NTV Telugu Site icon

తెలకపల్లి రవి: ఐదు కోర్కెలతో అఖిలపక్షం, బీజేపీ వ్యూహాత్మక రహస్యం

All Party Meeting

All Party Meeting

2019 ఆగష్టులో జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రాష్ట్ర హోదాను రద్దుచేసి లడక్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటి జాతీయ స్థాయి రాజకీయ చర్చ జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ ఒమర్‌ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్‌, మెహబూబా ముఫ్తిలతో పాటు బిజెపి నేత రవీంద్రరైనా నిర్మల్‌ సింగ్‌, సిపిఎం నాయకుడు ఎంఎల్‌ఎ యూసప్‌ తరగామి, ఆప్‌ నా పార్టీ నాయకుడు బుఖారి, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత ముజఫర్‌ బేగ్‌ తదితరులు హాజరయ్యారు. అయితే అందరూకలసి వినిపించిన కోర్కెలలో అయిదు ప్రధానమైనవిగా ముందకొచ్చాయి.

      రాష్ట్రంలో ఇదే మొదటి ప్రజాస్వామిక ప్రక్రియకాగా కేంద్రం కాశ్మీర్‌పరిస్థితిని శాశ్వతంగా మార్చి బిజెపి విధానం అమలు చేయడం కోసం ఆంక్షలు అరెస్టులు రెండేళ్లు సాగినా చివరకు చర్చలకు ఆహ్వానించడాన్ని అందరూ హర్షించారు. నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం ఈ సమావేశం పిలిచింది, కాగా అలయన్స్‌ పార్టీల తరపున ఫరూక్‌ అయిదు కోర్కెలు ముందుంచారు. 1. రాష్ట్ర హోదా పునరుద్ధరణ, 2. ప్రజాస్వామికంగా ఎన్నికలు, 3. కాశ్మీర్‌ పండిట్లతో సహా అందరి పునరావాసం, 4. నివాస నిబంధనల పునరుద్ధరణ, 5. నిర్బంధంలో వున్న డిటెన్యూల విడుదల.

    రాష్ట్ర హోదా పునరుద్ధరణకుకేంద్రం కట్టుబడివుందని ఈ సమావేశంలో మోడీ హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనలో అందరూ పాలుపంచుకోవాలని ప్రధాని మోడీ ఈ సమావేశంలో కోరారు. తర్వాత ఇతర విషయాలు ఆలోచించవచ్చునన్నారు. ఆయనతో పాటు హోం మంత్రి అమిత్‌ షా భద్రతా సలహాదారు అజిత్‌ దోవెల్‌, కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హాలు కూడా చర్చలలో పాలు పంచుకున్నారు. మొత్తంపైన కాశ్మీర్‌ చర్చల ప్రక్రియ పునరారంభం అందరికీ సంతోషం కలిగించింది. అయితే ఈ ప్రతిపాదనలో , ఒకటుంది. ఈ నియోజకవర్గాల పునర్విభజనతో దానికి బలం గల జమ్మూ ప్రాంతంలో ఏడు నియోజకవర్గాలు పెంచుకోవాలన్న ఆలోచన వుంది. ఇప్పటి వరకూ ఇది 47,36గా వుండేది. ఆ ప్రాంతంలో ఆధిక్యత గల బిజెపి అప్పుడు తనే నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల అవకాశం వుంటుంది.