OTR : రెండున్నరేళ్లుగా ఖాళీ… కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి? రెండున్నరేళ్ళ నుంచి పెండింగ్‌లో పెట్టిన పోస్ట్‌ని ఇప్పుడు భర్తీ చేయాలనుకుంటున్నా… అర్హత ఉన్న నేత ఎవరంటూ వెదకాల్సి వస్తోందా? విపరీతమైన జాప్యం, నాన్చుడు ధోరణితో నాయకుల మూడ్ మారిపోతోందా? ఏదా కీకలమైన పదవి? గతంలో తెర మీదికి వచ్చి ఇప్పుడు డౌట్లో ఉన్న ఆ నాయకుడు ఎవరు? అధికార పార్టీ అన్నాక…. బాగా దూకుడు మీద ఉండాలి. పార్టీ కమిటీలు… పదవుల భర్తీని చక చక పూర్తి చేసుకోవాలి. పవర్లో ఉన్నప్పుడు పదవుల పందేరమంటే విపరీతమైన పోటీ ఉండటం సహజం. అందరికీ నచ్చజెప్పుకుంటుూ ముందడుగు వేయాల్సి ఉంటుంది. కానీ…తెలంగాణలో రెండున్నరేళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ పని మాత్రం చేయలేకపోతోందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఎందుకోగానీ… పదవుల భర్తీపై ఎప్పటికప్పుడు వాయిదా పర్వమే నడుస్తోంది. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు… ఇటు ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్…. ఇలా కీలకమైన ప్రతీదీ పెండింగే. కీలక నాయకులకు కట్టబెట్టాల్నిస పదవుల వ్యవహారం కూడా ఎందుకిలా తయారవుతోందన్నది సగటు కార్యకర్తని వేధిస్తున్న ప్రశ్న. అధిష్టానం బిజీగా ఉందా..? లేక భర్తీ చేయడం రాష్ట్ర నాయకత్వానికి ఇష్టం లేదా అని చర్చించుకునే దాకా వచ్చింది పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్‌లో ముందు పార్టీ పదవుల్ని భర్తీ చేయాలని చూస్తున్నారట.
ఇందులో ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఉంది. ప్రభుత్వం చేస్తున్న అభివ్రుద్ది పనుల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత ఉన్న కీలకమైన పదవి అది. కానీ… ఆ విషయంలో కూడా ఎందుకు తాత్సారం అన్నది బిగ్ క్వశ్చన్. ఇందుకోసం రకరకాల పేర్లు పరిశీలనలో ఉన్నా…నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరిగి వ్యవహారాలు చక్కబెట్టగలిగిన నాయకుడికి ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నారట. ప్రస్తుతం మధు యాష్కీ ఈ సీట్లో ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త చైర్మన్ ఎంపిక కోసం చూస్తున్నారు. ఈ రేస్ ముందు వరుసలో ఉన్నారు జగ్గారెడ్డి. చాలా రోజుల నుండి ఈ చర్చ నడుస్తున్నా…. ప్రకటన మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. కాలం గడిచిపోవడంతో… జగ్గారెడ్డి కూడా ఇప్పుడు ఆ పదవి పై అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది. నవంబర్‌లో నా రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని తాజాగా ఆయన చెప్పిన క్రమంలో ఫోకస్ మొత్తం అటువైపు షిఫ్ట్ అయింది. అయితే… అధిష్టానం నచ్చచెప్పి ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి తీసుకోవాలని చెప్తే జగ్గారెడ్డి నో అనకపోవచ్చని అంటున్నా…. ఇప్పుడాయన ఆ మూడ్‌లో ఉన్నారా అన్నది సందేహమేనని అంటున్నారు. జగ్గారెడ్డి ఒకే అంటే సమస్య లేదు. కానీ నో అంటే పరిస్థితి ఏంటి..? ఆ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చే నాయకుడు ఎవరు..? రాష్ట్రం అంతా తిరగడం…అందరితో సత్సంబంధాలు ఉండటం లాంటి క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయంటూ చర్చలు నడుస్తున్నాయి.
Also Read
- Tags
- congress
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!