Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ మునిసిపాలిటీల్లో సత్తా చాటుకున్న ఎంపీలు బండి సంజయ్, అరవింద్

Bandi Sanjay

Bandi Sanjay

అనుకున్నంత రేంజ్‌లో గెలవకున్నా…. ఆ ఇద్దరూ తెలంగాణలో బీజేపీ పరువు నిలబెట్టారా? పక్కా ప్లానింగ్‌తో తమ పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్స్‌లో సత్తా చాటగలిగారా? పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పుడు వాళ్ళ సేవల్ని విస్తృతంగా వాడుకోవాలని అనుకుంటోందా? వాళ్ళ సక్సెస్ ఫార్ములాకు కాషాయ పెద్దలు ఇంప్రెస్‌ అయ్యారా? ఎవరా ఇద్దరు? ఏం చేశారు? తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్‌ చేయలేకపోయింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖలో టాప్‌ టు బాటమ్‌ ఎవరికి వారు రకరకాల ఈక్వేషన్స్‌, కేలిక్యులేషన్స్‌తో వేసుకున్న అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఊహించినన్ని వార్డులు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేక పోయింది కాషాయ పార్టీ. భేషజాలు లేకుండా మాట్లాడుకోవాలంటే… మున్సిపల్‌ ఫలితాలు బీజేపీకి నిరాశే మిగిల్చాయి. కానీ…. ఇంత నెగెటివిటీలో కూడా రెండు కార్పొరేషన్స్‌ కాస్త పాజిటివిటీ తీసుకువచ్చాయి. ఆ ఇద్దరు నేతలు మాత్రం తాము టార్గెట్ పెట్టుకున్న చోట సక్సెస్ అయ్యారని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కరీంనగర్‌, నిజామాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ను కైవసం చేసుకుంటామని అక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్ ముందే ప్రకటించారు. అన్నట్టుగానే ఆ రెండు కార్పొరేషన్స్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. మొత్తం ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్స్‌లో బీజేపీ 75 డివిజన్స్‌ గెల్చుకుంటే… అందులో 58 ఈ రెండు నగరాల పరిధిలోనే ఉన్నాయి. దీన్నిబట్టే ఎంపీలు ఇద్దరూ ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు బీజేపీ నాయకులు.

కరీంనగర్‌లో అయితే మేజిక్ ఫిగర్‌కు కేవలం మూడు సీట్ల దూరంలో ఆగిపోయింది కమలం. రెండు చోట్ల మేయర్‌ పీఠాలు దక్కడం, దక్కకపోవడం సంగతి ఎలా ఉన్నా… ఎన్నికల కోసం ఎంపీలు మొదట్నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడే సొంత సర్వేలు చేయించుకున్నారు. వాటికి అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఎక్కడా తేడా రాకుండా అంతా తామై వ్యవహరించి పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కించగలిగారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో… ఈ ఇద్దరి సేవల్ని ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వాడుకోవాలని భావిస్తోందట పార్టీ అధిష్టానం. త్వరలోనే జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ పరిధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రభుత్వ పరంగా ఇందుకు సంబంధించిన ప్రాధమిక అడుగులు పడుతున్నాయి.

ఇక మూడు చోట్ల పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం… బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ను ఇక సిటీలోకి దింపాలనుకుంటున్నట్టు సమాచారం. కరీంనగర్‌, నిజామాబాద్‌ ఫార్ములాను ఇక్కడ కూడా వాడి పీఠాల్ని కొట్టాలన్నది కాషాయ పార్టీ టార్గెట్‌. గత GHMC ఎన్నికల సమయంలో వీరిద్దరు మాట్లాడిన తీరు బీజేపీకి ఊపు తెచ్చిందన్న అభిప్రాయం ఉంది. అలాగే… అప్పుడు ఊహించనన్ని డివిజన్స్‌లో గెలిచింది ఆ పార్టీ. అందుకే ఈసారి కూడా ఇద్దర్నీ హైదరాబాద్‌ గ్రౌండ్‌లోకి తీసుకువచ్చి ఫుల్‌ లెంగ్త్‌ బ్యాటింగ్‌ చేయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్‌ ఫార్ములానే ఇక్కడ కూడా అప్లయ్ చేస్తే మంచి ఫలితాలుంటాయన్నది తెలంగాణ బీజేపీ ఇంటర్నల్‌ టాక్‌. కరీంనగర్ స్పూర్తితో జీహెచ్ఎంసీ మీద కూడా కాషాయ జెండా ఎగరేస్తామని ఇప్పటికే ప్రకటించారు బండి సంజయ్‌. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఒవైసీ కళ్ళలో ఆనందం కోసం జీహెచ్‌ఎంసీని రాసిచ్చేశారని ఆరోపించారాయన. ఈ మాటల్ని బట్టే… బండి అజెండా ఏంటో అర్ధమవుతోందన్న మాటలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపు గ్రేటర్‌ ఎన్నికలు యమ హాట్‌ హాట్‌గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version