NTV Telugu Site icon

Off The Record: కమలం రేకులు కొట్లాడుకుంటున్నాయి..! ఆ ఇద్దరి నేతల మధ్య యుద్ధ వాతావరణం..?

Bjp

Bjp

Off The Record: కడప జిల్లా జమ్మలమడుగు పాలిటిక్స్‌ ఎప్పుడూ హాట్‌ హాట్‌గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇప్పుడిక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండటం కాక రేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకున్నా… గతంలో ఫ్యాక్షన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఉన్న ఫ్యామిలీ. మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మల మడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో కొత్త సమీకరణలకు దారి తీస్తోందని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయన్నది లోకల్‌ టాక్‌. అంతలా కత్తులు దూసుకుంటున్న ఈ ఇద్దరూ బీజేపీలోనే ఉండటం ఇక్కడ విశేషం. ఇద్దరూ కాషాయ పార్టీ తరపున తొలిసారి పోటీచేసి గెలిచినవారే. వాస్తవానికి ఇద్దరిదీ జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గమే. ఈ పరిధిలోని దేవగుడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వ గ్రామం. అలాగే ఎంపీ సీఎం రమేష్ నాయుడు స్వగ్రామం ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి.

Read Also: Women’s U19 T20 WC: U19 వరల్డ్ కప్ ఆఫ్ ది టోర్నమెంట్ లిస్టులో నలుగురు భారత ఆటగాళ్లు..

అయితే.. గత ఎన్నికల్లో రాజకీయ సమీకరణల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటుకు వెళ్ళి బీజేపీ తరపున గెలిచారు సీఎం రమేష్‌. ఈ క్రమంలో… ఎమ్మెల్యే ని టార్గెట్ చేస్తూ ఎంపీ సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు పొలిటికల్‌ చర్చ, రచ్చకు కారణం అవుతోంది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పేట్రేగిపోతున్న పేకాట, నకిలీ మద్యం, మట్కాను నిలువరించాలంటూ జిల్లా అధికారులకు లేఖ రాశారట రమేష్‌ నాయుడు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన దేవగుడి నాగేశ్వర్ రెడ్డి అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్‌గా ఉన్నారన్నది ఆయన ఆరోపణ అట. దేవగుడి నాగేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి దగ్గరి బంధువు కావడంతో ఆ లేఖతో ఆది ఇరుకున పడ్డట్టు చెప్పుకుంటున్నారు. గతంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సీఎం రమేష్… ఆ టైంలో స్థానికంగా తనదైన రాజకీయ ముద్ర వేసినట్టు చెప్పుకుంటారు. ఇక నియోజకవర్గంలో… అదాని సంస్థ నిర్మిస్తున్న పవర్‌ ప్లాంట్‌ కూడా ఇద్దరి మధ్య ఉన్న అగ్గికి ఆజ్యం పోసింది. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ ఇక్కడ సబ్‌ కాంట్రాక్ట్‌లు చేస్తోంది. ఆ పనుల్ని తమ వర్గీయులకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఏకంగా సంస్థ ఆఫీస్‌ మీదికే దండయాత్రకు వెళ్ళడం తీవ్ర సంచలనం అయింది. అప్పటి నుంచి ఇద్దరు నాయకుల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి వెళ్ళినట్టు సమాచారం.

Read Also: Women’s U19 T20 WC: U19 వరల్డ్ కప్ ఆఫ్ ది టోర్నమెంట్ లిస్టులో నలుగురు భారత ఆటగాళ్లు..

ఇప్పుడిప్పుడే ఆ వివాదం కాస్త సద్దుమణుగుతోందని అనుకుంటున్న టైంలో.. ఎంపీ సీఎం రమేష్ అధికారులకు రాసిన లేఖ జిల్లాలో సంచలనమైంది. నకిలీ మద్యం, మట్కా, పేకాట లాంటి రకరకాల అరాచకాలు జమ్మలమడుగు నియోజకవర్గంలో పెరిగిపోతున్నాయని, వాటిని వెంటనే కట్టడి చేయాలంటూ కడప కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు ఎంపీ. అసాంఘిక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని, అలాంటి వాటిని అణిచివేయాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారాయన.పట్టణంలోని జమ్మలమడుగు క్లబ్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యథేచ్ఛగా పేకాట జరుగుతోందని, వెంటనే యాక్షన్‌ తీసుకోవాలన్నది ఎంపీ ప్రధానమైన డిమాండ్‌. కాపురాల్లో చిచ్చుపెట్టే ఇలాంటి వాటిని ఎంత మాత్రం సహించకూడదన్నది ఆయన వెర్షన్‌. అటు ఎంపీ లెటర్‌కు వెంటనే స్పందించిన పోలీసు అధికారులు.. జమ్మలమడుగు క్లబ్‌ను మూయించేశారు. దాంతో ఎమ్మెల్యే, ఎంపీ వార్‌ పీక్స్‌కు చేరిందని అంటున్నారు పరిశీలకులు. పేకాట క్లబ్‌ను మూయించడం వరకు ఓకే అయినా… ఇలా ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మొదలైన యుద్ధం ఎటు దారితీస్తుందోనని కంగారు పడుతున్నారట జమ్మలమడుగు బీజేపీ కార్యకర్తలు. పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని సెట్‌ చేయకుంటే… నియోజకవర్గంలో కొత్త కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఏపీ కాషాయ నేతలు ఏం చేస్తారో చూడాలి మరి.