Off The Record : గద్వాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పోటీ
- నడిగడ్డ ఆధిపత్యపోరులో సరికొత్త ట్విస్ట్
- కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీలో ఎమ్మెల్యే బండ్ల
- కృష్ణమోహన్‌రెడ్డి, సరిత మధ్య తీవ్ర ఆధిపత్య పోరు
- గద్వాల మున్సిపాలిటీలో మొత్తం 37వార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డే బై డే మారుతున్న పరిణామాలు, కొత్త కొత్త ట్విస్ట్‌లతో డైలీ సీరియల్‌ని మరిపిస్తున్న ఆ నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు ఇంకో మలుపు తిరిగిందా? ఇద్దరు నేతల ఆధిపత్యపోరులో సరికొత్త అధ్యాయం మొదలైందా? నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని బల్లగుద్ది మరీ…. చెప్పిన ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ ర్యాలీలో ఎందుకు పాల్గొన్నారు? కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పోరు జరగబోతున్న ఆ మున్సిపాలిటీ ఏది? ఏంటా టగ్ ఆఫ్ వార్? ఆధిపత్య, వర్గ రాజకీయాలకు కేరాఫ్‌గా మారిపోయిన నడిగడ్డ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు కేడర్‌లో గందరగోళాన్ని పెంచుతున్నాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సరిత మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా మున్సిపల్ టికెట్ల లొల్లి పెరుగుతోంది. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నానంటూ ఇన్నాళ్లు స్టేట్మెంట్స్ ఇచ్చిన ఎమ్మెల్యే బండ్ల…తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల మున్సిపల్ నామినేషన్ ర్యాలీలో పాల్గొని జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే ఓటేయ్యాలని పిలుపు నివ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యవహారం ఒక రకంగా గద్వాల కాంగ్రెస్‌లో మంటల్ని బాగా ఎగదోసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయవర్గాల్లో. ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జ్ మధ్య మొదట్నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నాడు బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు కాంగ్రెస్‌లో చేరాక కూడా గ్యాప్ తగ్గకపోగా.. అంతరం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ఇరు వర్గాలే పోటీ పడినప్పటికీ.. పార్టీ గుర్తు మీద జరక్కపోవడంతో… ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులుగానే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అలాకాదు. ఇవి పార్టీ సింబల్ మీద జరిగేవి కావడంతో… ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గద్వాల పురపాలక సంఘంలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. వీటిలో సగం వార్డులను తన వర్గానికి కేటాయించాలని ఇన్ఛార్జ్ సరిత కోరినట్టు సమాచారం. ఎంపీ మల్లు రవి, మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర దగ్గర కూడా ఆమె ఈ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారట.
మొత్తం 37 కు 37 సీట్లు తన మనుషులకే ఇవ్వాలని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సరిత వర్గీయలు కొందరు ఇండిపెండెంట్స్‌గా నామినేషన్స్ వేయడం, మరి కొందరు గులాబీ కండువాలు కప్పుకోవడం ఆసక్తి గా మారింది. నామినేషన్స్ ఉపసంహరణ గడువు ముగిసినా… తగ్గేదేలే అంటున్నాయి రెండు వర్గాలు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ప్రయత్నించినా, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడినా మేటర్ మాత్రం కొలిక్కి రాలేదు. నేతలు ఇద్దరూ ఎవరికి వారు పట్టుదలగా ఉండటంతో… పెద్దలు కూడా ఈ ఎపిసోడ్‌కు ముగింపు పలక లేకపోయారు. సరిత వర్గీయలు ఇండిపెండెంట్స్‌గా బరిలో నిలుస్తుండటంతో గద్వాలలోని చాలా వార్డుల్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయిందంటున్నారు విశ్లేషకులు. నామినేషన్స్ ఉపసంహరణ సమయంలో కీలక పరిణామాలు జరుగుతాయని అంచనా వేసినా నే ఛేంజ్ అన్నట్టుగా మారిపోవడంతో నడిగడ్డలో పోటీ, ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది.
Also Read
ఇదిలా ఉంటే…. మొన్నటి వరకు iam in BRS అని చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే బండ్ల నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం,హస్తం గుర్తుకు ఓటేయాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆ మధ్య స్పీకర్ తీర్పులో కూడా ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని తేల్చేయడం, తీరా… ఇప్పుడాయన కాంగ్రెస్‌కు ఓటేయమని అడగడంపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. ఇంకెన్నాళ్లీ దాగుడు మూతలు, ఇక పుల్‌స్టాప్ పెడదామనే ఉద్దేశ్యంతోనే…ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొని ఉండవచ్చంటున్నారు. ఇప్పుడు కూడా తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అంటే…. బీ ఫామ్స్ ఎపిసోడ్‌లో ఇబ్బందులతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయుల గెలుపు పై కూడా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారట కృష్ణమోహన్‌రెడ్డి. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారన్నది మరికొందరి విశ్లేషణ. సరిత, బండ్ల మధ్య ఆధిపత్య పోరులో ఇంకా ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అంతా ఆసక్తి గా చూస్తున్నారు అంతా.
- Tags
- gadwal congress
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!