Site icon NTV Telugu

Off The Record: ఆ ఎమ్మెల్యే కోటరీ అప్పుడే దందాల్లో ఆరితేరిపోయారా?

Mla Adireddy Vasu

Mla Adireddy Vasu

Off The Record: ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. ఫస్ట్‌ టైంఎమ్మెల్యే. గెలిచిన వెంటనే ఆ ఊపులో భారీ భారీ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేశారు. అది చేస్తా… ఇది చేస్తా… రాజమండ్రిని అలా మార్చేస్తానంటూ అబ్బో…. అరచేతిలో స్వర్గం చూపించారన్నది లోకల్‌ టాక్‌. అది చూసివ జనం కూడా… అమ్మో… సార్‌ ఆ రేంజ్‌లో చెబుతున్నారంటే మేటర్‌ చాలా ఉండే ఉంటుంది. ఆయన చెప్పింది వంద శాతం కాకున్నా… అందులో సగం అమలైనా… ఆ కిక్కే వేరప్పా అనుకున్నారట నియోజకవర్గ ప్రజలు. కట్‌ చేస్తే… ఏడాదిలోనే సీన్‌ అర్థమై పోయింది, బిల్డప్‌ ఎక్కువ- బిజినెస్‌ తక్కువ అన్న సంగతి అర్ధమైపోయిందని అంటున్నారట స్థానికులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫైర్ కాదు ఫ్లవరే అన్నది రాజమండ్రి లేటెస్ట్‌ టాక్‌. పైగా ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీతో ఇంకా బ్యాడ్‌ నేమ్‌ వస్తోందని అంటున్నారు. అవినీతి ఆరోపణలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

Read Also: Murder : చెల్లెలి మీద ప్రేమ.. బావను మర్డర్ చేసిన బామ్మర్దులు

రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తన మానసిక పుత్రిక అని చెబుతూ… తరచూ వెళ్లి తనిఖీలు చేస్తున్నారు ఎమ్మెల్యే. కానీ… ఆయన వెళ్ళినప్పుడల్లా హంగామా తప్ప వాస్తవంగా ఒరిగిందేంలేదని అంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్న ఆదిరెడ్డి అనుచరుడు ఒకరు భారీ అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ సర్టిఫికెట్లు, సెక్యూరిటీ పోస్ట్‌లకు రేటు కట్టేసి ముడుపులు మూటగట్టుకుంటున్నారట. హాస్పిటల్‌లో రేడియాలజిస్ట్ లేరు. దీనితో మూడు రోజులకు ఒకసారి మాత్రమే ఎమ్మారై, సీటీ స్కాన్‌లు జరుగుతున్న పట్టించుకునే వాళ్ళు లేరు. సరైన సెక్యూరిటీ పర్యవేక్షణ లేక దొంగతనాల సంగతైతే చెప్పేపనేలేదు. రోగులు, వాళ్ళ అటెండర్స్‌ డబ్బు, ఫోన్స్‌ చోరీ కామనైపోయింది. చివరికి ఇటీవల ఓ డాక్టర్‌ ఫోన్‌ కూడా కొట్టేశారు కేటుగాళ్ళు. హాస్పిటల్‌తో సంబంధంలేని ఓ యువతి ఇక్కడ పనిచేస్తున్నట్లు నటించి ఉద్యోగాల పేరుతో 20 లక్షల రూపాయలదాకా వసూలు చేసింది. దానికి సంబంధించి హాస్పిటల్ అధికారులు కనీసం పోలీస్‌ కంప్లయింట్‌ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన ఒక సర్కిల్ ఇన్ స్పెక్టర్‌కు రాజమండ్రి త్రీ టౌన్‌లో పోస్టింగ్‌ ఇప్పించుకున్నారట. కానీ… ఆయన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోగా….ఆ స్టేషన్‌ పరిధిలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన ఓ డాక్టర్ హవా నడుస్తోందట. సదరు డాక్టర్‌ వైద్యం కంటే ఎక్కువగా సెటిల్‌మెంట్స్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: US Offers ₹430 Crores: అమెరికా 26 ఏళ్ల పగ.. అధ్యక్షుడిని పట్టిస్తే రూ.430 కోట్లు గిఫ్ట్..

రాజమండ్రి సిటీలోని మద్యం షాపుల దగ్గర మందుబాబుల వీరంగం మామూలుగా ఉండటం లేదు. ఆకతాయిలు తలలు పగలగొట్టుకున్నా…త్రీ టౌన్ లో కేసులు నమోదు కావడం లేదట. అలా ఎందుకని ఆరా తీస్తే… వెనకాల టిడిపి డాక్టర్ హస్తం ఉన్నట్టు తెలిసిందట. చివరికి సొంత పార్టీ వారే… రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో డాక్టర్ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారంటూ గుసగుసలాడుకుంటున్నారట. ఇక నియోజకవర్గంలో ఎక్కువ భాగం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే ఉన్నా… సిటీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే ముందు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పొంతనే లేదంటున్నారు. కనీస నిర్వహణ లేక… కంబాల చెరువు పార్క్ , గ్లో గార్డెన్ , పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇలా… ఏ విషయం తీసుకున్నా… ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాటలకు, చేతలకు పొంతనే కనిపించడం లేదంటున్నారు రాజమండ్రి వాసులు.

Exit mobile version