NTV Telugu Site icon

Off The Record: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటుంన్నారా..? లోపం ఎక్కుడుంది?

Ts

Ts

Off The Record: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా… ఇటీవల వరుసగా రెండు, మూడు ఊహించని ఘటనలు జరిగాయి. లగచర్లలో రైతులు కలెక్టర్ పై
తిరగబడడంతో సమస్యలు మొదలయ్యాయి. కలెక్టర్‌ని తప్పుదోవ పట్టించి రైతులు లేని దగ్గరికి తీసుకెళ్లి దాడి చేశారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరించారని, కలెక్టర్‌పై దాడికి అదే కారణం తేల్చింది సర్కార్‌. రెండు మూడు రోజులపాటు ఈ ఎపిసోడ్ చుట్టూనే తిరిగింది తెలంగాణ రాజకీయం మొత్తం. అది కచ్చితంగా బీఆర్‌ఎస్‌ కుట్రేనని, ఆధారాలు బయటపెడుతూ… ప్రతిపక్షం మీద అప్పర్‌ హ్యాండ్‌ సాధించే ప్రయత్నం చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. కానీ… అక్కడే కాస్త నాలుక మడతపడిందంటున్నారు పరిశీలకులు. లగచర్లలో అంతా ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ అంతా అయ్యాక క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్‌ నేతలు. మరి మొదట్లో అంతా ఫార్మా అని ప్రచారం జరుగుతుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది క్వశ్చన్‌.

Read Also: Off The Record: వైసీపీ నేతలపై వరుస కేసులు..! ఒకసారి జైలుకి వెళ్లొస్తే పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారా?

వివాదం ముదిరి… అదంతా ఫార్మా సిటీకోసమేనని ప్రచారం జరిగి, జనం నమ్మేదాకా ప్రభుత్వం తరపునగాని, కాంగ్రెస్‌ వైపు నుంచిగాని పెద్దలు జోక్యం చేసుకుని ఎందుకు వివరంగా చెప్పలేకపోయారన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు పార్టీ వర్గాల్లో. ఆ చెప్పేదేదో… ముందే, మొత్తం ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఉందని ప్రకటిస్తే ఇంత రాద్ధాంతం జరిగేది కాదేమోనన్న వాదన సైతం వినిపిస్తోంది. ఇది ఎవరి వైఫల్యం? ప్రభుత్వ, పార్టీ పెద్దలు ముందే ఎందుకు అలర్ట్‌ అవలేకపోయారు? తీరా… నష్టం జరిగిపోయి జనం తిరగబడ్డాక వాస్తవాలు చెబితే మాత్రం నమ్ముతారా? ప్రతిపక్షం మీద ఇప్పుడు కాదు, అప్పడే పైచేయి కోసం ప్రయత్నించి ఉండాల్సిందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇక దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ఆర్డీవో మీద దాడాచేసే దాకా వెళ్ళింది. దీనిపై కూడా ఆందోళనకి దిగింది బీఆర్‌ఎస్‌. ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే… ఆ పరిశ్రమకు అనుమతులు ఇచ్చిందే బీఆర్‌ఎస్‌ సర్కార్‌. ఆ పార్టీకి చెందిన నాయకులు డైరెక్టర్స్‌గా ఉన్నారట. ఈ వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎప్పుడో క్లారిటీ ఇవ్వాల్సింది. కానీ… మేటర్‌ సీరియస్ అయ్యాక.. పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని, దాని వెనక ఉన్నది ఆ పార్టీ నేతలేనని ఎంత చెప్పినా ఏం ఉపయోగం అన్నది క్వశ్చన్‌. ప్రతిపక్ష పార్టీని కార్నర్‌ చేస్తూ… ఆ చెప్పే ముక్కేదో ఇంత రచ్చ జరక్క ముందే చెప్పి ఉంటే… తమకే మైలేజ్‌ వచ్చి ఉండేది కదా అన్నది కొందరు కాంగ్రెస్‌ నాయకుల బాధగా తెలిసింది.

Read Also: US: బోర్డింగ్ పాస్ లేకుండానే న్యూయార్క్ నుంచి పారిస్‌కు జర్నీ.. చివరికిలా..!

అసలు దిలావర్‌పూర్‌ అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుకోవాల్సిన రీతిలో ఎక్కుకోలేదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. మంత్రి సీతక్క రంగంలోకి దిగాకగానీ…. అసలు విషయం చర్చలోకి రాలేదు. సీతక్క… కేటీఆర్‌కి సవాల్ విసిరి… దిలావర్‌పూర్ రా..అక్కడే చర్చ చేద్దాం అన్నాకే బీఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడిందని అంటున్నారు. ఈ పనేదో ముందే చేసి ఉంటే… రైతుల్లో అంత వ్యతిరేకత వచ్చి రోడ్డెక్కేవాళ్ళు కాదు కదా అన్నది పొలిటికల్‌ పరిశీలకుల ప్రశ్న. ఇక హాస్టల్స్‌లో భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలు అవుతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీనిపై సిఎం రేవంత్ పదే పదే హెచ్చరిస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. పరిస్థితి సీరియస్ అవ్వడంతో సీఎం అధికారుల మీద సీరియస్‌ అవ్వాల్సి వచ్చింది. మారకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించేదాకా వెళ్ళింది వ్యవహారం. ఐతే మొత్తం ఎపిసోడ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు. బీఆర్‌ఎస్‌ నేతలే కుట్ర లు చేసి…ఆందోళనకర పరిస్థితుల్ని సృష్టిస్తున్నారని, హాస్టల్ ఘటనలపై లోతుగా దర్యాప్తు చేయించమని సీఎంకి అప్పీల్ చేస్తున్నారు. దర్యాప్తు సంగతి ఎలా ఉన్నా…మొత్తంగా ఈ మూడు ప్రధానమైన విషయాల్లో ప్రభుత్వం ఎందుకు ఇరుకున పడాల్సి వచ్చింది? అసలు లోపం ఎక్కడుంది? సరైన సమయంలో ఇటు ప్రభుత్వం నుంచిగాని, అటు కాంగ్రెస్‌ పార్టీ నుంచిగానీ స్పందన ఉండి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదు కదా అన్నది పరిశీలకుల మాట. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే… ఇంతకంటే పెద్ద పెద్ద ఘటనలు జరిగి పూర్తిగా ఇరుకున పడే ప్రమాదాన్ని కూడా కొట్టి పారేయలేమన్నది తెలంగాణ పొలిటికల్‌ పండిట్స్ మాట.