Site icon NTV Telugu

Off The Record: పూజారుల పొలిటికల్ టచ్అప్! జోగులాంబలో కాంగ్రెస్, బీఆర్ఎస్గా చీలికలు!

Jogulamba

Jogulamba

Off The Record:పూజారులు పొలిటికల్‌ టచ్‌ ఇస్తున్నారా? దేవ సేవకు బదులు రాజకీయ నాయకుల సేవల్లో మునిగి తేలుతూ శక్తి పీఠం ప్రతిష్టను మంటగలుపుతున్నారా? కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అంటూ… వాళ్ళకు వాళ్ళే పొలిటికల్‌ కలర్స్‌ పులిమేసుకుని పవిత్ర క్షేత్రంలో రాజకీయ రచ్చ చేస్తున్నారా? పరమ పావన క్షేత్రంలో పచ్చి రాజకీయం జరుగుతోందా? ఏ ప్రధాన ఆలయంలో ఉందా పరిస్థితి?

Read Also: AP Liquor Scam : క్లైమాక్స్‌కు చేరుకున్న దర్యాప్తు !

దేశంలో ప్రసిద్ధిగాంచిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది అలంపూర్ జోగులాంబ క్షేత్రం. అమ్మవారి ఆలయంతో పాటు బాల బ్రహ్మేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. అమ్మవారి ఆలయంలో ఐదుగురు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మరో ఐదుగురు పూజారులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది ఉన్న ఈ క్షేత్ర పర్యవేక్షణను ఈవో చూసుకుంటారు. అయితే ఇటీవల ఈవోతో పాటు పూజారులపై ఫిర్యాదులు, శాఖాపరమైన చర్యలు, మధ్యలో పొలిటికల్ లీడర్స్ ఎంట్రీ వంటి ఎపిసోడ్స్‌తో ప్రతిష్ట మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మరీ ముఖ్యంగా ఆలయ పూజారులు, సిబ్బంది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అంటూ రెండు పార్టీల వర్గాలుగా చీలిపోవడం భక్తుల్ని మరింత కలవరపెడుతోందట. వీళ్శ రాజకీయాలు ఏమన్నా ఉంటే బయట చూసుకోవాలిగానీ.. గుడి ప్రతిష్టను మంట గలిపేలా ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Read Also:Off The Record: కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలని సీఎం ఆదేశించారా?

క్షేత్ర ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో పురందర్ తో పాటు, ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కొన్నేళ్ళుగా ఆలయ ఆదాయానికి సంబంధించిన ఆడిట్ నిర్వహించడం లేద‌నే ఆరోప‌ణ‌లతో పాటు… భక్తులు ఇచ్చే కానుకలు, నగదు లెక్కా పత్రం లేకుండా తీసుకుంటున్నారని, భక్తులకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించడం లేదన్నవి ప్రధాన ఆరోపణలు. ఇక దీనికి తోడు ప్రధాన పూజారి ఆనంద్ శర్మ వ్యవహార శైలి వివాదస్పదంగానే మారినట్టు చెప్పుకుంటున్నారు. ఆ మధ్య కర్నూల్‌లో తన భార్యాపిల్లలతో కలిసి సినిమాకు వెళ్లిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని ఆనంద్ శర్మ ఫోటోలు తీయడం, అందుకు ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడం, ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగడం లాంటి వ్యవహారాలు చాలా జరిగాట. దానికి సంబంధించి ఎమ్మెల్యే విజయుడు ఆనంద్ శర్మపై కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడంతో పాటు.. దేవదాయ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులకు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు, అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

Read Also:Anakapally : అనకాపల్లిలో వరుస హత్యలు.. అసలేం జరుగుతోంది..

ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రధాన పూజారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అర్చకులు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన సైతం నిర్వహించారు. వీటన్నింటిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆనంద్ శర్మను సస్పెండ్ చేశారు. అక్కడే మేటర్‌కు ఫుల్‌ పొలిటికల్‌ కలర్‌ వచ్చింది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అండదండలతో సస్పెన్షన్ పై స్టే తెచ్చుకుని మళ్లీ పెత్తనానం చేస్తున్నారట ఆనంద్‌ శర్మ. ఇదిలా ఉంటే…. ఇటీవల జోగులాంబ ఆలయ అర్చకులు విక్రాంత్ శర్మ , వెంకట క్రిష్ణ ,క్రిష్ణమూర్తి….ఏపీకి చెందిన ఒక మాజీ మంత్రి కుమారుడి పెళ్ళికి వెళ్ళి ఆశీర్వచనం ఇచ్చి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి జ్ఞాపికను అందించడం వివాదస్పదంగా మారింది. ఆలయ రూల్స్‌ను అతిక్రమించి పెళ్ళి మండపానికి వెళ్ళి ఆశీర్వచనం ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివాహం అలంపూర్‌ బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బంధువులది కావడంతో… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఎపిసోడ్ ను సోషల్ మీడియా లో వైరల్ చేశారు.

Read Also:Bandi Sanjay: నక్సలైట్లు దేశ భక్తులని అంటున్నారు..

దాంతో అది మరింత వివాదాస్పదమై… ముగ్గురు పూజారులను సస్పెండ్ చేసింది దేవాదాయ శాఖ. ఆ ముగ్గురు పూజారుల్ని చర్యల నుంచి కాపాడేందుకు ఎమ్మెల్సీ చల్లా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అలంపూర్ కాంగ్రెస్‌ నేత ఒత్తిడితోనే దేవాదాయ శాఖ ముగ్గురు పూజారులను ఉన్నపళంగా సస్పెండ్ చేసిందన్న చర్చ సైతం జరుగుతోంది. ఇక తాజాగా ఈవో పురందర్ మీద కూడా బదిలీ వేటు వేసి కొత్త ఈవో ను నియమించారు. మొత్తం మీద ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు పాలక మండలిలో ఉండటం సహజంగానీ…. పూజారులు సైతం రెండు పార్టీలకు వత్తాసు పలుకుతూ… ఆయా పార్టీల నేతల అండదండలతో పాలిటిక్స్‌ చేయడం అలంపూర్‌లోనే జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. భగవంతునికి భక్తుడికి అనుసంధానంగా ఉండాల్సిన అయ్యవార్లు…. అనవసర వివాదాలతో లేని చోట పొలిటికల్ అగ్గి రాజేసినట్టు భావిస్తున్నారు కొందరు. అటు భక్తులు మాత్రం ఈ విషయంలో చాలా సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు. వాళ్ళు వీళ్ళు అని చూడకుండా… క్షేత్ర ప్రాశస్త్యానికి భంగం కలిగించేవాళ్ళు ఎవరైనా సరే… చర్యలు తీసుకోమని కోరుతున్నారు.

Exit mobile version