OTR : రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మాటల యుద్ధం ముగిసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధం… మాటల యుద్ధం…..అదీకూడా అలా ఇలా కాదు. ఇద్దరు కీలక నేతల మధ్య ఓ…. రేంజ్ పొలిటికల్ వార్. తరిమి కొడతామని ఒకాయన అంటే….. అలాంటోడు ఇంకా పుట్టలేదంటూ మరొకాయన స్ట్రాంగ్ రియాక్షన్. తెలంగాణ పాలిటిక్స్‌లో కావాల్సినంత పొలిటికల్ హీట్. మరిప్పుడు ఢిల్లీ సాక్షిగా ఆ యుద్ధానికి తెరపడ్డట్టేనా? ఎవరేంటో క్లారిటీ వచ్చిందా? అసలు ఎవరా ముఖ్య నేతలు? ఆ ఎపిసోడ్‌కు సంబంధించి పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ రాజకీయాలకు సంబంధించి హస్తినలో తాజాగా ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం చేసుకున్న రెండు పార్టీల నేతలు కలిశారు. కేంద్ర మంత్రువతో సమావేశమయ్యారు. ఇందులో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే, మరొకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొన్నాళ్ళుగా వీరిద్దరూ పరస్పరం ఫైర్ అవుతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌లను కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని, అలాగే రాష్ట్రం నుంచి ధాన్యం కొనక పోతే సెంట్రల్ మినిస్టర్ ఇంటి ముందు తీసుకొచ్చి బస్తాలు పడేస్తామని అసలు కేంద్ర మంత్రిని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్టేట్‌కు అప్పు రాకుండా అడ్డుకున్నారని, వెంటనే కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్‌తో అపాయింట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు సీఎం. అదే ఊపులో కాస్త పరుష పదజాలాన్ని కూడా ఉపయోగించారు. అలాగే అపాయింట్మెంట్ కోసం బహిరంగ లేఖ కూడా రాశారాయన. ఈ క్రమంలో… ముఖ్యమంత్రికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ నుంచి నన్ను తరిమి కొట్టే వాడు ఇంకా పుట్టలేదంటూ బదులిచ్చారు.
అసలు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే అడ్డు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారాయన. రాష్ట్రానికి నిధులు రాకుండా, అప్పు పుట్టకుండా నేను ఎక్కడ అడ్డుకున్నానో నిరూపించాలంటూ సీఎంకు సవాల్ చేశారు. ఆ రకంగా ఇద్దరి మధ్య పంచాయితీ గట్టిగానే నడిచింది. దీంతో అసలు వీళ్లిద్దరి మధ్య మాటలు ఈ స్థాయిలో మాటలు ఎందుకు పేలుతున్నాయి? ఎక్కడ తేడా కొట్టిందంటూ రకరకాల చర్చలు జరిగాయి. ఎవరికి తోచిన సమాధానాలు వాళ్ళు చెప్పేసుకున్నారు కూడా. ఆ వ్యవహారం అలా నడుస్తుండగానే… సడన్‌గా సీన్ మారిపోయింది. ఇద్దరు ముఖ్యులు ఢిల్లీలో కలిశారు. ఏ కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ అయితే ఇప్పించమని సీఎం రేవంత్ కిషన్‌రెడ్డిని అడిగారో…. అదే మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. కలిసి మాట్లాడి సానుకూల స్పందన వచ్చిందని కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డి అడుగారు…. నేను అపాయింట్మెంట్ ఇప్పించాను అంటూ…X లో పోస్ట్ చేశారు కిషన్. దీంతో… ఈ ఇద్దరి నేతల మధ్య పంచాయితీ ఇక ముగిసినట్టేనా… ఇకపై రేవంత్ రెడ్డ్ … కిషన్ రెడ్డిని టార్గెట్ చేయరా…? అంటూ చర్చలు మొదలయ్యాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన ఎపిసోడ్ పై రెండు పార్టీల్లో విస్తృత చర్చలే జరుగుతున్నాయి. ఇందులో ఎవరిది పైచేయి అంటూ రకరకాలుగా విశ్లేషిస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు. అవి రాజకీయ కారణాలా? మరొకటా అన్న సంగతి అలా ఉంచితే….. మాటల మంటలు ఇకనైనా చల్లబడతాయా లేక మరో రూపంలో మళ్ళీ రేగుతాయా అన్నది ప్రస్తుతానికి ఉన్న పొలిటికల్ డౌట్.
Also Read
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!