Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?
- మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్న ప్రేమ్‌సాగర్‌రావు
- ఫస్ట్‌టైం సామాజిక సమీకరణల అడ్డు
- విస్తరణలో జిల్లా నుంచి ప్రేమ్‌కు బదులు వివేక్‌కు ఛాన్స్
- నాకు కేబినెట్ బెర్త్ కావాలిగానీ, ర్యాంక్ ఎందుకన్న ప్రేమ్‌సాగర్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ సాగరంలో అగ్నిగుండం రగులుతోందా? అది ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదా? ఎవరు ఏం చెప్పినా… డోంట్ కేర్, నేను కోరుకున్నది దక్కాల్సిందేనన్నట్టుగా వ్యవహారం మారిపోతోందా? ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్లాస్ట్ అయిపోతారా? ఎవరా నాయకుడు? ఏంటా అగ్నిగుండం? కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కమ్ మంచిర్యాల ఎమ్మెల్యే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ వెంటే ఉన్నారాయన. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు కచ్చితంగా కేబినెట్ బెర్త్ దక్కుతుందని అనుకున్నారు. కానీ… సామాజిక సమీకరణల కారణంగా ఆయనకు ఛాన్స్ మిస్ అయింది. అదే సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావును పాలమూరు జిల్లా నుంచి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. దాంతో…మొదట్లో ఆదిలాబాద్ జిల్లాకు అసలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. విస్తరణలో కచ్చితంగా తమకు అవకాశం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రేమ్ సాగర్ రావు. కానీ అప్పుడు వివేక్‌కు అవకాశం ఇవ్వడంతో మరింత అసంతృప్తి కి గురయ్యారు మంచిర్యాల ఎమ్మెల్యే. మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారిని కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎలా పదవులు ఇస్తారంటూ తన నిరసనను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారాయన.
అందుకే ఆయనకు క్యాబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. కానీ… ఆయన కోరుకున్నది క్యాబినెట్‌లో ఉండటంకానీ… ఆ ర్యాంక్‌లో ఉండటం కాదు. అందుకే… తన అసంతృప్తిని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సమక్షంలోనే వినిపించాలని డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగానే జిల్లా పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడి ముందే ప్రేమ్‌సాగర్ తన మనసులో మాటను చెప్పేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ రాదని అనుకుంటే ఈ పార్టీలో ఉండబోరంటూ ఓపెన్‌గానే కామెంట్ చేశారు. తన మనసులో ఉన్న మాటలను కార్యకర్తల ముందే పార్టీ చీఫ్‌కి చేరేలా అన్నారాయన.
Also Read
రెండు మూడు పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తే మొదటి నుంచి పనిచేస్తున్న నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనతోపాటు… కాంగ్రెస్ కార్యకర్తను కూడా కలుపుకొని పార్టీ కోసం జెండా మోసిన వాళ్లను గుర్తించి పదవులు ఇవ్వాల్సిందేనని క్లారిటీగా అన్నారు ఎమ్మెల్యే. అధికారంలో ఉన్నా లేకున్నా వెంట ఉండేది కార్యకర్తలేనని, వాళ్లను జాగ్రత్తగా చూసుకోకపోతే పార్టీకి నష్టం అంటూ డైరెక్ట్ గానే అన్నారు. ఆ విధంగా తన మనసులో మాటను కార్యకర్తల ముందే పార్టీ నాయకత్వానికి చేరవేసినట్టయింది. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు అవకాశం వస్తుందని ఎన్నో ఆశలతో ఉన్న ప్రేమ్ సాగర్ రావులో నిరాశ పెరిగిపోవడంతో… తన అసంతృప్తిని అలా బయటకు చెప్పేశారట. పార్టీలో కొందరు నాయకులు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండేట్టు లేదని అంటున్నారు. తను ఆశించింది ఒకటి.. దక్కింది ఇంకొకటి అన్న ఆవేదనలో ఉన్నారట ప్రేమ్‌సాగర్ రావు. మరి ఆయన ఆవేదనకి పులిస్టాప్ పడుతుందా..? లేక అలాగే కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి.
- Tags
- congress
- NTV Telugu
- OTR
- Prem Sagar
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!