OTR : కొండా దంపతులు రాజకీయ ఒంటరి అవుతున్నారా?

Konda

Konda

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో… ఓల్డ్‌ సీన్స్‌ రిపీట్‌ అవుతున్నాయా? పార్టీ పెద్దలు చేసిన ప్యాచ్‌ వర్క్‌ మొత్తం… గట్టి వానకు వెలిసిపోయినట్టుగా అయిపోయిందా? జిల్లా కాంగ్రెస్‌లో కొండా కుటుంబం మళ్ళీ ఒంటరి అయిందా? తాజా రాజకీయ పరిణామాలు ఎటువైపు దారిస్తున్నాయి? లెట్స్‌ వాచ్‌. మంత్రి కొండా సురేఖ దంపతుల కుమార్తె సుశ్మితా పటేల్‌ వ్యాఖ్యలు ఓ వైపు స్టేట్‌ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నాయి. అదే సమయంలో అటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా సీన్‌ మారుతున్నట్టు కనిపిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. కొండా దంపతులు రాజకీయంగా మళ్లీ ఒంటరి అవుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయంటున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా మిగతా జిల్లా నేతలంతా మళ్లీ జట్టు కట్టారన్నది తాజా విశ్లేషణ. మంత్రి సురేఖ బర్త్‌డే సందర్భంగా ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మొత్తం తెలంగాణ కాంగ్రెస్‌నే షేక్‌ చేస్తున్నాయి. పార్టీ ఏకంగా మంత్రికి షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చేవరకు వెళ్ళింది. పిసిసి నుంచి వచ్చిన నోటీస్‌కు సున్నితంగా సమాధానం ఇచ్చిన సురేఖ… ఆ వ్యాఖ్యలు తన కుమార్తె వ్యక్తిగతమని, అందుకు నేనెలా బాధ్యత వహిస్తానంటూ ప్రశ్నించారు. అయితే… అదే సమయంలో… ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఒక్కటయ్యారు. మంత్రి కూమార్తె సీఎం రేవంత్‌రెడ్డిని, అంతకు మించి పార్టీ నాయకత్వాన్ని ఇశ్టానుసారం మాట్లాడుుతుంటే… చూస్తూ కూర్చోవాలా అని నిలదీశారు. కొండా దంపతులతో పాటు సుస్మిత పటేల్‌పై చర్యలు తీసుకోవాలని, ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్‌ వార్నింగ్‌ అని కూడా హెచ్చరించారు.

కూతురి మాటలకు నేనెలా బాధ్యత వహిస్తానన్నది సురేఖ ప్రశ్న అయితే… ఆమెను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ నిలదీస్తున్నారు జిల్లా లీడర్స్‌. ఉమ్మడి జిల్లాలోని పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకకాలంలో కొండా కుటుంబం తీరును తప్పుపడుతూ వార్నింగ్స్‌ ఇస్తుండటంతో…లోకల్‌గా మరోసారి ఆ ఫ్యామిలీ వర్సెస్‌ అదర్స్‌ అన్నట్టు పరిస్థితి మారిపోయిందంటున్నారు పరిశీలకులు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రేవూరిపై సుస్మిత ఇష్టానుసారం మాట్లాడారని, ఇది తీవ్ర అభ్యంతరకరమని అంటున్నారు ఓరుగల్లు కాంగ్రెస్‌ లీడర్స్‌. ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ లీడర్స్‌ అందరిదీ ఒకే మాట కావడంతో… పాత దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయంటున్నారు కార్యకర్తలు. గతంలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉండగా… మధ్యలో పెద్దల జోక్యం, భోజన సమావేశాలతో వాతావరణం కాస్త తేలిక పడ్డట్టు కనిపించింది. అయితే… సుస్మిత వ్యాఖ్యలతో ఇప్పుడది పూర్తిగా పోయినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడమే కాదు, అసలు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేయడం కలకలం రేపుతోంది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో… కొండా కుటుంబానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఒక్కరంటే ఒక్కరి నుంచి కూడా మద్దతు దొరకలేదు. అంతే కాదు…. సుస్మిత ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వేదిక మీద ఉన్న నామినేటెడ్ పదవులు పొందిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీకి లేఖలు రాయడం ఇంకా ఆసక్తికరంగా మారింది. ఆ రకంగా… జిల్లా నుంచి ఏ స్థాయిలోనూ వారికి మద్దతు దక్కకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కొండా కుటుంబానికి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలకు మధ్య గతంలోనూ విభేదాలు బహిర్గతమయ్యాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, ఇనగాల వెంకట్రాంరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి లాంటి నేతలంతా గతంలో రివర్స్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత వివాదాలు సద్దుమణిగినట్టు కనిపించినా… ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా సుస్మితా పటేల్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, తల్లిదండ్రుల ప్రోద్బలం లేకుండా ఆమె అలా ఎలా మాట్లాడగలుగుతారన్నది జిల్లా కాంగ్రెస్‌ క్వశ్చన్‌. ఈ పరిస్థితుల్లో… వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలందరూ ఒకవైపు… కొండా కుటుంబం మరోవైపు అన్నట్టు మారిందంటున్నారు పరిశీలకులు.