OTR: నెల్లూరులో ప్రజారాజ్యం ఫార్ములా ఫాలో అవుతున్న జనసేన..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు కూటమి రాజకీయం కొత్త టర్న్ తీసుకోబోతోందా? మేయర్‌తో పాటు మెజార్టీ డివిజన్స్ మాకే కావాలని జనసేన పట్టుబట్టబోతోందా? పార్టీ స్థానిక నాయకులు అందుకు సంబంధించిన ప్రపోజల్స్ సిద్ధం చేసి అధిష్టానానికి పంపే పనిలో ఉన్నారా? అసలు నెల్లూరులో జనసేనకు ఆ స్థాయి బలం ఉందా? అదే మాట ఎవరైనా అడిగితే గ్లాస్ లీడర్స్ చెబుతున్న సమాధానం ఏంటి? కొత్తగా తెర మీదికి తెచ్చిన పొలిటికల్ ఫార్ములా ఏంటి?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది జనసేన. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్‌ను తమ కోటాలోకి ఇవ్వాలని కోరబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఛైర్మన్‌తో పాటు ఎక్కువ కార్పొరేటర్ సీట్లు అడగాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే.. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం తమ బలం ఎంతన్నది జనసేన నేతలకు కూడా తెలుసునని, అయినాసరే… వాళ్ళ ప్రయత్నాలను మాత్రం ఆపడంలేదన్న చర్చ జరుగుతోందట కూటమి వర్గాల్లో. అయితే.. ప్రస్తుతానికి అంత బలమైన నాయకులు లేకున్నా…. ఆ స్థాయి వాళ్ళని పార్టీలో చేర్చుకుని మరీ…మున్సిపల్ బరిలో జిల్లా జనసేన నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బలం లేని చోట మేయర్ పదవితో పాటు ఎక్కువ కార్పొరేటర్ సీట్లు ఎలా అడుగుతారన్న ప్రశ్నకు కాస్త డిఫరెంట్‌గా సమాధానం చెబుతున్నారట గ్లాస్ లీడర్స్. అందుకు 2009 ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ… ప్రజారాజ్యం ఫార్ములాను తెర మీదికి తెస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read
2009లో ప్రజారాజ్యం పార్టీ నెల్లూరు సిటీ సీటును గెల్చుకుంది. రూరల్ సీటులో అతి తక్కువ మార్జిన్‌తో ఓడిపోయింది. ఆ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తూ…. మొత్తంగా కార్పొరేషన్ పరిధిలో జనసేనకు రాజకీయంగా స్పేస్ ఉందంటూ తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారట లోకల్ జనసేన నాయకులు. ఇదే సమయంలో.. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు అవసరమైతే గట్టి నాయకుల్ని చేర్చుకునే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువ గనుక అదే సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేతకు జనసేన కండువా కప్పే దిశగా చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం ఉంది. అదే జరిగితే.. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమీకరణలు మారవచ్చని అంటున్నారు.
ఇక కూటమి రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వస్తోంది. నెల్లూరు మేయర్ అభ్యర్థిగా టీడీపీ నుంచి ‘రూప్ కుమార్ యాదవ్ పేరు ఇప్పటికే ప్రచారంలో ఉంది. దాదాపు ఖరారైందన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. జనసేన మాత్రం తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతోందట. నెల్లూరులో పర్యటించిన పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ కో ఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివశంకర్ దగ్గర స్థానిక నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలలో జనసేనకు ఎన్ని స్థానాలు ఇస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ…. ఇప్పటికే ఒకరిద్దరు ఆ పార్టీ నాయకులు తమకి కార్పొరేటర్ పదవి దక్కుతుందన్న ఆశలో ప్రచారాలు కూడా ప్రారంభించారట. అధిష్టానం ఆశీస్సులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో ఉన్న సన్నిహిత సంబంధాలతో కొందరు ముందుగానే జనంలోకి వెళ్తున్నారు.
ఈ పరిణామక్రమంలో మేయర్ పదవి కూడా కావాలని జనసేన డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. కానీ… మేయర్ పదవి పూర్తిగా రాష్ట్ర నాయకత్వం చేతుల్లో ఉంటుందిగనుక… అది జరిగే పని కాదని.. నెల్లూరు జనసేన నేతలు ఊహల్లో విహరిస్తున్నారంటూ కాస్త వెటకారాలు కూడా వినిపిస్తున్నాయి. అటు టిడిపి తరఫున ఆశావాహుల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. తెలుగుదేశం తరపున సీట్లు ఆశించేవాళ్ళు పెరగడం, మాకేం తక్కువ అన్నట్టు జనసేన నాయకులు ఉండటంతో… నెల్లూరు మున్సిపల్ పాలిటిక్స్ రక్తి కడుతున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోకల్ లీడర్స్ ఆశపడుతున్నా జనసేనకు మేయర్ స్థాయి నాయకుడు ఎవరూ లేరని, ఫైనల్ టీడీపీనే రేస్‌లో ఉంటుందన్న వాదనే బలంగా ఉంది.
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!