అక్కడ పెద్దాయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయా? ఈయన్ని ఇరకాటంలో నెట్టేందుకే అలా అన్నారా..? లేదంటే మరేదైనా వ్యూహం ఉందా..? మేరే సే జోడో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు ఒక్కొక్కరు… ఒక్కో రకమైన అభిప్రాయానికి ఫిక్స్ అయ్యారు. ఇంతకీ మోదీ… ఏ విషయం లో కలిసి రమ్మన్నారు అనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది. అధికార, విపక్షాలు ఎవరికి అనుకూలంగా వారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఐతే…సీఎం రేవంత్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కొంత ఇరకాటంలోకి నెట్టేలా ఉన్నాయనే టాక్ కూడా పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయంగా కనపడుతోంది. సీఎం రేవంత్ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కళ్లకు ఏ రంగు అద్దాలు పెట్టుకుంటే… వాళ్లకు ఆ రంగు కనపడుతుంది అని చెప్తూనే… గత ప్రభుత్వం పదేళ్లలో కేంద్రం నుంచి కనీస సహకారం కోరలేదని.. ప్రేమ ఉంటే చాలు అని మోడీ చెప్పిన అంశాలు గుర్తు చేశారు. తాను అలా కాదు అంటూనే… జరిగిన ఎపిసోడ్ పై క్లారిటీ ఇచ్చారు. హెచ్‌ఐసీసీ లో జరిగిన మీటింగ్ కేవలం అధికారిక కార్యక్రమం.. అందులో రాష్ట్ర భావృద్ధికి సంధించిన అంశంలోనే కలసి రావాలని మోడీ చెప్పారు తప్పితే… రాజకీయంగా కాదనే క్లారిటీ ఇచ్చారు. 2047 నాటికి త్రీ ట్రిలియన్ కి చేర్చాలన్న అజెండా రీచ్ అవ్వాలంటే….కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్న ఉద్దేశమే తప్ప…మరొకటి కాదని రేవంత్ చెప్పారు. మొదటి నుంచి కేంద్రం నుంచి తాను కోరుతున్న సహకారం కూడా అంతే కదా..? అని స్పష్టం చేశారు. మోడీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు…అందులోనూ BRS చేస్తున్న ప్రచారానికి సీఎం చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. రాజకీయాలు వేరు…ప్రభుత్వాలుగా కలిసి పని చేయడం వేరు అనే చర్చ తెచ్చారు రేవంత్. మొత్తానికి మోడీ చేసిన వ్యాఖ్యల తలనొప్పి నుంచి సీఎం రేవంత్ బయటపడే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది.
