Site icon NTV Telugu

Off The Record : ఏపీ క్యాబినెట్ లో భారీ మార్పులు..? 10 మంది మంత్రులకు చంద్రబాబు షాక్

Ap Cabinet

Ap Cabinet

ఏపీ కేబినెట్‌లో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయా? దానికి సంబంధించిన కసరత్తు జోరుగా జరుగుతోందా? సీఎం చంద్రబాబు ప్రాధమికంగా ఒక అవగాహనకు వచ్చారా? ఎంత మంది మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది? మినిస్టర్స్‌ గ్రాఫ్‌ను బట్టి ఉద్వాసనలు కూడా ఉంటాయా? నివేదికల్ని బట్టే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఈసారి లోకేష్‌ టీమ్‌ స్పెషల్‌గా ఉండబోతోందా? లెట్స్‌ వాచ్‌. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పవన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదీకూడా… త్వరలోనే ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పుడున్న మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెస్‌ రిపోర్ట్స్‌ కూడా రెడీ అవుతున్నాయట. ఆ నివేదకల ప్రకారమే మార్పులు ఉండవచ్చని అంటున్నారు. నివేదికల్ని కూడా… అదేదో ఆషామాషీగా కాకుండా…. మినిట్ టూ మినిట్ మంత్రుల పనితీరును మానిటర్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ పరిశీలన సారాంశాన్ని బట్టి గ్రాఫ్‌ సిద్ధమవుతుందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. సీఎం చంద్రబాబు ప్రస్తుం ఈ సబ్జెక్ట్‌ మీదే ఎక్కువగా ఫోకస్‌ చేశారట. తాము నిర్వహిస్తున్న శాఖల మీద మంత్రులకు ఉన్న పట్టు, అధికారులతో ఎలా ఉంటున్నారు? ఎన్ని సమీక్షలు చేశారు? కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టగలిగారు? ఎన్ని ప్రెస్‌మీట్స్‌ పెట్టారు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులేస్తున్నట్టు తెలిసింది. అలాగే…. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా ఉన్నారు లాంటి క్షేత్ర స్థాయి వివరాలకు సైతం ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం వరకు ఒకేగానీ…. కేబినెట్‌లో మార్పులు చేర్పులకు అవే ప్రామాణికం, వాటినే కొలమానంగా తీసుకుంటారన్న ప్రచారం మాత్రం చాలామంది మినిస్టర్స్‌కు నిద్ర పట్టకుండా చేస్తోందట. దీనికి సంబంధించి చర్చలు ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి.

ఆ ఛేంజెస్‌ ఉగాదికే ఉంటాయా లేక మరో రెండు మూడు నెలల్లోనా అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు గీస్తున్న మినిస్టర్స్‌ గ్రాఫ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే కొంతమంది మంత్రులకు సంబంధించిన వ్యవహారాల చిట్టా సీఎం దగ్గరకు చేరిందట. ఎవరి పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది? ఎవరిని మార్చాలన్న విషయంలో కూడా ప్రాధమిక అవగాహనకు వచ్చినట్టు చెప్పుకుంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అన్నిటికీ మించి ఈసారి జరిగే మార్పులతోనే వచ్చే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నందున ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే ఈసారి కేబినెట్‌లో ప్రత్యేకంగా లోకేష్ టీం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అసలు అదే ఫస్ట్ ప్రయార్టీ అన్న మాటలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మంత్రుల పెర్ఫార్మెన్స్‌పై పూర్తి స్థాయి రిపోర్ట్‌ తర్వాత కొత్తగా ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, ఉన్న వాళ్ళలో ఎవరికి బైబై చెప్పేయాలన్న విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు సిద్ధమవుతున్న ప్రోగ్రెస్‌ కార్డ్స్‌తోనే మంత్రుల భవిష్యత్ ముడిపడి ఉందనే చర్చ బలంగా ఉంది కూటమి వర్గాల్లో. కనీసం పది మంది మంత్రుల శాఖలు మారచ్చనే ప్రచారం సైతం ఉంది. ఎలాంటి ఉరుములు మెరుపులు ఉంటాయో చూడాలి మరి.

Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

Exit mobile version