Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Janasena 12

Off The Record : పార్టీ ఇచ్చిన టార్గెట్ ను ఆ జనసేన నేతలను లైట్ తీసుకున్నారా..?

Published Date :March 28, 2026 , 8:49 pm
By Gogikar Sai Krishna
  • సభ్యత్వ నమోదులో వెనుకబడ్డ ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు
  • తిరుపతిలో పార్టీ ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు
  • నిరుటికంటే తగ్గిన సభ్యత్వ నమోదు
  • తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో లక్ష్యం 85వేలు, చేసింది 35 వేలు
Off The Record : పార్టీ ఇచ్చిన టార్గెట్ ను ఆ జనసేన నేతలను లైట్ తీసుకున్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ ఉమ్మడి జిల్లాలో జనసేన నేతలు కాస్త తేడాగా ఉన్నారా? పార్టీ అధిష్టానం ఇచ్చిన టార్గెట్‌ను బాగా లైట్‌ తీసుకున్నారా? పనితీరు నిరుటికంటే దారుణంగా పడిపోయిందా? అధిష్టానం ఫైరైనా….. దులిపేసుకుని పోవడం అలవాటు చేసుకున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అధినాయకత్వం వాళ్ళకు ఇచ్చిన టాస్క్‌ ఏంటి? ఫెయిలవడానికి స్థానిక నాయకులు చెబుతున్న కారణాలేంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పరిస్థితి విచిత్రంగా ఉందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. జిల్లా నేతల పేర్లు రాష్ట్ర స్థాయిలో మోగిపోతున్నా…. సభ్యత్వ నమోదు మాత్రం చతికిలపడుతోందని ఇటు కేడర్‌, అటు లీడర్స్‌లో చర్చ నడుస్తోంది.. గత ఎన్నికల్లో తిరుపతి నియోజవర్గం నుండి పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు ఆరిణి శ్రీనివాసులు. ఇక అప్పటి నుంచి జిల్లాలో జనసేన పరిస్థితి మారిపోతుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే నిరుడు సభ్యత్వ నమోదులో జోష్‌ కనిపించింది. ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తారని భావించిన పార్టీ పెద్దలకు జిల్లా నేతలు షాకిచ్చారట. లక్ష్యానికి దరిదాపుల్లో కూడా లేరంటూ పార్టీ పెద్దలు ఫైర్‌ అయినట్టు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జనసేన సభ్యత్వ నమోదు లక్ష్యం 85 వేలు అయితే వారం క్రితం వరకు 35 వేలు కూడా అవలేదట. దీంతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్‌ పెట్టి జిల్లా లీడర్స్‌కు తలంటేసినట్టు తెలిసింది. అధిష్టానం ఆదేశాల ప్రకారం గడువులోగా టార్గెట్‌ రీచ్‌ అవ్వాల్సిందేనని హెచ్చరించినట్టు తెలిసింది. ఈనెల 1న పార్టీ ముఖ్య నేత, మంత్రి మనోహర్ స్వయంగా తిరుపతి వచ్చి పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభ్యత్వ నమోదు లక్ష్యాలను నిర్దేశించారు. అయినా తిరుపతి మినహా మరెక్కడా లక్ష్యాన్ని చేరుకోకపోగా…. గతంతో పోలిస్తే తక్కువ అని చెబుతున్నారు సీనియర్‌ నేతలు.

అందుకే తాజా టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి మనోహర్‌ జిల్లా నేతలకు సీరియస్‌గానే క్లాస్‌ పీకినట్టు తెలిసింది. పార్టీ అధికారంలో వుండడం, పలువురికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన క్రమంలో అంతా ఏం చేస్తున్నారంటూ పార్టీ పెద్ద సీరియస్‌ అయినట్టు సమాచారం. అధినాయకత్వపు అంచనాలు తల్లకిందులవడంపైనే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జనసేనలో చర్చ జరుగుతోంది. తిరుపతిలో పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఏపీ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు.అలాగే పార్టీ నేత కొట్టే సాయి ప్రసాద్‌ శ్రీకాళహస్తీశ్వర ఆలయయ ట్రస్టు బోర్డు చైర్మన్ పోస్ట్‌లో ఉన్నారు. అయినాసరే…. సభ్యత్వ నమోదు పరిస్థితి దారుణంగా ఉందంటూ అధిష్టానం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సూళ్ళూరుపేటలో పార్టీ ఇంచార్జి ప్రవీణకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. అక్కడా అదే పరిస్థితి ఆట.

మిగిలిన సెగ్మెంట్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. తిరుపతికి ఎమ్మెల్యే, సూళ్ళూరుపేటకు ఇన్ఛార్జ్‌ తప్ప…. మిగతా సెగ్మెంట్లకు ఆ బాధ్యులు కూడా లేరు. రాష్ట్ర స్థాయి నేతగా రోజుకో ప్రెస్ మీట్‌తో హడావిడి చేసే కిరణ్ రాయల్ సైతం అంతవరకే పరిమితం అయ్యారు తప్ప సభ్యత్వ నమోదుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదని అంటున్నారు. కేవలం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌ పేరిట నాయకులు పార్టీ ఉనికి కాపాడుతున్నారు తప్ప… బలం పెంచుకునే ప్రయత్నం చేయడం లేదన్నది జనసేన అధిష్టానం అభిప్రాయం. అయితే జిల్లాలోని పలువురు నేతలు ఆసక్తి చూపకపోవడానికి పదవులు రాకపోవడమే కారణమన్న చర్చ సైతం ఉంది. చాలామంది నాయకులు పదేళ్లకు పైగా…. ఇంకా చెప్పాలంటే ప్రజారాజ్యం టైం నుంచి గట్టిగా కష్టపడ్డారు. పార్టీ వ్యవహారాల యాంగిల్‌లో కొందరి మీద పాతిక దాకా కేసులు ఉన్నాయి. అయినా సరే… పెద్దలు గుర్తించకుండా, పదవులేవీ ఇవ్వకుంటే మాకు మాత్రం ఆసక్తి ఏముంటుందన్నది వాళ్ళ మాట. ఈ పరిస్థితుల్లో… జిల్లా నాయకులు సభ్యత్వ నమోదు టార్గెట్‌ను ఎంత వరకు రీచ్‌ అవుతారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • janasena
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

  • Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..

  • Trump: ‘నా కాళ్లకు నమస్కరిస్తాడని అనుకోలేదు’.. సౌదీ యువరాజుపై బాంబ్ పేల్చిన ట్రంప్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions