Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Sangareddy Dmhvo

సంగారెడ్డిలో డీఎంహెచ్‌వో కుర్చీకోసం ఎత్తుగడలు !

Published Date :August 5, 2021 , 4:56 pm
By Lakshmi Narayana
సంగారెడ్డిలో డీఎంహెచ్‌వో కుర్చీకోసం ఎత్తుగడలు !
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకరికేమో ప్రభుత్వంలోని పెద్దల అండ. ఇంకొకరికి అదే శాఖలో బడా బాబుల ఆశీస్సులు. ఇలా పెద్దోళ్లే వెనకుండటంతో ఒకే కుర్చీకోసం కుస్తీ పడుతున్నారు ఆ ఇద్దరు అధికారులు. బదిలీ అయినా వెళ్లకుండా ఒకరు.. ఛార్జ్‌ తీసుకోవాలని ఇంకొకరు వేయని ఎత్తులు లేవు. అదే ఆ జిల్లా వైద్యవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

సంగారెడ్డి డీఎంహెచ్‌వో పోస్టు కోసం 4 నెలలుగా కుర్చీలాట!

Also Read

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
  • Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!

జిల్లాస్థాయి పోస్టులంటే రాజకీయ ప్రమేయం లేకుండా జరగవు. మనవాళ్లు అనేవాళ్లను తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టుకోవడం కామన్‌. సంగారెడ్డి DMHO పోస్ట్‌ కూడా ఈ జాబితాలోకే చేరింది. కరోనా పగడ విప్పిన సమయంలో DMHO పోస్ట్‌ చాలా కీలకం. అలాంటిది మార్చి నెల నుంచీ ఈ పోస్ట్‌ కోసం కుర్చీలాట ఓ రేంజ్‌లో సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లో.. పనిభారమో తెలియదు కానీ.. ఇంఛార్జ్‌గా వచ్చిన అధికారులు పట్టుమని పదిరోజులు ఉండలేని పరిస్థితి. మాతా శిశు సంరక్షణ కేంద్రం POగా ఉన్న గాయత్రీదేవిని ఇంఛార్జ్‌గా మార్చి 30న వేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే మెదక్‌ టీబీ ఆఫీసర్‌ లక్ష్మణ్‌సింగ్‌కు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. సమస్య పరిష్కారమైందని సంబరపడుతున్న సమయంలో అసలు కథ మొదలైంది. నాలుగు నెలలుగా కుర్చీలాట రసరత్తరంగా జరుగుతోంది.

వేర్వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకున్న అధికారులు!

డీఎంహెచ్‌వోగా వచ్చిన లక్ష్మణ్‌సింగ్‌కు ఛార్జ్‌ ఇవ్వడానికి గాయత్రీదేవి నిరాకరిస్తున్నారట. ఆమె వెనక కలెక్టర్‌తోపాటు ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తానే డీఎంహెచ్‌వోగా ఉండేందుకే గాయత్రీదేవి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారట. లక్ష్మణ్‌సింగ్‌ ఛార్జ్‌ తీసుకోవడానికి నాలుగు నెలలుగా రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. రోజూ ఆఫీస్‌ వస్తున్నారు.. రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారు.. సాయంత్రం వెళ్లిపోతున్నారు. DMHO కుర్చీలో కూర్చోకుండా.. వేర్వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు. ఎవరి మాట వినాలో ఆఫీస్‌ సిబ్బందికి అర్థం కాని పరిస్థితి.

ఆమెకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు?
లక్ష్మణ్‌సింగ్‌కు డిపార్ట్‌మెంట్‌ పెద్దల అండ?
ఒక పోస్ట్‌.. ఇద్దరు అధికారులు!

ప్రభుత్వంలోని పెద్దల ఆశీసులు ఉండటంతో అధికారిక కార్యక్రమాలకు DMHO హోదాలో గాయత్రిదేవికే ఆహ్వానాలు పంపుతున్నారట. అయితే లక్ష్మణ్‌సింగ్‌కు వైద్య ఆరోగ్యశాఖలో పెద్దల మద్దతు ఉందట. దీంతో ఆయనా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. గత నెల 15న లక్ష్మణ్‌సింగ్‌ను నారాయణపేట ఇంచార్జ్‌ DMHOగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడికి వెళ్లేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఒకరికొకరు ఎదురుపడటం లేదు. లక్ష్మణ్‌సింగ్‌కు ఎక్కడ ఛార్జ్‌ అప్పగించాలో అని మొదట్లో గాయాత్రీదేవి ఆఫీస్‌కు రాలేదట. ఫైల్స్‌ అన్నీ ఇంటిదగ్గరే చూసేవారట. ఇప్పుడు ఇద్దరూ ఆఫీస్‌కు వస్తున్నా.. వేర్వేరు ఛాంబర్లో ఉంటూ కాలం గడిపేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు.. ఉన్నతాధికారుల పంతాలు.. సంగారెడ్డి DMHO పోస్ట్‌ను కీచులాటగా మార్చేశాయి. ఒక కుర్చీ ఇద్దరు అధికారులు అన్నట్టుగా మారిపోయింది. ఈ విషయం తెలిసినా.. జిల్లాలోని మంత్రులు.. ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • sangareddy DMHVO
  • telangana

తాజావార్తలు

  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

  • PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు‌ డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..

  • AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!

  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..

  • Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions