Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telakapalli Ravi Analysis On Mp Raghu Rama Krishnam Raju Bail Issue

తెల‌క‌ప‌ల్లి ర‌వి: ఆంక్షతోనే బెయిల్‌, సుప్రీం తీర్పు మిశ్రమమే

Published Date :May 21, 2021 , 10:14 pm
By Sudhakar Ravula
తెల‌క‌ప‌ల్లి ర‌వి: ఆంక్షతోనే బెయిల్‌, సుప్రీం తీర్పు మిశ్రమమే
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎంపీ రఘురామరాజుకు ఆనారోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవానికి మిశ్రమంగానే వుంది. బెయిల్‌ సమయంలో పత్రికకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వరాదని మీడియాతో మాట్లాడరాదని ఆంక్ష‌లు పెట్టడమే గాక సిఐడి పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాని కోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు గనక సిఐడి కస్టడీలో వుంచి విచారణ జరపాల్సినంత అవసరం లేదంటూ ఇప్పటికే వారు వీడియోతో సహా సాక్ష్యాధారాలు సేకరించుకున్న సంగతి గుర్తు చేసింది. స్వయానా సిఐడి డిఐజినే ఎఫ్‌ఐఆర్‌కు ముందే దర్యాప్తు చేశారు గనక ఆయన నుంచి కస్టడీలో రాబట్టవసినంత అవసరం లేదని పేర్కొంది. అంతేగాని ఆయనపై 124(ఎ) కింద కేసు పెట్టడం గాని అరెస్టు చేయడం గాని తప్పు పట్టలేదు. ఇప్పటికే విమర్శల‌కు గురవుతున్న రాజద్రోహం ఆరోపణలు మోపడాన్ని ఆక్షేపించలేదు. ఎంపీ తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్తగి కూడా కేసు కక్షపూరితం అంటూనే బెయిల్‌ కోసం మాత్రమే వచ్చామన్నారు. అరెస్టు జరిగి దాదాపు వారం గడిచింది గనక బెయిల్‌ ఇవ్వడం వూహించదగిందే.
ఎంపీని కస్టడీలో సిఐడి పోలీసులు కొట్టారన్నది కూడా ఈ విచారణ సందర్భంలో నిర్ధారణ కాకపోవడం మరో ముఖ్యాంశం. గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల‌ నివేదికపై నమ్మకం లేదన్న ఎంపీ న్యాయవాది ఆయన తరపునే ఆర్మీ ఆస్పత్రిని కోరుకున్నారు. ఆర్మీ ఆస్పత్రి పరీక్షల‌ తర్వాత ఇచ్చిన నివేదికలో కాలి వేలికి గాయం వున్నట్టు చెబుతూనే అది కొట్టడం వ‌ల్ల కలిగిందనే సూచన ఏదీ చేయలేదు. ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్‌ దవే ఆ గాయం ఆయనే చేసుకుని వుండవచ్చునని ఆరోపించారు. పైగా గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు ఎంపీ తన స్వంత కారులోనే వచ్చారు గనక ఆ సమయంలో ఏమైనా జరిగివుండవచ్చునని అన్నారు, ఈ విషయంలోనూ సుప్రీం కోర్టు లోతుల్లోకి పోకుండా కస్టడీలో ఎంపీ పట్ల అనుచితంగాప్రవర్తించి వుండవచ్చుననేది తోసిపుచ్చలేమని సరిపెట్టింది. దీనిపై సిబిఐ విచారణ జరిపించాని ముకుల్‌రోహ్తగి అడిగినదానికి స్పందించలేదు. ఈ వారంరోజులోనూ ఎంపి కొట్టడంపై ప్రధానంగా చర్చ జరిగిన సంగతి గుర్తు చేసుకుంటూ ఆర్మీఆస్పత్రి నివేదిక తర్వాత కూడా ధర్మాసనం దానిని దాటవేయడం గమనించాల్సిన విషయమవుతుంది.

 న్యాయమూర్తు వినీత్‌శరణ్‌, గవాయ్‌తో కూడిన ధర్మాసనం తన తీర్పులో ఇరువురు సీనియర్‌ న్యాయవాదుల‌ వాదనను సమానంగానే ప్రస్తావించింది. బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు స్పందించి వుండాల్సిందని కూడా వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఒకే కేసులో గుంటూరు సిఐడి కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ పలురకాల‌ తీర్పు చెప్పడం గజిబిజికి దారితీసిన మాటా నిజమే. ఇప్పుడు బెయిల్‌పై విడుదలైన ఎంపి గతంలోవలె వివాదాస్పద విడియోలు చేసే అవకాశం వుండదని భావించాలి. కస్టడీలో కొనసాగించాల‌న్న ప్రభుత్వం సిఐడి ఆలోచన కూడా సాగదు. వైసీపీ ప్రభుత్వం రఘురామ వెనక టిడిపి వుందని అంటున్నాఅదృశ్య పాత్రధారిగా వున్న కేంద్ర బిజెపి ఏంచేస్తుందోచూడాలి. కేసుతో సంబంధం లేకుండా హోం మంత్రి, స్పీకర్, ‌ఎంపి కుటుంబ సభ్యుల‌ను కలుసుకున్నారు. విచారణ జరుగుతుండగానే తనకు నివేదిక పంపాల్సిందిగా స్పీకర్‌ ఓంబిర్లా.. హోంశాఖను కోరారు. ఆయనకు గతంలో వై కేటగరీ ఇచ్చిన బిజెపి ఇప్పుడు మరే విధమైన జోక్యం చేసుకోదని చెప్పలేము.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cid
  • Kanumuru Raghu Rama Krishnam Raju
  • MP Raghurama Krishnam Raju
  • Raghurama Krishnam Raju

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions