Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Shadow Mla In Nizamabad Rural

నిజామాబాద్‌ రూరల్‌లో షాడో ఎమ్మెల్యే…?

Published Date :October 31, 2021 , 9:55 pm
By Manohar
నిజామాబాద్‌ రూరల్‌లో షాడో ఎమ్మెల్యే…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తారు నాయకులు. పదవిలో ఉండగానే వారసులను జనాలకు పరిచయం చేయడం.. వీలైతే ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటారు. ఆ ఎమ్మెల్యే కూడా అదే చేశారు. కాకపోతే తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే.. తనయుడు షాడోగా పెత్తనం చేయడమే ఆ నియోజకవర్గంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా షాడో? ఏమా కథ?

బాజిరెడ్డి కుమారుడి తీరుపై పార్టీలో చర్చ..!

బాజిరెడ్డి గోవర్దన్‌. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే. ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ అయ్యారు గోవర్దన్‌. మంత్రి కావాలనే ఆయన కోరిక తీరలేదు. వయసు మీద పడుతుండటంతో వారసుడిగా కుమారుడు జగన్‌ను జనానికి పరిచయం చేశారు. వచ్చే ఎన్నికల్లో తండ్రి ప్లేసులో తనయుడు ఎమ్మెల్యేగా బరిలో దిగుతారని చర్చ జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాజిరెడ్డి కుమారుడి తీరే టీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చగా మారింది.

ఎమ్మెల్యేకు షాడోగా జగన్‌ మారడంపై పార్టీలో చర్చ..!

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని దర్పల్లి జడ్పీటీసీగా ఉన్నారు బాజిరెడ్డి జగన్‌. ఈ మధ్యే నియోజకవర్గం అంతా పర్యటిస్తున్న జగన్‌.. పార్టీ, ప్రభుత్వ పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సిరికొండ, డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల్లో జగన్‌ ముఖ్య అతిథిగా పాల్గొనటంపై ఇతర ప్రజాప్రతినిధులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యే గోవర్దన్‌ వారసుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఓకే. ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో జగన్‌ ముఖ్యఅతిథిగా రావడాన్ని వారు ప్రశ్నిస్తున్నారట. ఆయన ఒక జడ్పీటీసీ అని గుర్తు చేస్తున్నారట. షాడోగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం.

కుమారుడి ఎంట్రీతో పార్టీలో ఆశావహుల డైలమా?

కుమారుడిని టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడిని చేయాలని ఎమ్మెల్యే గోవర్దన్‌ ఆశించారు. ఇంతలో ఆయనకే ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో.. ఇప్పుడు కుమారుడికి పార్టీ పదవి వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్దన్‌ పోటీ చేయకపోతే.. అక్కడ పార్టీ టికెట్‌ అడగాలని చాలా మంది కాచుకుని ఉన్నారు. ఇప్పుడు జగన్‌ ఎంట్రీతో వాళ్లు డైలమాలో పడ్డారట. ఈ అడ్డంకులను దాటుకుని మెయిన్‌ స్ట్రీమ్‌లోకి కుమారుడిని తీసుకొచ్చే సమయం కోసం బాజిరెడ్డి గోవర్దన్‌ వేచి చూస్తున్నట్టు టాక్‌. మరి… ఎమ్మెల్యేకు ఆ టైమ్‌ ఎప్పుడొస్తుందో.. వారసుడికి లైన్‌ ఎలా క్లియర్‌ చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nizamabad
  • nizamabad rural
  • shadow mla

తాజావార్తలు

  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..

  • Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..

  • Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..

  • Mrunal Thakur: నాని, దుల్కర్ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్స్.. వారి సపోర్ట్ మర్చిపోలేను: మృణాల్ ఠాకూర్

  • Tadka Buttermilk Recipe: వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం..! ఇంట్లోనే సులువుగా తడ్కా మజ్జిగ ఇలా తయారు చేయండి..

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions