Off The Record : తుంగతుర్తి హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తుంగతుర్తి హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరాయా. ఆధిపత్యపోరులో నిలబడేందుకు సొంత పార్టీ క్యాడర్ నే నేతలు పావులుగా మార్చుకుంటున్నారా. వివాదాలు, విభేదాలను పరిష్కరించాల్సిన ముఖ్య నేతలే వివాదాలకు ఎందుకు కేంద్రంగా మారుతున్నారు.. తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా పోట్లాటకు దిగుతున్నారు. తాజాగా మోత్కూర్ మున్సిపాలిటీలో సొంత పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కౌన్సిల్ లో గళం వినిపించడంతో ప్రచ్చన్నయుద్ధం కాస్తా ప్రత్యక్ష యుద్దమైంది. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం… ప్రతిపాదిత పనుల రద్దు కోరుతూ తీర్మానం చేయడం తుంగతుర్తి కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మున్సిపాలిటి తొలి సమావేశంలోనే ఎమ్మెల్యే మందుల సామేల్ కు వ్యతిరేకంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మినహా మిగిలిన అందరూ గొంతు కలపడం చర్చనీయాంశంగా మారింది. మరో అడుగు ముందుకేసిన కొందరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్ లతో జతకట్టి మరీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరించడం తుంగతుర్తి హస్తం పార్టీలో కలకం రేపుతోంది.
నియోజకవర్గంలో తిరుమలగిరి, మోత్కూర్ రెండు మున్సిపాలిటీలు ఉండగా… తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది. స్పష్టమైన మెజారీటితో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.. తిరుమలగిరి మున్సిపాలిటి దక్కకపోవడానికి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ తో అక్కడి కాంగ్రెస్ నేతలకు ఉన్న గ్యాప్ ప్రధాన కారణం అనే అభిప్రాయం ఉంది. ఇక గెలిచిన ఏకైక మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య భిన్నాభిప్రాయాలు భగ్గుమన్నాయి. దంతో చైర్మన్ ఎంపికను ఎమ్మెల్యేకే వదిలేసారట ఎంపీ.
Also Read
ఇక తాజాగా జరిగిన మెత్కూర్ మున్సిపాలిటి బడ్జెట్ మీటింగ్ లో మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రతిపాదించి, శంకుస్థాపలు జరిగిన 15 కోట్ల పనుల ఆమోదానికి తీర్మానం ప్రతిపాదించగా.. హస్తం పార్టీ నేతలే ఆ తీర్మానాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకీ చెందిన 8 మంది కౌన్సిలర్ లలో ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన వారంతా తీర్మానానికి నో చెప్పడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు టెండర్ రీకాల్ చేయాలని పట్టుబట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగబాటు వెనక సొంత పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉంది అనేది ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయుల వర్షన్.. మోత్కూర్ మున్సిపాలిటి పై తమ ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు యత్నిస్తుండటంతో ఈ పరిస్దితి వచ్చింది అంటున్నారు.
మోత్కూర్ మున్సిపాలిటిపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్న ఎంపీ చామల….నియోజకర్గంలో తన వ్యూహాల అమలుకు మున్సిపల్ రిజర్వేషన్ లు వర్కౌట్ కాలేదట. దీంతో గెలిచిన వారే తమ వారు అనుకున్న ఎంపీ కౌన్సిలర్లతో తన వ్యూహాలు అమలు చేసారని టాక్. ఆ మధ్య ఓ కాంట్రాక్టు వర్క్ ను ఎమ్మెల్యే రద్దు చేయించారట. తాజాగా ఎమ్మెల్యే చేయిస్తున్న పనులను యంపీ తన మద్దతుఉన్న కౌన్సిలర్ ల చేత అడ్డుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో భాగమే మోత్కూర్ మున్సిపాలిటిలో కాంగ్రెస్ కౌన్సిలర్ ల ఎమ్మెల్యే వ్యతిరేక తీర్మానం అనుకుంటున్నారు ఎమ్మెల్యే వర్గీయుులు. ఇలా ఎమ్మెల్యే, ఎంపీల మధ్య విభేదాలు, అంతర్గత కలహాలు, ఆదిపత్యపోరు, ఎత్తులకు పై ఎత్తులతో తుంగతుర్తి రాజకీయం రంజుగా.. మూడు గ్రూపులు, ఆరు వివాదాలు అన్నట్లుగా మారిందంటున్నారు హస్తం పార్టీ నేతలు.
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!