Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Anirudh Reddy

Off The Record : అనిరుధ్ రెడ్డి ఇప్ప సారా వ్యాఖ్యలతో రాజకీయ కలకలం

Published Date :March 10, 2026 , 7:54 pm
By Gogikar Sai Krishna
  • అనిరుధ్‌రెడ్డి సారా వ్యాఖ్యలతో రాజకీయ కలకలం
  • తెలంగాణలో సారా అమ్మకాలు మొదలుపెట్టాలన్న ఎమ్మెల్యే
  • సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలనుకున్నారా అంటూ చర్చలు
  • తెలంగాణ అటవీ ప్రాంతంలో విరివిగా దొరికే విప్ప పువ్వు
Off The Record : అనిరుధ్ రెడ్డి ఇప్ప సారా వ్యాఖ్యలతో రాజకీయ కలకలం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఉన్నట్టుండి ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సారా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దాదాపుగా అందరూ మర్చిపోయి… ఎక్కడో అడపా దడపా దొంగతనంగా కూచుకునే సారాను అధికారికం చేయమని సదరు శాసనసభ్యుడు ఎందుకు అడుగుతున్నారు? అది సొంత పబ్లిసిటీ స్టంటా? లేక ఆయన మాటల వెనక మర్మం వేరే ఉందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా సారా స్టోరీ? తెలంగాణలో సారాయిని తిరిగి తీసుకు రావాలి. అమ్మకాలు జరగాలంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. మళ్లీ సారా తయారీ గురించి చిట్‌చాట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అసలు జరుగుతున్న మద్యం అమ్మకాలనే నియంత్రించాలన్న డిమాండ్‌ పెరుగుతుంటే… ఈయనేంటి ఎప్పుడో మర్చిపోయిన సారాను ఇప్పుడు మళ్లీ తయారు చేసి అమ్మమంటున్నారంటూ హాట్‌ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో… అదీ కూడా ఎప్పుడో పాత రోజుల్లో సారా ప్యాకెట్లు అమ్మే సిస్టమ్ ఉండేది. దాన్ని నిషేధించమంటూ సారా వ్యతిరేక ఉద్యమాలు సైతం జరిగాయి. కాలక్రమంలో అది పూర్తిగా కనుమరుగైంది. ఈ పరిస్థితుల్లో సడన్‌గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్‌రెడ్డి సారాయి ప్రతిపాదన చేయడం వెనకున్న మతలబేంటన్న చర్చలు నడుస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే సర్కార్ ను ఇరకాటంలో పెట్టడానికి అలా మాట్లాడారా? లేక ఆయన మాటల అర్ధం వేరే ఉందా అని ఆరా తీస్తున్నారు చాలామంది. గతంలో కూడా అనిరుధ్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సొంత పార్టీ నేతలు… మంత్రి మీద ఆరోపణలు చేసిన క్రమంలో అనుమానాలు పెరుగుతున్నాయి. అసెంబ్లీలో బాంబు పేల్చుతానని ఎమ్మెల్యే అనడం పెద్ద చర్చకే దారి తీసింది. ఐతే అనిరుధ్‌ కామెంట్స్ వెనక వేరే వ్యూహం ఉన్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. సహజంగానే తెలంగాణలో అటవీ సంపద ఎక్కువ. అలాంటి ఫారెస్ట్‌ ఏరియాల్లో గిరిజనుల ఆదాయంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచే ప్లాన్‌లో భాగమే సారా తయారీ సూచన అన్నది ఎమ్మెల్యే సన్నిహితవర్గాల మాట. సాధారణంగా అటవీ ప్రాంతంలో విప్ప పువ్వు ఎక్కువగా దొరుకుతుంది. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి. విటమిన్ సి…కార్పోహైడ్రేట్స్ ఉన్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. సరిగ్గా ఈ పాయింట్‌నే వెలుగులోకి తీసుకొస్తున్నారు ఎమ్మెల్యే. గిరిజన ప్రాంతాల్లో చాలామంది ఇప్పటికీ విప్ప పువ్వుతో సారా తయారు చేసుకుంటారు. దాన్నే స్ట్రీమ్‌ చేయాలన్నది అనిరుధ్‌రెడ్డి ఆలోచన అట.

Also Read

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
  • Off The Record : ఎన్టీఆర్ జిల్లాలో బలమైన కాపు నేతల కోసం వైసీపీ వెదుకులాట
  • Off The Record : టేకాఫ్ ఉంటుందా? లేదా పర్మినెంట్ ల్యాండిగేనా?
Add as a preferred
source on google

విప్ప పువ్వుతో సారా తయారు చేసి ఎగుమతి చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం ముందు పెట్టాలనుకుంటున్నారట ఆయన. అసెంబ్లీ వేదికగానే తన మనసులో ఉన్నదాన్ని చెప్పాలనుకుంటున్నారు. విప్ప పువ్వుపై ఆయన ఇప్పటికే అధ్యయనం చేసి 200 పేజీల నివేదిక కూడా సిద్ధం చేశారట. విదేశాలకు సంబంధించిన ఇద్దరు శాస్త్రవేత్తలతో చర్చించి ఔషధ గుణాలను నిర్ధారించుకున్నాకే…ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. దీన్ని ఎగుమతి చేసినా ఆదాయ వనరుగా మారుతుందన్నది జడ్చర్ల ఎమ్మెల్యే అభిప్రాయం. ఆల్రెడీ మధ్యప్రదేశ్, ఒడిశాల్లో అధికారికంగా దీన్ని తయారు చేస్తున్నారనేది ఆయన వర్షన్. అలాగే తెలంగాణలో కూడా ప్లాన్‌ చేస్తే… గిరిజనులకు పని కల్పించడంతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరుగా ఉంటుందంటూ నివేదికను అసెంబ్లీలో పెట్టే ఆలోచనలో ఉన్నారట అనిరుధ్‌రెడ్డి. ఐతే ప్రభుత్వం దాన్ని ఎలా స్వీకరిస్తుందన్నది చూడాలి. విప్పపువ్వు వికసిస్తుందా? లేక అక్కడితో రాలిపోతుందా అన్నది చూడాలి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anirudh Reddy
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions