Off The Record: పార్టీలో చేరికల సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీలక నేతల మధ్య గ్యాప్ తగ్గించే పనిపై ఢిల్లీ బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు సరే..! తెలంగాణ బీజేపీలో అడుగు ముందుకు పడని చేరికల సంగతి ఏంటి? ప్రత్యేకంగా కమిటీ వేసినా.. ఎందుకు పురోగతి లేదు? ఈ అంశంపై బీజేపీ హైకమాండ్ ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? దిశానిర్దేశం చేసిందా? అమిత్ షా నిర్వహించిన మీటింగ్‌లో ఏం జరిగింది?
Also Read
చేరికలపై సమీక్షలతోనే సరి..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. బీజేపీ నేతలు అధికారంలోకి వస్తామని భారీ ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి.. బలమైన నాయకులను పార్టీలోని ఆహ్వానించడానికి పార్టీ ప్రత్యేకంగా చేరికల కమిటీని వేసింది. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలకు కాషాయ కండువా కప్పాలన్నది పార్టీ పెద్దల ఆలోచన. కానీ.. బీజేపీ ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. ఈ అంశంపై హైదరాబాద్‌లోనూ.. హస్తినలోనూ పలుమార్లు సమీక్షలు చేసినా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉంది సమస్య.
చేరికల కమిటీకి అమిత్ షా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా?
చేరికలు లేకపోవడానికి బీజేపీ నేతలు చెబుతున్న కారణం ఒక్కటే. టికెట్‌పై హామీ ఇస్తే జంప్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని. అయితే అలాంటి హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చేరిక కమిటీలోని నేతలు చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. దీనికితోడు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న నాయకులు వివరాలు లీక్ కావడంతో ఆగిపోతున్నారని మరో వాదన ఉంది. తాజాగా ఢిల్లీలో అమిత్ షా నిర్వహించిన సమావేశంలో చేరికలపై గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. బీజేపీ ఇతర పార్టీల నేతలు ఎందుకు చేరడం లేదు? అని షా ప్రశ్నిస్తే.. టికెట్‌పై హామీ లభించక ఎవరూ రావడం లేదని రాష్ట్ర నాయకులు బదులిచ్చారట. బలమైన నాయకులు రావడానికి ఆసక్తితో ఉన్నా.. టికెట్‌పై భరోసా లేక ముందడుగు పడటం లేదని చెప్పారట. ఈ విషయంలో రాష్ట్ర నాయకులకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట అమిత్ షా. బలమైన నాయకులు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉంటే.. అలాంటి హామీ ఇవ్వాలని స్పష్టం చేశారట. అయితే ఒకరొస్తుంటే.. ఇంకొకరు అడ్డుకుంటున్నారని మరికొందరు ప్రస్తావించారట. ఆ తరహా సమస్యలు వస్తే అధ్యక్షుడితో మాట్లాడి సెట్ చేసుకోవాలని.. రెగ్యులర్‌గా అంతా సమావేశం కావాలని సూచించారట షా.
ముందుగానే అభ్యర్థుల ప్రకటనకు నో..!
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలని ఇంకొందరు రాష్ట్ర నాయకులు ఢిల్లీ పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించారట. అన్నిచోట్లా కాకపోయినా.. బలమైన అభ్యర్థులు ఉన్నచోట ఆ మేరకు ప్రకటన చేస్తే ఫీల్డ్‌లో పనిచేసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారట. ఇదే విషయాన్ని గతంలోనూ బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ ముందు పెట్టారు. బీజేపీలో అలాంటి సాంప్రదాయం లేదని ఆయన నో చెప్పారు. తాజా సమావేశంలోనూ ఈ అంశంపై రిప్లయ్ లేదని తెలుస్తోంది. ఇప్పుడు కూడా టికెట్‌పై హామీ ఇవ్వాలని చెప్పారు కానీ.. వాళ్లే అభ్యర్థులని మాత్రం ప్రకటన చేయొద్దని ఢిల్లీ పెద్దలు గీత గీశారట. మరి.. బీజేపీ లైన్‌లో చేరికలు ఎంత వరకు ముందుకెళ్తాయో కాలమే చెప్పాలి.
- Tags
- bjp
- cm kcr
- off the record
- telangana
తాజావార్తలు
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!