OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం

Otr2

Otr2

వరంగల్‌లో మీటింగ్‌ పెట్టి కొండా దంపతులు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? ఢిల్లీ ఫోన్‌కాల్‌, పెద్దలతో మీటింగ్‌ మాటల్లో నిజమెంత? ఆ విషయంలో అసలు డౌట్స్‌ ఎందుకు పెరుగుతున్నాయి? మాజీ మంత్రి దంపతులకు నిజంగానే ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందా? లేక అది కేడర్‌లో మనోధైర్యం నింపే ప్రయత్నమా? లెట్స్‌ వాచ్‌.

మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు కాస్త దూరంగా ఉంటున్నారు కొండా సురేఖ దంపతులు. దీంతో.. తదుపరి అడుగులు ఏంటన్న విషయంలో క్లారిటీ లేక సొంత కేడర్‌లో అయోమయం పెరుగుతోందట. విషయం గ్రహించిన మాజీ మంత్రి దంపతులు అలర్ట్‌ అవ్వకుంటే నష్టపోతామన్న అంచనాతోనే తాజాగా క్లారిఫికేషన్‌ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ఎపిసోడ్‌ తర్వాత తొలిసారి వరంగల్‌ వచ్చి తూర్పు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని… ఇటీవలి పరిణామాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని చెప్పి అనుమానాలకు తెరదించారు కొండా సురేఖ, మురళి. ఇక ఇదే వేదికగా తమ రాజకీయ ప్రత్యర్థులైన నాయిని రాజేందర్ రెడ్డి, బసవరాజు సారయ్యలపై కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నా మీద పోటీచేసి ఎమ్మెల్యేగా గెలవడం కాదు, దమ్ముంటే ముందు నా అనుచరుల మీద కార్పొరేటర్‌గా గెలిచి చూపించాలంటూ సొంత పార్టీ నేతలకే సవాల్‌ విసిరారు.

ఈ స్టేట్‌మెంట్‌ ద్వారా… మనమేం తగ్గలేదన్న సంకేతాన్ని అనుచరులకు పంపినట్టయిందన్న విశ్లేషణలున్నాయి. అలాగే… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయేది తామేనని, అప్పుడు కూడా గెలిచి తిరిగి మంత్రి పదవి చేపడతామని చెప్పారు. దంపతులిద్దరూ తమను తాము ప్రొజెక్ట్‌ చేసుకోవడంతోపాటు ప్రత్యర్థులుగా భావిస్తున్నవారి మీద వ్యంగ్యాస్త్రాలతో అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. సురేఖను గెలిపించుకోవడం కోసం 16 ఎకరాలు అమ్మానని చెప్పిన కొండా మురళి… క్యాడర్ కోసం మరో 10 ఎకరాలు అమ్మితే తప్పేంటంటూ కేడర్‌నే అడిగారు. అలా అడగడం ద్వారా… మాతో ఉన్నవాళ్ళకు ఆర్థికంతో పాటు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించినట్టయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇది కచ్చితంగా తనతో ఉన్నవాళ్ళు చేజారిపోకుండా వేసిన పెద్ద ఎత్తుగడేనని, రేపు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వర్గం బలహీనపడకుండా చూసుకోవడం కూడా ఇందులో భాగమై ఉండవచ్చంటున్నారు కొందరు. అంతే కాదు… ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందంటూ చెప్పడం ద్వారా… అధిష్టానంతో సత్సంబంధాలే కొనసాగుతున్నాయని అందరికీ తెలియజేయాలని అనుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. అయితే… ఈ మాటల్ని కొట్టి పారేస్తున్నారు కాంగ్రెస్‌ సీనియర్స్ కొందరు. కొండా దంపతులను ఢిల్లీ పిలిచిన విషయాన్ని అక్కడి నుంచి ఎవరూ పార్టీ రాష్ట్ర పెద్దలకు చెప్పలేదని, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే… కచ్చితంగా స్టేట్‌ పార్టీకి సమాచారం ఇచ్చి ఉండేవాళ్ళని అంటున్నారు. వరంగల్ మీటింగ్‌లో ఢిల్లీ ఫోన్‌కాల్‌ అంటూ చెప్పారేగానీ… ఎప్పుడు వెళ్తున్నారో ఎందుకు చెప్పలేదంటూ లాజిక్‌ లాగుతున్నారు ప్రత్యర్థులు. అయితే… ఇక్కడే మరో పాయింట్‌ కూడా తెర మీదికి వస్తోంది. తమ కుటుంబానికి సెంటిమెంట్‌ అయిన గణేష్‌ నవరాత్రుల్లో సాధారణంగా కొండా మురళి ఎవర్నీ కలవరట. అవి అందుకే క్లారిటీ ఉండి ఉండకపోవచ్చన్నది ఇంకో వెర్షన్‌. ఈ విషంలో కొండా దంపతులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అంచనాలున్నాయి. అసలు కొండా దంపతులు ఢిల్లీ వెళ్తారా? లేక ఇదంతా ప్రచారం మాత్రమేనా అన్న సందేహాల నడుమ గుసగుసలు పెరిగిపోతున్నాయి. సొంత కేడర్‌లో నమ్మకం నింపేలా, అధిష్టానం నుంచి తమకు భరోసా ఉందని చెప్పి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండవచ్చన్న చర్చ సైతం నడుస్తోంది వరంగల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో.