Site icon NTV Telugu

Off The Record: పలాసలో రగులుతున్న పొలిటికల్ కొలిమి

Sklm

Sklm

Off The Record: అల్లుడు ట్యాక్స్‌.. ఈ పన్ను గురించి ఎప్పుడన్నా విన్నారా? మామూలుగా అయితే… వినే అవకాశం ఉండదుగానీ… అక్కడ మాత్రం ఇది చాలా పాపులర్‌. ఆ ట్యాక్స్‌ని వసూలు చేస్తున్నారో లేదో తెలియదుగానీ… ఆ పేరుతో రాజకీయం మాత్రం రయా రంజుగా నడుస్తోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం దాన్నో అస్త్రంగా వాడుతోంది. ఇంతకీ ఏంటా అల్లుడు ట్యాక్స్‌? ఎక్కడ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి?

Read Also: Off The Record: ఢిల్లీ, గల్లీ ఎవ్వరైనా సరే.. డోంట్‌ కేర్‌.. అస్సలు తగ్గేదేలే..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పలాస రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే…. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లా అంతా ప్రశాంతంగా ఉంటే… పలాసలో మాత్రం రాజకీయ కొలిమి రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొలిటికల్‌ సెగలు పెరిగిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటెక్కిస్తున్నారు నేతలు. నాడు స్వయంగా… పవన్ కళ్యాణ్ అన్నారంటూ నేడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న వాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు ఊగిపోతున్నారట. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి ఓ రేంజ్‌లో వసూళ్ళు చేస్తున్నారని, దీన్నే అల్లుడు ట్యాక్స్‌ అంటూ.. ఏ రేంజ్‌లో ఆరోపణలు గుప్తిస్తున్నారు మాజీమంత్రి. 2019 ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ అల్లుడు ట్యాక్స్‌ అంశాన్ని తెర మీదికి తెచ్చారు. మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ అల్లుడైన వెంకన్న చౌదరిని ఉద్దేశించి అప్పట్లో పవన్‌ చేసిన అల్లుడు ట్యాక్స్ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు వైసిపి నేతలు. ఎమ్మెల్యే శిరీష, అమె భర్త.. ఇలాంటి వ్యవహారాలతో తమకు సంబంధం లేదని పైకి అంటున్నా.. లోలోపల సైలెంట్‌గా సొమ్ములు వసూలు చేస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ.

Read Also: Iran – Israel War : లైవ్ లో యాంకర్ న్యూస్ చదువుతుండగా ఇజ్రాయెల్ దాడి..

అయితే, మద్యం సిండికేట్స్‌కు మద్దతివ్వడం, బెల్ట్ షాపులకు పర్మిషన్స్‌ ఇచ్చి అక్కడ ప్రతి బాటిల్ కి పది రూపాయలు అదనంగా వసూలు చేయడం లాంటివి విచ్చలవిడిగా జరిగిపోతున్నాయన్నది సీదిరి వర్గం ఆరోపణ. అలాగే కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద లోకల్ జీఎస్టీ వేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడుతున్నారు సీదిరి. ప్రతి మద్యం బాటిల్ మీద 10 రూపాయలు అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా…? అని ప్రశ్నిస్తున్నారాయన. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే ఆ అదనపు వసూళ్ళకు అడ్డుకట్ట వేయాలంటూ…మాజీ మంత్రి చేసిన సవాల్‌ దుమారం రేపుతోంది. తమకు సంబంధం లేదంటున్న ఎమ్మెల్యే గౌతు శిరీష సీరియస్‌ యాక్షన్‌ తీసుకుని ఒక్కో మద్యం బాటిల్‌ మీద అదనంగా వసూలు చేస్తున్న పది రూపాయలను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసిపి నేతలు. ఇదంతా పైకి చూడ్డానికి బాటిల్‌కు పది రూపాయలుగా కనిపిస్తున్నా… అంతిమంగా చేరాల్సిన వారికి చేరేసరికి లక్షల్లో ఉంటుందన్న చర్చను మొదలుపెట్టింది వైసీపీ.

Read Also: Vijay Devarakonda : నా ప్రతి అవార్డు వాళ్లకే సొంతం.. విజయ్ ఎమోషనల్ పోస్ట్..

ఇక, పలాస నియోజకవర్గంలో మొత్తం 22 మద్యం షాపులు ఉన్నాయి. రోజుకు సగటున మద్యం,బీర్ అంతా కలిపి 30 వేల బాటిళ్లు అమ్ముడవుతాయన్నది ఓ లెక్క. బాటిల్ పై అదనంగా పది రూపాయల ద్వారా నెలకు 90 లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారన్నది ప్రతిపక్షం ఆరోపణ. మద్యంతో పాటు ఇసుక , గ్రావెల్.. అన్నిటి మీద అల్లుడు ట్యాక్స్‌ వేస్తున్నారని, ఈ అదనపు బాదుడు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ లీడర్స్‌. ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. మద్యం మీద అదనపు వసూలు సంగతి ఎమ్మెల్యేకి తెలియకుంటే… తెలియకపోయి ఉండవచ్చుగానీ.. అంతిమంగా చుట్టుకునేది మాత్రం ఆమె మెడకేనని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఈ విషయంలో ఇప్పటికైనా జాగ్రత్త పడకుంటే.. మొదటికే మోసం వస్తుందన్నది పలాస టాక్‌. గతంలో కూడా ఇలాంటి అల్లుడు ట్యాక్స్‌ వ్యవహారమే… గౌతు కుటుంబానికి ఓటమి రుచి చూపించింది.

Exit mobile version