Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Ramachandrapuram Constituency

Off The Record : ఆ నియోజకవర్గంలో కూటమి, వైసీపీ నేతలు కలగలసి యుగళగీతం పాడుకుంటున్నారా..?

Published Date :November 14, 2025 , 8:05 pm
By Gogikar Sai Krishna
  • జిల్లాల పునర్విభజనలో రామచంద్రపురానికి అన్యాయం?
  • ప్రజాభిప్రాయం ఒకరకంగా, నాయకుల ఆలోచన మరో రకంగా
  • అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం
  • కాకినాడకు దగ్గరగా రామచంద్రపురం అసెంబ్లీ సెగ్మెంట్‌
Off The Record : ఆ నియోజకవర్గంలో కూటమి, వైసీపీ నేతలు కలగలసి యుగళగీతం పాడుకుంటున్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ నియోజకవర్గంలో…కూటమి, వైసీపీ నేతలు కలగలిసి యుగళ గీతం పాడుతున్నారా? ప్రజలంతా ఒకవైపు, అన్ని పార్టీల నాయకులు మాత్రం మరో వైపు అన్నట్టుగా ఉందా? ఏ విషయంలో జనాన్ని కాదని పార్టీలకు అతీతంగా నాయకులు పిల్లి మొగ్గలేస్తున్నారు? ఎక్కడ ఉందా పరిస్థితి? కర్రుగాల్చి వాత పెట్టడానికి అక్కడి జనం కూడా ఎదురు చూస్తున్నారన్నది నిజమేనా? జిల్లాల పునర్విభజనలో భాగంగా… ఉమ్మడి తూర్పు గోదావరిని మూడుగా విభజించింది గత వైసీపీ ప్రభుత్వం. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన ఆ విభజనతో…అప్పటిదాకా ఉమ్మడి తూర్పులో ఉన్న రంపచోడవరం అల్లూరి జిల్లాలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో కొత్త వివాదాలు కూడా పుట్టుకొచ్చాయి. దాంతో… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగిన మార్పులను రివ్యూ చేయాలని నిర్ణయించి అందుకోసం మంత్రుల కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వివాదాలను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది సర్కార్‌. ఆ క్రమంలోనే… రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం వివాదం మాత్రం ఎటూ తేలకుండా ఉందట. ఇక్కడ ప్రజలు ఒకటి కోరుకుంటుంటే….నాయకులు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారు. ఆ విషయంలో కూటమి, వైసీపీ అన్న తేడా లేకుండా… నాయకులంతా ఒక్కటై బృందగానం ఆలపిస్తున్నారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు అప్పుడు. అయితే… అదే నియోజకవర్గంలోని రామచంద్రపురం అసెంబ్లీ సెగ్మెంట్‌ మాత్రం కాకినాడకు దగ్గరగా ఉంటుంది.

అందుకే… తమను కోనసీమ జిల్లా నుంచి విడదీసి కాకినాడ జిల్లాలో కలపాలని జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నారు స్థానికులు. బంద్‌లతో నిరసనలు తెలుపుతూ తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోరుతున్నారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే… రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రాపురం, కే. గంగవరం మండలాలు కోనసీమ జిల్లాలో ఉంటే కాజులూరు మండలం మాత్రం ఆల్రెడీ కాకినాడ జిల్లాలోనే ఉంది. మమ్మల్ని దగ్గరగా ఉన్న కాకినాడ జిల్లాలో కలపండి మొర్రో… అని ప్రజలంతా ఏక స్వరంతో మొత్తుకుంటున్నా… ఏ పార్టీ నాయకుడూ కిక్కురుమనడం లేదు. మామూలుగా ప్రతి విషయంలోనూ… విభేదించుకుని, మంచి చెడులతో సంబంధం లేకుండా తిట్టుకునే అధికార, ప్రతిపక్ష నాయకులంతా ఈ విషయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారట. రామచంద్రపురం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన పిల్లి సుభాష్‌చంద్రబోస్, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణుగోపాల్‌, సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్‌ మంత్రి సుభాష్ సైతం ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదన్నట్టుగా ఉండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రామచంద్రపురం జనం. మీకు మీ రాజకీయ అవసరాలు తప్ప… జనం సమస్యలు పట్టవా అంటూ నిలదీస్తున్నారు. బోస్ ప్రస్తుతం ఎంపీగా, ఆయన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. అటు మాజీ మంత్రి వేణు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్స్‌తో వాళ్లు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ ముగ్గురూ రామచంద్రపురంలోనే ఉంటున్నారు. ఈసారి పరిస్థితులు ఎలా మారుతాయో,ఎవరు ఎక్కడ పోటీ చేస్తారోననుకుంటూ…ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపడానికి మాత్రం వైసీపీ నాయకులు ఎవరూ ఇష్టపడటం లేదట.

కాకినాడ జిల్లాలోకి వెళ్తే… పార్టీలో కూడా ఆ జిల్లా సీనియర్‌ నేతల హవా నడుస్తుందని, తాము నామ మాత్రంగా మిగిలిపోతామన్నది వాళ్ల భయంగా తెలుస్తోంది. అందుకే ఆ ప్రస్తావన తీసుకు రాకపోవడంతోపాటు మీరు కూడా మాట్లాడవద్దని సన్నిహితులకు చెబుతున్నట్టు సమాచారం. ప్రతిపక్షం సంగతి సరే…ఇటు మంత్రి సుభాష్ దగ్గరకు జే ఏ సి నేతలు వెళ్తే… ఆయన కూడా పొడిపొడిగా సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దల స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి, అందులో మనం చేసేది ఏముంటుందని అంటున్నారట. ఆ ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా అంటే మాత్రం నో ఆన్సర్‌. మంత్రి స్థాయిలో కాస్త చొరవ చూపి గట్టిగా పట్టుబడితే… పనైపోతుందని, కానీ… ఆయన కూడా పొలిటికల్‌ లెక్కలేసుకుంటూ ఉదాసీనంగా ఉంటున్నారన్నది లోకల్‌ టాక్‌. సుభాష్ సొంత నియోజకవర్గం అమలాపురం. అది ఎస్సీ రిజర్వుడు కావడంతో గత ఎన్నికల్లో ఆయన రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మళ్లీ పరిణామాలు మారి వేరే జిల్లాలోకి వెళ్తే అక్కడ నా పరపతి ఏం ఉంటుందన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఆ విధంగా… తమ రాజకీయ అవసరాల కోణంలో రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో కలపడానికి ఇటు కూటమి, అటు వైసీపీ నాయకులు ఎవరూ సుముఖంగా లేరు. దీంతో రగిలిపోతున్న నియోజకవర్గ జనం మాత్రం మీ సంగతి… అలా ఉందా? అయితే వెయిట్‌ చేయండి రేపు స్థానిక సంస్థల ఎన్నికల రాకపోతాయా? మళ్ళీ మా దగ్గరికి రాకుండా ఉంటారా అని అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • OTR
  • ramachandrapuram constituency

తాజావార్తలు

  • Virat Kohli-RCB: ఆర్సీబీ అసలు మాస్టర్‌మైండ్ కోహ్లీనే.. పాకిస్థాన్ మాజీల ప్రశంసలు!

  • Adivi Sesh : స్టార్‌ డైరెక్టర్స్‌ స్టార్స్‌ను మాత్రమే డైరెక్ట్‌ చేస్తారా?

  • Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Accounts Closed: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఆ ఖాతాలన్నీ క్లోజ్..

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions