NTV Telugu Site icon

Off The Record: ఖమ్మం జిల్లాకు పదవుల వర్షం.. కార్పొరేషన్ పదవుల్లో ఆరుగురికి ఛాన్స్..!

Kmm

Kmm

Off The Record: తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కోట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ.. హస్తం హవా కొనసాగింది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో 9 చోట్ల గెలుపొందడంతో.. ఖమ్మం జిల్లాకి డిప్యూటీ సీఎంతో పాటు మరో రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజాగా కార్పొరేషన్ పదవుల పందారంలోనూ.. ఆరు మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. ఇంతటితో హస్తం కేడర్‌ను సంతృప్తి పరిస్థితి కనిపించడం లేదు. పదవులు కోసం మంత్రుల చుట్టూ నేతలు మాత్రం ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన పదవుల పందేరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు వీరిని చైర్మన్లుగా నియమించింది. గత ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పొదెం వీరయ్య. ఆయనకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం చివరి నిమిషం వరకు రాయల నాగేశ్వరరావు ప్రయత్నించారు. ఆయనకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ పదవి దక్కింది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమిపాలైన రాయల నాగేశ్వరరావుకి కార్పొరేషన్ పదవి ఇచ్చింది.

Read Also: IND vs SA: సౌతాఫ్రికాపై భారత్ గెలుపు.. సిరీస్ సమం చేసిన ఉమెన్స్ జట్టు

డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబును.. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించింది. మొవ్వ విజయబాబు బిఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ.. ఆయన ఇబ్బందులకు గురయ్యాడు. అప్పట్లో ఆయనపై కేసుల మీద కేసులు కూడా పెట్టారు. తుమ్మల నాగేశ్వరరావు ప్రియ శిష్యుడుగా ఉన్న విజయబాబు.. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రియ శిష్యుడుగా మారారు. తిరుమలాయపాలెం మండలానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, సింగరేణి కార్మిక సంఘం నాయకుడు జనక్‌ప్రసాద్‌ను కనీస వేతనాల చట్టం అమలు సంస్థ చైర్మన్‌గా నియమించింది. వైరా నియోజకవర్గానికి చెందిన నాయుడు సత్యనారాయణకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి దక్కింది. అదే నియోజకవర్గానికి చెందిన నూతి శ్రీకాంత్‌ను రాష్ట్ర బీసీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా నియమించింది. నామినేట్ పదవులు పొందిన నేతలిద్దరూ.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వగ్రామం లక్ష్మీపురం వాసులే.

Read Also: Off The Record: చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? రేవంత్ రెడ్డి ఏపీని టార్గెట్ చేస్తారా..?

ఈ నామినేటెడ్‌ పదవులను.. రాష్ట్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందే ఖరారు చేసింది. అయితే ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడం వల్ల అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. గత మార్చిలో ప్రకటించిన కార్పొరేషన్‌ పదవుల్లో…మువ్వా విజయ్‌బాబు పదవి మాత్రమే మారింది. ఆయనకు తొలుత విద్యావనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవిని కేటాయించారు. తాజాగా ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ పదవులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…తమ అనుచరులకు ఇప్పించుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటి వరకు తన అనుచరులకి నామినేటెడ్‌ పోస్టులు ఇప్పించుకోలేకపోయారు. రెండో దఫాలో కార్పొరేషన్ పదవులు వస్తాయని తుమ్మల, ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు.