Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Prakasam District Ycp Politics 2

ఆశలు నెరవేరక ప్రకాశం జిల్లా వైసీపీ సీనియర్లు దిగాలు

Published Date :July 22, 2021 , 2:23 pm
By Lakshmi Narayana
ఆశలు నెరవేరక ప్రకాశం జిల్లా వైసీపీ సీనియర్లు దిగాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్‌ పోస్ట్‌ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు. ఏదో ఆశిస్తే.. ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు. మెడలో కండువా ఉన్నా.. చేతిలో పదవి లేక తెగ మథన పడుతున్నారట. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారా .. లేరా?

వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ప్రకాశం జిల్లాలో అనేక మంది ఉన్నారు. కొందరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే.. ఇంకొందరు నియోజకవర్గ ఇంఛార్జ్‌లుగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టడంతో తమకూ మంచి రోజులు వచ్చాయని లెక్కలు వేసుకున్నారు నాయకులు. ఏదో ఒక నామినేటెడ్‌ పదవి రాకపోతుందా అని రెండేళ్లుగా ఎదురు చూసిన వారికి నిరాశ తప్పలేదు. అసలు తమను సీనియర్లుగా పార్టీలో గుర్తిస్తున్నారా? పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నామా? లేదా అన్న అనుమానంలో ఉన్నారట.

read also : “నారప్ప” ఫేమ్ కార్తీక్ రత్నం ఇంటర్వ్యూ

అప్పటి నుంచీ వెనక బెంచీకే పరిమితమా?

ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టుల్లో జిల్లా వైసీపీలో సీనియర్లుగా భావించే కొందరు నాయకుల పేర్లు లేవు. గతంలో నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జులుగా ఉన్నా.. పెద్దలు చెప్పారని 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. బరిలో ఉన్నవారి విజయానికి కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే మంచి గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో వారంతా నాడు వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి వెనక బెంచీకే పరిమితమై ఆవేదన చెందుతున్నారట.

బ్రహ్మానందరెడ్డికి తప్పని నిరాశ!

మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని కాదని.. కందురు నాగార్జునరెడ్డికి టికెట్‌ ఇచ్చారు. అప్పట్లో అధిష్ఠానం ఇచ్చిన హామీతో వెంకటరెడ్డి సైలెంట అయ్యారు. 2014లో బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిన వరికూటి అమృతపాణి, పర్చూరులో పోటీ చేసిన ఓడిన గొట్టిపాటి భరత్‌తోపాటు.. కందుకూరు ఇంఛార్జ్‌గా పనిచేసిన తూమాటి మాధవరావు, కొండపి ఇంఛార్జ్‌గా ఉన్న అశోక్‌బాబుల పేర్లు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టలు జాబితాలో లేవు. ఓదార్పు యాత్రలో జగన్‌తో కలిసి నడిచిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డికి సైతం నిరాశ తప్పలేదు. వాస్తవానికి బ్రహ్మానందరెడ్డికి తప్పకుండా నామినేటెడ్‌ పదవి వస్తుందని జిల్లాలోని పార్టీ వర్గాలు భావించాయి. కానీ.. ఎవరినీ పరిగణనలోకి తీసుకోకపోవడం కేడర్‌ను ఆశ్చర్య పరిచింది.

పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు పదవులు దక్కకపోతే ఎలా అని కలవరం!

ప్రస్తుతం ఇంఛార్జులుగా పనిచేస్తున్నవారికే పదవులు కట్టబెట్టడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. పైకి చెప్పకపోయినా లోలోపల చాలా మథన పడుతున్నట్టు పార్టీ వర్గాల టాక్‌. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కకపోతే రాజకీయ భవిష్యత్‌ ఏంటా అని కలవర పడుతున్నారట సీనియర్లు. జిల్లాలో మొత్తం ఈ ఐదు నియోజకవర్గాల గురించే పార్టీ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరి.. ఈ అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు.. తమకు జరిగిన అన్యాయంపై ఓపెన్‌ అవుతారో.. పొలిటికల్ ఫ్యూచర్‌కు అనుగుణంగా అడుగులు వేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • Prakasam District
  • ycp

తాజావార్తలు

  • Fuel Crisis: దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్.. కేంద్రం కీలక ప్రకటన..

  • MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త.. ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సేవ‌లు..

  • Prabhas-PVCU: ‘బ్రహ్మరాక్షస్’ కోసం ఊహించని క్యామియో?

  • Telangana Assembly: జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం.. ఆ పోస్టుల పేర్లు మార్పు..

  • PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

ట్రెండింగ్‌

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions