OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!

Golla

Golla

ఎంత అనుభవం నాది….. ఎంత టాలెంట్‌ ఉంది నాకు….. అయినా…. ఏం ప్రయోజనం…… వాడుకోవడం లేదు. వాళ్ళకు అస్సలు వాడకం తెలియడం లేదంటూ ఆ రాజ్యసభ ఎంపీ తెగ ఫీలైపోతున్నారట. పొలిటికల్‌ లైఫ్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానుగానీ… ఇలాంటి బ్యాక్‌ బెంచ్‌ ట్రీట్‌మెంట్‌ని మాత్రం ఎప్పుడూ చూడలేదంటూ వైసీపీ పెద్దల మీద బాగా ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారట. ఎవరా రాజ్యసభ సభ్యుడు? ఆయన హిట్‌ మీ హార్డ్ అంటుంటే… వైసీపీ అధిష్టానం ఆన్సర్‌ ఏంటి?

ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో అత్యంత అదృష్టవంతుడిగా ముద్రపడ్డ నేత గొల్ల బాబూరావు. తంతే…. బూరెల బుట్టలో పడ్డాడన్నది సామెతగానీ…. ఈయనైతే ఏకంగా పాయసం పాత్రలోనే పడ్డారంటూ సెటైర్స్‌ వేసే వాళ్లు సైతం లేకపోలేదు. గ్రూప్ వన్ అధికారి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గొల్ల… 2009 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి గెలిచారు. వైఎస్‌ కుటుంబానికి సన్నిహితుడునే గుర్తింపు ఉంది. ఇక 2012లో వైసీపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి సిట్టింగ్ సీటు నిలబెట్టుకున్నారాయన. 2014-19 మధ్య ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత రాజకీయ ప్రత్యర్థి కాగా… ఢీ అంటే ఢీ అనేవారు. 2019లో మూడోసారి పాయకరావుపేట ఓటర్లు పట్టం కట్టగా అమాత్య యోగం ఆశించినా ఫలించలేకపోయింది. ఈ క్రమంలో నియోజకవర్గ అంతర్గత రాజకీయాలు పతాకస్థాయికి చేరిపోగా….బాబూరావు వ్యతిరేక వర్గం పైచేయి సాధించింది. గత ఎన్నికల్లో మరోసారి టిక్కెట్ ఆశించినప్పటికీ అవకాశం లభించలేదు. పొరుగు జిల్లాకు చెందిన సీనియర్ నేత జోగులుకు సీటుతో పాటు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది వైసీపీ హైకమాండ్. 24లో ఇక్కడ వైసీపీ ఓడిపోగా…జోగులుపై గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాష్ట్రానికి హోం మంత్రి అయ్యారు. దీంతో బాబూరావు రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు పెరిగాయి. సరిగ్గా అదే సమంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది వైసీపీ అధిష్టానం. పార్టీకి ఆయన చేసిన సేవలకు అది గుర్తింపు అని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక్కడి వరకు ఎవ్రిథింగ్ హ్యాపీ కానీ… ఆ తర్వాతి పరిణామాలు చూస్తుంటే ఎంపీకి ఎక్కడో డౌట్ కొడుతోందట. 16 ఏళ్లకు పైబడ్డ రాజకీయ అనుభవంలో ఎన్నో ఎత్తు..పల్లాలు చూసిన నేతలు ఇప్పుడు అస్సలు మనసు కుదుటపడంట లేదట.

వాడుకోండి…. నన్ను గట్టిగా వాడండి…. పార్టీ కోసం నా అనుభవం మొత్తాన్ని రంగరించి మిక్సీలో వేసి మిక్స్‌ చేసి మరీ…. ఇస్తానన్నా ఎవ్వరూ స్పందించడం లేదట. దాంతో… నేను ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా… పెద్దలెవరూ ఎందుకు స్పందించడం లేదు? నా అనుభవం మొత్తం అడవిగాచిన వెన్నెలేనా అంటూ బాగా ఫీలైపోతున్నట్టు సమాచారం. తన వర్క్‌ స్టైల్‌ ఏంటో చూపంచేందుకు ఆసక్తిగా ఉన్నా వాడుకోకపోవడంపై ఆయనకు ఫ్రస్ట్రేషన్‌ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. చెప్పుకోదగ్గ పదవి ఉన్నా..పార్టీ మీటింగ్‌ల కోసం కూడా…. ప్రత్యేక ఆహ్వానం లేదంటూ అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా… హోదా ప్రకారం ప్రోటోకాల్‌ ఇచ్చి ప్రభుత్వ అధికారులు గౌరవ మర్యాదలు పాటిస్తున్నా…. పార్టీ పరంగా మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ బాగా బాధ పడిపోతున్నారట ఎంపీ. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలన్న టార్గెట్‌తో కీలక సమావేశాలు, నిరసనలు, సభలు నిర్వహిస్తున్నా… తనకు మాత్రం కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదన్న ఫీలింగ్‌ ఆయనలో ఎక్కువైపోతోందని అంటున్నారు. ఇటీవల పార్టీ ఆఫీస్‌లో జరిగిన మీటింగ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించి మైక్ మాత్రం ఆఖరులో ఇచ్చారట. బాబూరావు దాన్ని అవమానంగా ఫీలైనట్టు తెలిసింది. అప్పటికీ ఆపుకోలేక ఎందుకిలా చేస్తున్నారని అక్కడున్నవాళ్లని అడిగితే… సార్‌…. మీరే మా చీఫ్ గెస్ట్. చివరాఖరులో మాట్లాడుదురుగానీ అంటూ…. ఆయన్ని పక్కనబెట్టి మిగతా వాళ్ళు మొత్తం ప్రసంగాలు దంచి కొట్టేశారట. అది అవమానమో, ప్రాధాన్యమో అర్ధంగాక, అప్పుడు తానేం చేయాలో తెలియక ఎంపీగారి ఉక్రోషం నషాళానికి ఎక్కేసిందని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా సరే… కనీస ప్రాధాన్యం లేకపోవడం..పార్టీ తరుఫున తన వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా చేయడం వెనుక ఏదో కుట్ర ఉందన్నది గొల్ల అనుమానంగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆయనలో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరిందని చెబుతున్నారు. జిల్లాలో తనకు జరుగుతున్న అవమానాల గురించి పార్టీ అధినాయత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేందుకు ఎంపీ సిద్ధం అవుతున్నారట. అయితే అదే సమయంలో…. పార్టీ అధిష్టానం ఆలోచన భిన్నంగా ఉన్నట్టు సమాచారం. తొందరెందుకు సార్‌…… కాస్త వెయిట్ చేయండి….. వాడతాం…. మిమ్మల్ని కచ్చితంగా వాడతాం…… ఆ టైమ్‌ వచ్చినప్పుడు అసలు మా వాడకమంటే ఎలా ఉంటుందో చూపిస్తామని కూల్‌గా చెబుతున్నారట వైసీపీ పెద్దలు కొందరు. కానీ…. బాబూరావు మాత్రం అప్పటిదాకా నేను ఆగలేను బాబూ…. నావల్ల కాదంటూ సంకేతాలు పంపుతున్నారట. ఈ క్రమంలో వైసీపీ పెద్దల వాడకం ఎలా ఉంటుంది? అస్సలు నిజంగా అది మొదలైతే బాబూరావు తట్టుకోగలగా అంటూ ఉమ్మడి విశాఖ వైసీపీలోనే సెటైర్స్‌ పడుతున్నాయి.