Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Chittoor Tdp Leaders

చిత్తూరు జిల్లా టీడీపీ తమ్ముళ్ల ఆవేదన..!

Published Date :September 23, 2021 , 4:47 pm
By Manohar
చిత్తూరు జిల్లా టీడీపీ తమ్ముళ్ల ఆవేదన..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ జిల్లాలో వారి బాధను టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. వరస ఓటములతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నా వినేవాళ్లే లేరట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. మీకు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని నేతలకు వార్నింగ్‌ ఇస్తున్నారట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబును మించిన ఆవేదనలో టీడీపీ తమ్ముళ్లు..!

2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే గెలిచారు. మిగిలినచోట్ల వైసీపీదే విజయం. అది మొదలు.. పంచాయతీ, మున్సిపల్‌, తాజాగా పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా చతికిలపడింది. బలంగా ఉన్నామని భావిస్తున్న టీడీపీ శ్రేణులకు ఈ పరిణామాలు అర్థం కావడం లేదట. అధికారపార్టీలో వరస గెలుపులు ఉత్సాహం నింపితే.. టీడీపీలో నిశ్శబ్దం ఆవహించింది. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీగా చెప్పుకొనే చంద్రబాబుకు సైతం చిత్తూరు జిల్లా ఎన్నికల ఫలితాలు మింగుడుకపడటం లేదు. కానీ.. చంద్రబాబుకు మించిన ఆవేదనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారట.

పార్టీ నేతల తీరును సోషల్‌ మీడియాలో ఏకిపడేస్తున్న కేడర్‌..!

జిల్లాలో తిరుపతి, కుప్పం, పలమనేరు, మదనపల్లె, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉండేవి. అక్కడ కూడా సైకిల్‌ చతికిల పడింది. చంద్రగిరి, పుంగనూరు, తంబళ్లపల్లె, పూతలపట్టులో పార్టీ కేడర్‌ బలంగా ఉన్నా.. నేతల నుంచే స్పందన లేదట. ఇన్నాళ్లూ అధికారపార్టీపై గురిపెట్టిన పార్టీ శ్రేణులు.. ఇప్పుడు రూటు మార్చేశాయి. ముందుగా పార్టీని చక్కదిద్దుకోవాలనే ఆలోచనలోకి వెళ్లి.. సోషల్‌ మీడియాను ఎడాపెడా వాడేస్తున్నాయి. టీడీపీ చేస్తున్న తప్పులను… జిల్లా నాయకులు వేస్తున్న తప్పటడుగులను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఏకిపడేస్తున్నారట.

చిత్తూరు జిల్లాను లోకేష్‌ మర్చిపోయారని కేడర్‌ సెటైర్లు..!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలుమార్లు.. పంచాయతీ ఎన్నికల తర్వాత మరోసారి చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఎక్కడ లోపం ఉందో.. ప్లానింగ్‌ ఎక్కడ దెబ్బతిస్తుందో కేడర్‌ చెప్పింది. వాటిని చంద్రబాబు ఆలకించారు.. నోట్‌ చేసుకున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో మార్పులు లేవనే ఆగ్రహంతో ఉన్నారు తమ్ముళ్లు. ఇక చిత్తూరు జిల్లా అన్నది ఒకటి ఉందని నారా లోకేష్‌ మర్చిపోయారని టీడీపీ శ్రేణులే సెటైర్లు వేస్తున్నాయి.

వైసీపీ విమర్శలకు టీడీపీ నుంచి కౌంటర్లు లేవు..!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో కనిపించిన నారా లోకేష్ తర్వాత జిల్లాను పట్టించుకోలేదని గుర్రుగా ఉందట కేడర్‌. సొంత జిల్లాపై ఫోకస్‌ పెట్టాలని కోరినా అటునుంచి సమాధానం లేదట. ఆ మధ్య చంద్రబాబు మరోసారి కుప్పంలో తప్పకుండా పోటీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెటకారంగా మాట్లాడినా.. టీడీపీ నుంచి కౌంటర్లు లేవట. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పార్టీ నేతలు నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి తదితరులు మౌనంగా ఉండటాన్ని కేడర్‌ జీర్ణించుకోలేకపోతోందట.

నేతలు మారకపోతే..ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని వార్నింగ్‌..!

కీలక అంశాలపై జిల్లాలోని టీడీపీ నేతలతోపాటు చంద్రబాబు, లోకేష్‌లు సైతం మౌనంగా ఉండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారట తమ్ముళ్లు. తమను పట్టించుకోవాలని.. పార్టీకి అండగా ఉండాలని కోరుతున్నారట. మీరు మారతారా లేదా.. ఇదే మీకు లాస్ట్‌ ఛాన్స్‌ అని కొందరు కార్యకర్తలు వార్నింగ్‌ ఇస్తున్నట్టు టాక్‌. పరిషత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత శ్రేణులు ఇంకా రగిలిపోతున్నాయట. మరి.. వారి మొరను పార్టీ పెద్దలు ఆలకిస్తారో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Chittoor
  • chittoor tdp
  • chittoor tdp leaders
  • tdp

తాజావార్తలు

  • HYDRA : హైడ్రా హడావిడి.. 2 గంటల్లో ఇళ్లు ఖాళీ చేయండి..! ఐలాపూర్‌లో నివాసితుల కన్నీళ్లు

  • Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!

  • Jana Nayagan: లీకుల కలకలం హ్యాకర్ల పనే?

  • RGV: “దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను”.. అండర్‌వరల్డ్ గురించి వర్మ పచ్చి నిజాలు!

  • Singer Mangli : మంగ్లీ చీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్?

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions