OTR : గద్వాల గులాబీ తోటకు డ్రైవర్ కరువా? ఇంచార్జ్‌పై BRS ఎందుకు సైలెంట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటుంది. 2018, 2023 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపారు గద్వాల ఓటర్లు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, మారిన రాజకీయ పరిణామాలతో… అభివృద్ధి అజెండాతో గెలిచిన ఆర్నెల్ల తర్వాత అధికార కాంగ్రెస్‌తో జతకట్టారు ఎమ్మెల్యే. దీంతో ఇక్కడ కారు పార్టీకి నాయకత్వ సమస్య వచ్చింది. బీఆర్ఎస్ క్యాడర్ చెల్లా చెదురుకాగా…. కొందరు ఎమ్మెల్యేతో పాటు పార్టీ వీడిపోయారు. మరికొందరు గులాబీ జెండాతోనే కొనసాగుతున్నా యాక్టివిటీ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో… గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి కట్టబెట్టాలన్న విషయంలో గులాబీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారట. నియోజకవర్గంపై పూర్తి స్థాయి పట్టుతోపాటు ఆ స్ట్రేచర్ ఉన్న లీడర్ కోసం గట్టిగా అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి బాసు హనుమంతునాయుడు లోకల్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కానీ…. అధిష్టానం ఆయన్ని ఇన్‌ఛార్జ్‌గా అధికారికంగా ప్రకటించక పోవడంపై గద్వాల గులాబీ శిబిరంలో రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో కుర్వ విజయ్, ఆంజనేయులు గౌడ్ ఈ పోస్ట్ కోసం సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కించుకుని, ఆ తరువాత ఎమ్మెల్యే టిక్కెట్ రేస్‌లోకి రావాలన్నది వాళ్ళ ప్లాన్ అట. అందుకోసం జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు , కేటీఆర్ స్థాయిలో లాబీయింగ్
చేస్తున్నట్టు సమాచారం.
Also Read
ఇదిలా ఉంటే… గద్వాలలో తమకు ముందు ముందు మంచి రోజులే ఉన్నాయని గట్టిగా నమ్ముతోందట గులాబీ దళం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా హస్తం పార్టీ గాలి వీచినా, గద్వాలలో మాత్రం రెండోసారి పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించారంటూ గుర్తు చేస్తున్నారు. పార్టీకి ఉన్న బలమైన కేడరే అందుకు కారణం అంటున్నారు. మరో పక్క మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో గెలుచుకున్న కౌన్సిలర్ స్థానాలు కారు పార్టీ బలానికి నిదర్శనమని, క్షేత్ర స్థాయిలో హార్డ్‌కోర్ క్యాడర్ అలాగే ఉందని అంటున్నారు పార్టీ లోకల్ లీడర్స్. ఇక ఇదే సమయంలో… గద్వాలకు ఇంచార్జ్‌ని ప్రకటించడంలో…. బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాత్మక జాప్యం చేస్తోందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. కారు దిగి కాంగ్రెస్‌లో చేరిపోయిన ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డో, లేక మాజీ జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్యనో తిరిగి బీఆర్ఎస్లో చేరుతారన్న లెక్కలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాంటి పరిణామాలే జరిగితే… గద్వాల కారు టాప్ గేర్‌లో దూసుకు పోవడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి…. నియోజకవర్గ ఇన్ఛార్జ్ని ప్రకటించకుండా నెట్టుకొస్తున్నారని లెక్కలేస్తున్నారు. మొత్తం మీద గద్వాల కారుకు రిపేర్లు చేసి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేలా మంచి డ్రైవర్‌ను సెట్ చేయాలంటోంది నడిగడ్డ గులాబీ కేడర్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..