Off The Record: కట్టప్పల మీద యాక్షన్ ఉంటుందా..? సీనియర్ల అసమ్మతికి హైకమాండ్ ఇచ్చే ట్రీట్‌మెంట్..?
- పార్టీ చెప్పిన వాళ్ళకు టిక్కెట్స్ ఇవ్వని ముగ్గురు ఎమ్మెల్యేలు..
- సీరియస్ అయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం..
- ఎన్నికల తర్వాత చూద్దామన్నట్టు అప్పట్లో చర్యలు వాయిదా..
- వారాలు గడుస్తున్నా యాక్షన్ ఏదంటూ ఇప్పుడు వాయిస్..
- చేవెళ్ళ, తుంగతుర్తి, ఉమ్మడి వరంగల్‌లోని మరో ఎమ్మెల్యేపై ఆరోపణలు..
- సీరియస్‌గా పరిగణిస్తున్నామన్న పీసీసీ చీఫ్..
- తుంగతుర్తి, జనగామలో లీడర్స్, కేడర్‌కు గ్యాప్ ఉందన్న ఎంపీ చామల..
- ఇతరుల ఇన్ఫార్మర్స్ ఉన్నారంటూ సీరియస్ కామెంట్స్..
- ఇలా వదిలేస్తే ఎన్నికల నాటికి ఇబ్బంది అవుతుందన్న అభిప్రాయం..
- పటాన్‌చెరులో కాంగ్రెస్ నడ్డి విరిచిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి..
- చర్యలు ఉంటాయా? ఉండవా? అంటూ కాంగ్రెస్‌లో చర్చ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నష్టం కలిగించే నాయకులను ఏ రాజకీయ పార్టీ ఉపేక్షించదు. కాస్త ముందో, వెనకో… తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఒకవేళ వెన్నుపోట్లు ఉన్నట్టు తెలిసినా… ఆ సంగతి బయటపడక ముందే జాగ్రత్తలు ఉంటాయి. కానీ…. పార్టీలందు కాంగ్రెస్ పార్టీ వేరయా అన్నట్టుగా ఉంటింది వ్యవహారం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆ సంగతి మరోసారి బయటపడింది. ఇక్కడ ఫుల్ రివర్స్‌లో ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ చెప్పిన వారికి కాకుండా తమకు నచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చుకున్నారు. దీనిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది. ఎన్నికల ముందు గొడవ ఎందుకని అనుకున్నారో ఏమోగానీ… ఆ వ్యవహారాన్ని అప్పటికి వదిలేశారు. అంటే…ఎన్నికలు పూర్తయ్యాక చూద్దామన్నట్టు వాయిదా వేశారన్న మాట. కానీ…. ఇప్పుడు నష్ట పోయిన నేతలంతా.. దిద్దుబాటు చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, తుంగతుర్తి MLA మందుల సామేల్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో శాసనసభ్యుడి మీద కూడా ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ నాయకత్వం ఎంపిక చేసిన వారికి కాకుండా…తమకు నచ్చిన వారికి బీ ఫామ్స్ ఇచ్చారట సదరు శాసనసభ్యులు.
ఇది పార్టీని, నాయకత్వాన్ని మోసం చేయడమే అవుతుంది. ఇదే అంశం పై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్… మీడియాతో మాట్లాడినప్పుడు సీరియస్‌గానే పరిగణిస్తున్నామని, సరైన సమయంలో నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఎన్నికలు ముగిసి వారాలు గడుస్తున్నా… చర్యలు ఎక్కడంటూ వాయిస్ రెయిజ్ చేస్తున్నారు నష్టపోయిన నాయకులు. ఇటీవల తుంగతుర్తి నియోజక వర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల పై ఎంపీ చామల కిరణ్ కొన్ని కామెంట్స్ చేశారు. తుంగతుర్తి తో పాటు జనగామ నియోజకవర్గంలో క్యాడర్‌కు, లీడర్స్‌కు గ్యాప్ ఉందని, ఇతరుల ఇన్ఫార్మర్స్ ఉన్నారంటూ కామెంట్ చేశారాయన. ఇది తీవ్రమైన అంశం. పార్టీ లో ఉంటూ..ప్రత్యర్ధి పార్టీకి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటే…. అలాంటి వాళ్ళు ఏదో ఓ రోజు పార్టీ పుట్టి ముంచేస్తారు. ఓ వైపు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బి ఫామ్స్ పార్టీ చెప్పిన వాళ్లకు కాకుండా మరొకరికి ఇవ్వడం.. సొంత పార్టీలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారని స్థానిక ఎంపీ చెప్పినా… ఇప్పటి వరకు పార్టీ నాయకత్వం అటు వైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి…ఇప్పటికిప్పుడు ఇదేం పెద్ద సమస్య గా కనిపించక పోవచ్చు. కానీ సాధారణ ఎన్నికల నాటికి… చిన్న చిన్న సమస్యలు కూడా మెడకు పామై చుట్టుకుంటాయి.
Also Read
ఇవే కాదు హైదరాబాద్ ను అనుకుని ఉన్న పటాన్‌చెరులో కూడా అంతే. పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మహిపాల్ రెడ్డి ఆఖరి నిమిషంలో నేను బీఆర్‌ఎస్ అని ప్రకటించుకుని అక్కడ కాంగ్రెస్ నడ్డివిరిచారు. చేవెళ్ల లో కూడా కాంగ్రెస్ చెప్పిన వాళ్లకు కాకుండా సొంత వాళ్ళకే టికెట్ల ఇచ్చుకున్నారు. బయట నుండి వచ్చిన వాళ్ళు ఏం చేసినా పార్టీ నాయకత్వం ఎందుకు సైలెంట్ గా ఉందనేది కూడా క్యాడర్ కి అర్థం కాని పరిస్థితి. పార్టీకి నష్టం చేసిన వాళ్లపై చర్యలు ఉంటాయా..? ఉండవా..? అనేది మరో రచ్చ. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఉన్నా… ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నట్టు..? పాత వారికి నష్టం జరిగితే ఊరుకునేది లేదని మీటింగుల్లో డైలాగులు వేస్తారు కానీ… ఇక్కడ పార్టీకే నష్టం జరుగుతున్నా… మీనాక్షి మేడం కనీసం కొరడా కూడా జులిపించడం లేదని గాంధీ భవన్ లో నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
తాజావార్తలు
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..