NTV Telugu Site icon

Off The Record: వివాదాస్పదంగా బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌..! పార్క్‌ స్థలం కబ్జా చేసి కట్టారని ఆరోపణలు

Brs

Brs

Off The Record: హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ ఇది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను అనుకొని ఉన్న ఈ బిల్డింగ్‌ చుట్టూనే ఇప్పుడు సవాళ్ళ పర్వం మొదలైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాల సముద్రంలోని సర్వే నెంబర్ 1066లో నిర్మించారీ ఆఫీస్‌ని. స్థలం కేటాయింపుపై అప్పట్లోనే వివాదం రేగింది. ఆ తర్వాత నిర్మాణ క్రమంలో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే పార్కు స్థలంలో కట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా సరే.. కరెంట్ కనెక్షన్ ఇవ్వడం, ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. ఈ పొలిటికల్‌ వార్‌లో తామెక్కడ ఇరుక్కుపోతామోనని కంగారుపడిపోతున్నారట అధికారులు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో నిర్మించారు పార్టీ ఆఫీస్‌ని. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌లో ఓడిపోయింది బీఆర్‌ఎస్‌. నాటి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఓడిపోగా.. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నాయిని రాజేందర్ రెడ్డి గెలిచారు. క్యాంప్‌ ఆఫీస్‌లో రాజేందర్ రెడ్డి చేరగా.. పక్కనే బీఆర్ఎస్ పార్టీ ఉండటం వల్ల తరచూ ఇబ్బందులు వస్తున్నాయట. ఒకే రోజు రెండు పార్టీల కార్యక్రమాలు ఉంటే.. ఒక రకంగా యుద్ధ వాతావరణం ఉంటోందంటున్నారు స్థానికులు. ఈ గొడవలు పడలేక అధికారులకు ఫిర్యాదు చేశారట ఎమ్మెల్యే నాయిని.

Read Also: Shocking VIDEO: ఏమరపాటుగా కారు పార్కింగ్.. క్షణాల్లో ఏం జరిగిందంటే..!

పార్కు స్థలంలో కట్టిన పార్టీ ఆఫీస్‌ను తరలించి వేరేచోట ప్రభుత్వ స్థలమే చూపించమంటూ అధికారులకు లెటర్ పెట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేటాయిచిన స్థలాన్ని క్యాన్సిల్ చేయడంతో పాటు బిల్డింగ్‌ పర్మిషన్‌ కాపీలు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌కు లేఖ రాశారు మున్సిపల్‌ అధికారులు. కానీ.. పర్మిషన్‌ తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. నేరుగా వినయ్‌ భాస్కర్‌కే నోటీసులు ఇచ్చారట మున్సిపల్‌ ఆఫీసర్స్‌. ఆ తర్వాతే సిసలైన పొలిటికల్‌ డ్రామా మొదలైందంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చే కుట్ర చేస్తున్నారని, ఒక్క ఇటుకను కదిపినా.. మేం గాంధీభవన్‌ను టచ్‌ చేస్తామంటూ హెచ్చరించారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి అప్పుడున్న నామినల్ రేట్ ప్రకారం స్థలం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అలాగే హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఆంధ్రా బ్యాంకుకు ఏ విధంగా కిరాయికి ఇచ్చారో తెలపాలన్నారు. ఈ సవాళ్ళతో వరంగల్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది.

Read Also: TGPSC: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల

బీఆర్ఎస్‌ స్టేట్‌మెంట్స్‌పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. ఎకరం పార్క్‌ భూమి ఆక్రమించి పార్టీ ఆఫీస్ కట్టిందే కాకుండా.. ప్రగల్భాలు పలుకుతున్నారా అంటూ రివర్స్‌ అవుతున్నారాయన. ఆఫీస్‌కు డోర్‌ నంబర్‌ లేదు, ఎక్కడో స్థలం కేటాయిస్తే.. ఇక్కడ అక్రమంగా కట్టారని, అక్రమ నిర్మాణాన్ని తొలగించే దాకా ఎంత దూరమైనా వెళ్తామంటున్నారట ఎమ్మెల్యే. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తామెక్కడ ఇరుక్కుపోతామోనని ఇప్పుడు అధికారులకు భయం పట్టుకుందని అంటున్నారు. అక్రమంగా నిర్మించి ఐదేళ్ళ నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తమను ఎక్కడ దోషులుగా నిలబెడతారోనని కంగారు పడుతున్నారట మున్సిపల్‌ ఆఫీసర్స్‌. మరోవైపు అసలు బిల్డింగ్‌ ఎవరి పేరు మీద ఉందో తెలియకుండానే కరెంట్ కనెక్షన్ ఎలా ఇచ్చారు? మున్సిపల్‌ పర్మిషన్స్‌ లేకుండా నిర్మించిన భవనానికి ఇన్నాళ్ళు ఎలా పవర్ సప్లై చేశారని ఆరా తీస్తుండటంతో ఆ శాఖ అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయంటున్నారు. ఎప్పుడు ఎట్నుంచి ఎలాంటి వత్తిడి వస్తుందోనన్న టెన్షన్‌లో నిద్ర పట్టడం లేదట కొందరు వరంగల్‌ అధికారులకు . బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ ఎపిసోడ్‌ ఎట్నుంచి ఎటు టర్న్‌ అవుతుందో.. ఎవరు బలవుతారో చూడాలి.