరరావు వికలాంగుడైనప్రొఫెసర్‌ సాయిబాబ, పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఖైదులో మగ్గిపోతున్నారు. ఎపి ఎంపి రఘురామరాజుకు బెయిలు ఇవ్వడం తప్పుగాకున్నా అదేఉన్నత న్యాయస్థానాలు కరోనాసోకినా స్టాన్‌స్వామికి గాని సిద్దిక్‌ కప్పన్‌కు గాని ఉపశమనం కలిగించిందిలేదు. అర్నబ్‌గోస్వామికే ఉపశమనం దక్కింది, ఒకసారి 124(ఎ) సెక్షన్‌ కింద ఎప్‌ఐఆర్‌ నమోదైనాక కింద పోలీసులు ఏంచేస్తారనేది చెప్పడానికి లేదు. అందరూ సుప్రీం కోర్టుకు రాలేరు. వచ్చినా అందరి కేసులూ ఒకేలా విచారణకు నోచుకోకపోవచ్చు.

చీప్‌జస్టిస్‌ ఎన్‌వి రమణ హయాంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నట్టు చెబుతున్నారు గనక ఇప్పుడు ఆయనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు గనక ఈ కర్కోటక సెక్షన్‌ను రద్దుచేయాలని తీర్పు నిస్తారని భావ ప్రకటనా స్వేచ్చను ప్రశ్నించే హక్కును కాపాడతారని ఆశిద్దాం.124(ఎ)పునర్ధర్శనం పున:పరిశీలన వంటి మాటలు ఏంచెప్పినా . ఐపిసిని పార్లమెంటు సవరించేవరకూఅలాగే వుంటాయి.1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్‌ చట్టం ఇవన్నీ పరాయి ప్రభుత్వం దేశ ప్రజలస్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి తెచ్చినవే.పిసి124(ఎ) ఆ అంశాలకే ప్రతిరూపం, సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సరైన దిశలోవున్నా రాజ్యాంగం 19వ అధికరణంలోని ప్రాథమికహక్కులకు భంగం కలిగించే నిబంధనలు తొలగించబడితేనే ఈ ప్రక్రియపూర్తవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • section 124 A
  • telakapalli ravi
  • telakapalli Ravi analysis

తాజావార్తలు

  • Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions