Site icon NTV Telugu

తెలకపల్లి రవి : పార్లమెంటులోప్రతిపక్షాల ఆగ్రహం, చైర్మన్‌వెంకయ్యపై అవిశ్వాసం యోచన

పెగాసస్‌ స్పైవైర్‌పై పోరాటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.లోక్‌సభ రాజ్యసభ రెండుచోట్లా తమ వాయిదా తీర్మానాలను నోటీసులను తోసిపుచ్చడం ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా తమ ఒత్తిడిని బేఖాతరు చేయడమే గాక ఇదే అదనుగా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం వాటికి మరింత అసహనం కలిగిస్తున్నది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను నిబంధనలను పాతర వేయడమేనని సభ్యులు విమర్శిస్తున్నారు.ఈ రోజు కూడా లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపి మనీష్‌ తివారి, రాజ్యసభలో సిపిఎం సభ్యుడు ఎలగారం కరీం తదితరులు నోటీసులు ఇచ్చారు. అయితే వాటిపై కనీస వివరణ గాని స్పందన గాని లేకుండానే తోసిపుచ్చడం జరిగిపోయింది. సభలు ి ముందే వాయిదా పడ్డాయి. సాధారణంగా లోక్‌సభలో రాజకీయ వేడి ఎక్కువగావుంటుంది గనక చర్చకు అనుమతించని విషయాలమీద రాజ్యసభలో ఏదో రూపంలో తీసుకోవడం పరిపాటి. కాని ఈసారి రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు బొత్తిగా భీష్మించడమే గాక సభ్యుల ప్రవర్తన బాగాలేదంటూ రోజూ పాఠాలు చెప్పడం ప్రతిపక్షాలకు మరింత ఆగ్రహ కారణమైంది. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే చైర్మన్‌కు లేఖ రాశారు.ప్రధాని మోడీ లేదా హొంమంత్రి అమిత్‌షా సమక్షంలో పెగాసస్‌ సమస్య చర్చించాలని అన్ని ప్రతిపక్షాలు కలిసి పట్టుపడుతున్నా ఏకపక్షంగా తిరస్కరించడం అందులో ఆయన దృష్టికి తెచ్చారు. అంతేగాక తమ ఆందోళన వల్ల ఇతర సభ్యులకు నష్టం కలుగుతున్నదని ఆయన మందలించడం కూడా ఖర్గే ప్రస్తావించారు.

నోటీసులు తిరస్కరించేముందు కనీసం వాటిని వివరించడం లేదు. ఒక వైపున ప్రతిపక్షాలు సంబంధిత నిబంధనల కింద ఇచ్చిన నోటీసులను తోసిపుచ్చుతూ వారివల్లనే సభికులకు నష్టం కలుగుతున్నదని చైర్మన్‌ వెంకయ్య చిత్రించడం సరికాదని తన లేఖలో ఖర్గే స్పష్టంచేసినట్టు చెబుతున్నారు. ఈ వైఖరి మారే అవకాశం కూడా కనిపించడం లేదు గనక మరింత తీవ్రమైన నిరసన తెల్పాలని అవసరమైతే అవిశ్వాసంనోటీసు కూడా ఇవ్వాలని ప్రతిపక్షాలుభావిస్తున్నట్టు సమాచారం. చైర్మన్‌ తమతో ఎలాటి సంప్రదింపులు జరపకుండానే చర్చలు లేకుండానే తమపై అభిశంసనా వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అభ్యంతరం చెబుతున్నారు.లోక్‌సభలో స్పీకర్‌ ఓం బిర్లా తీరు ఇందుకు భిన్నంగా లేదు. తనపై కాగితాలు విసిరివేశారంటూ కొంతమంది సభ్యులను సస్పెండ్‌ చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనారు.రాజ్యసభలో ప్రతిపక్షాల బలం రీత్యా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే అవిశ్వాసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

అత్యున్నత న్యాయస్థానం ఎంపిలు, పాత్రికేయులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించి పెగాసస్‌ కేసును ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ ఆధ్వర్యంలో ఆగష్టు 5 న విచారణకుచేపడుతున్నది. న్యాయస్థానం కనపర్చిన స్పందన కూడా ్ల సభాపతులు చూపించకపోవడం ఏమిటన్నది ప్రతిపక్షాల ప్రశ్న,ఈ నేపథ్యంలో ఒక మాక్‌పార్లమెంటు జరిపి అక్కడైనా పెగాసస్‌ కూలంకషంగాచర్చించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మంగళవారం ఇచ్చే అల్పాహార విందులో ఇందుకు సంబందించిన నిర్ణయం జరగవచ్చు.అంతర్జాతీయంగానూ ఇజ్రాయిల్‌పై ఇప్పటికే అమెరికా ఫ్రాన్స్‌ వత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version