Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
- బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారా?
- ఊహాగానాలకు తెరదించేశారా?
- ఇక పుకార్లు షికార్లకు ఛాన్సే లేదని తేల్చేశారా?
- ట్వీట్లు, డిలీట్లు, అర్థాలు, నానార్థాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలినేని క్లారిటీ ఇచ్చేశారా? ఊహాగానాలకు తెరదించేశారా? ఇక పుకార్లు షికార్లకు ఛాన్సే లేదని తేల్చేశారా? ట్వీట్లు, డిలీట్లు, సమావేశాలు, అర్థాలు, నానార్ధాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారా? బాలినేనిలో ఇంత మార్పుకు దారి తీసిన ఆ మలుపేంటి? మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి సొంతగూటికి వెళ్తారన్న ఊహాగానాల నడుమ తిరుపతి జనసేన కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ పార్టీ మార్పు ప్రచారానికి ఓ ఎండ్ కార్డ్ పడినట్టేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒంగోలు పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేసిన బాలినేని…వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దగ్గరి బంధువు కూడా అయిన బాలినేనికి మొన్నటి ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఫ్యాన్ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నాక సైలెంట్ అయ్యారు. మధ్య మధ్యలో ఆయన తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం మాత్రం కొనసాగింది.
Also Read
ఆ మధ్య బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఒంగోలు రాజకీయాలు, స్థానిక పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాత ఆయనను ఆకాశానికెత్తేశారు బాలినేని. ఆయన మాకు నాయకుడు మాత్రమే కాదు.. నమ్మకం.. ఆదరణ.. ఆశ్రయం.. అంటూ బాలినేని అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ వచ్చింది. దీంతో బాలినేని వైసీపీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చేశారా అని అంతా అనుకునేలోపే కొద్ది సేపటికే ఆ ట్వీట్ డిలీట్ అయింది.. అసలు ఎందుకు పెట్టారు.. ఎందుకు తొలగించారు.. ఈ అంశం డిబేటబుల్ సబ్జెక్ట్ గా మారే లోపు తిరిగి ట్వీట్ ను మళ్లీ బాలినేని రీ పోస్ట్ చేయటం.. కేవలం సాంకేతిక కారణాలతో ఏర్పడిన బగ్ వల్లే ట్వీట్ డిలీట్ అయ్యింది తప్ప మరే కారణం లేదని ఆయన క్లారిటీ ఇవ్వటంతో ఆ సబ్జెక్ట్ కు అప్పటికి ఫుల్ స్టాప్ పడింది..
2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరారు బాలినేని.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో ఉన్న రాజకీయ విభేదాలే బాలినేనిని జనసేన వైపు నడిపించాయన్న విశ్లేషణలు వినిపించాయి.. అయితే ఆయన జనసేనలోకి వెళ్లిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదన్న టాక్ గట్టిగా వినిపించింది. ముఖ్యంగా ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో ఉన్న పాత విభేదాలు బాలినేనిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీలో చేరి చాలాకాలం గడిచినా.. పదవులు లేకపోవడం.. దామచర్ల వర్సెస్ బాలినేని డైలాగ్ వార్ కొనసాగడం.. కేడర్‌లో భరోసా తగ్గడం బాలినేని వర్గాన్ని ఆలోచనలో పడేసింది. ఇవన్నీ కలిపి బాలినేని వర్గంలో అసంతృప్తిని పెంచినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి ఇష్యూ బయటకు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేనిని పిలిచి మాట్లాడటం మాత్రం హాట్ టాపిక్ లా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ మధ్యలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారింది.
గతంలో అనేకసార్లు బాలినేనికి తగిన ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ వస్తున్న పవన్ ఆయనకు పార్టీలో ఏ బాధ్యతా అప్పగించడం చర్చనీయాంశమైంది. దీంతో అసలు పవన్ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారా లేక.. ఆయనను వైసీపీ నుంచి బయటకు లాగేందుకు పావుగా వాడుకున్నారా అనే చర్చ జరిగింది. ఆయన సన్నిహితుల్లో సైతం అనేక అనుమానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన పార్టీ మారవచ్చనే లీకులు ఆయన సన్నిహిత వర్గం నుంచే వచ్చాయి. ఇలాంటి తరుణంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డీ లిమిటేషన్ కమిటీ సభ్యునిగా బాలినేనికి బాధ్యతలు అప్పగించడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరిన 20 నెలల తర్వాత కీలక బాధ్యత దక్కడంతో బాలినేని కేడర్ ఖుషీగా ఉంది.
ఇదే సమయంలో తిరుపతి జనసేన సమావేశం వేదికగా బాలినేని చేసిన కామెంట్స్ తో ఇక వైసీపీ వైపు చూసేదిలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతోంది. రెండుసార్లు పవన్ వల్లే ఓడిపోయాను….జగన్‌ను ప్రశ్నించినందుకే మంత్రి పదవి పోయింది అంటూ బాలినేని చేసిన ఓపెన్ స్టేట్‌మెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రశ్నించే పార్టీలో ఉండాలనే జనసేనలో చేరానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైసీపీ నేతలు ఎన్ని మాట్లాడినా తాను పవన్ వెంటే ఉంటానని స్పష్టం చేయడం ద్వారా.. పార్టీ మారుతున్నారన్న వార్తలకు బాలినేని చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది.. పెట్టినట్టేనా అన్న చర్చ మొదలైంది.. పవన్‌పై వ్యక్తిగతంగా ప్రశంసలు కురిపించడం కూడా ఇప్పుడు హైలైట్ అవుతోంది. పవన్‌పై బాలినేని చూపిస్తున్న విపరీతమైన ఆదరణ వెనుక రాజకీయ భవిష్యత్తుపై ఉన్న ఆయన ఇచ్చిన భరోసానే కారణం అయి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. మొత్తమ్మీద బాలినేని ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పార్టీ మార్పు ప్రచారాల మధ్య తాజా పదవితో బాలినేని జనసేన యాక్టివిటీస్ లో కీ ప్లే రోల్ ప్లే చేయటం.. అన్ని క్వశ్చన్స్ కు సమాధానాలు దొరికినట్టేనా.. డీలిమిటేషన్ బాధ్యతలతో బాలినేని మళ్ళీ పాత వైభవాన్ని తెచ్చుకుంటారా.. లేక మున్ముందు ఇంకేవైనా ట్విస్ట్‌లు ఉంటాయా.. అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ.
- Tags
- balineni srinivas
- ntv
- OTR
తాజావార్తలు
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!