Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- పరిష్కారం ఫైళ్ళలో కాదు, ఫీల్డ్‌లో ఉండాలంటున్న కలెక్టర్ తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు స్పాట్లో పుల్లంపేట తహశీల్దార్ సస్పెండ్ మాజీ సైనికుడిని భూమి విషయంలో వేధించిన తహశీల్దార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లా కలెక్టర్ అందరికీ ఓకే…. రాజకీయ నాయకులు సహా… అన్ని వర్గాలు ఇబ్బంది లేదంటున్నాయిగానీ…. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంటే వద్దనుకుంటోందట. సాధారణంగా… ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు వివిధ అంశాలకు సంబంధించిన అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ… విచిత్రంగా వాళ్ళంతా హ్యాపీగా ఉంటే… ఒక ప్రభుత్వ విభాగమే వ్యతిరేకించడం ఏంటి? ఎవరా కలెక్టర్? ఏదా డిపార్ట్మెంట్? అసలు ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్ అవుతోంది. తనపాటికి తాను గిరి గీసుకుని కూర్చుని ఫైళ్లు, సమీక్షలు అంటూ ఆఫీస్‌కే పరిమితం అవకుండా… క్షేత్ర స్థాయిలో తిరుగుతూ వాస్తవాలు తెలుసుకుంటున్నారాయన. సమస్య ఏదైనా సరే….. పరిష్కారం ఫైళ్లలో కాదు, ఫీల్డ్‌లో ఉండాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు జిల్లాలో చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఏళ్ళ తరబడి అవినీతి అరచేతి మందాన పేరుకుపోయి, నిర్లక్ష్యం నిలువెత్తునా పేరుకుపోయిన ప్రభుత్వ విభాగాల తుప్పు వదిలించే పని కూడా మొదలుపెట్టారట వెంకటేశ్వర్. ఆయన చర్యలతో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైన వణుకు మొదలైందని చెప్పుకుంటున్నారు.
కలెక్టర్ ఎప్పుడు, ఏ రూపంలో ఏ ఆఫీసుపై రైడ్ చేస్తారో తెలియక రెవెన్యూ అధికారులు వణుకుతున్నట్టు తెలుస్తోంది. అందుకు ఇటీవల పుల్లంపేట మండలంలో జరిగిన ఘటననే ఉదాహరణగా చెబుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఒక మాజీ సైనికుడి భూ సమస్య పరిష్కారం విషయంలో జరిగిన జాప్యాన్ని తీవ్రంగా పరిగణించారట కలెక్టర్. ఆ మాజీ సైనికుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో… వెంటనే స్పందించిన కలెక్టర్.. తన ఎదురుగానే బాధితుడితో తహసీల్దారుకు ఫోన్ చేయించారు. అట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో…. డైరెక్ట్‌గా కాల్లోకి వచ్చిన కలెక్టర్… బాధితుడికి న్యాయం చేయకపోగా….. కబ్జా చేసినవారికి మద్దతు తెలుపుతావా స్పాట్లోనే తహశీల్దార్, కలెక్టర్‌ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన జిల్లా రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. అలాగే వాకాడు తహసీల్దార్‌పై వచ్చిన వేధింపుల ఆరోపణల విషయంలోనూ కఠినంగా వ్యవహరించి, తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఇలా.. తిరుపతి జిల్లాలో ఇప్పటిదాకా కొద్దిమంది సస్సెండ్ కాగా… చాలామంది అధికారులు బదిలీ అయ్యారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
మరోవైపు కేవలం ఆర్డర్లు వేయడమే కాకుండా….. బైక్‌ల మీద పర్యటిస్తూ, గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతోందో కూడా కలెక్టర్ తెలుసుకోవడం రెవెన్యూ సిబ్బందికి మింగుడు పడటం లేదట. ఇక పొలిటికల్ సర్కిల్స్‌లోనూ వెంకటేశ్వర్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య ఏదో ఒక విషయంలో గ్యాప్ ఉంటుంది. ఇదే జిల్లాలో గతంలో అలాంటివి జరిగాయి కూడా. కానీ… ఇప్పుడు సీన్ రివర్స్‌లో ఉందట. పలువురు ఎమ్మెల్యేలే స్వయంగా ఈమధ్య జరిగిన ఓ సమావేశంలో… మాకు ఈ కలెక్టరే కావాలని సీఎంని కోరినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతుండటంతో పాటు ఎమ్మెల్యేల పనులు కూడా ఎక్కడా పెండింగ్ ఉండటం లేదని చెప్పుకుంటున్నారు. అయితే…. రాజకీయ సిఫార్సులకంటే రూల్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఒకరిద్దరికి లోలోపల అసంతృప్తిగా ఉన్నా… ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఓకే అనుకుంటూ బయటికి ఏమీ అనలేకపోతున్నారట. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలోనూ ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి పని చేస్తున్న వ్యవహారం చర్చనీయాంశం అయింది.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 14 గంటల బస్సు యాత్రలు చేపట్టడం, గంజాయి కట్టడికి చర్యలు, 20కోట్ల విలువైన గంజాయి కాల్చివేత లాంటి వ్యవహారాల్లో కలెక్టర్, ఎస్పీ సమన్వయంతో పని చేస్తున్నారు. ఇక టీటీడీ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి లాంటి భారీ కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్‌కే పరిమితం కాకుండా అన్నిటిలో జోక్యం చేసుకుంటున్నారు. టీటీడీలోనూ లా అండ్ ఆర్డర్ విషయంలో కలెక్టర్ చొరవ చూపిస్తున్నారు. మొత్తం మీద అందరూ తిరుపతి కలెక్టర్ ఓకే అంటుంటే… సొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం మాకొద్దు బాబోయ్… ఈ ఆఫీసర్ అంటూ గగ్గోలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. సార్.. కాస్త వేగం తగ్గించాలి.. ఆకస్మిక తనిఖీలు ఆపాలంటూ కలెక్టరేట్ గోడల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయటా. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మార్కులు పడ్డా…., ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా.. రెవెన్యూ వర్గాల్లో అసహనం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
తాజావార్తలు
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
-
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!